
సమయం!..ఆ సమయం చెబుతుంది.,
నువ్వెంత ముఖ్యమో అని!!
నీ వారెవరని!..వారికి నీవెవరని!!
నీ కళ్లలో కాంతులు వెలిగించిన వారే…
కన్నీటి భాష్పాలై వీడ్కోలు పలుకుతారని!..
నీకై తన సమయాన్ని వెచ్చించలేని నిరుపేద తానని..!
కడగండ్లలో కన్నీరు తుడవలేని కరములే కటిక సత్యాలని!..
కడవరకు అనేది కవితల్లోనే,
కథల్లో కూడా ఏకాకితత్త్వమే కరెక్టని!..
భవబంధాలకు,భావోద్వేగాలకు చలించని కృత్రిమమే మా’నవు”డని!!…
పై పై మెరుగుల ప్లాస్టిక్ ప్రేమలే
ఈ తరానివని!..
తన పాత్రకు సెలవని పయనించే మరో ‘మజిలీ”ని పరిచయం చేస్తుంది ఆ సమయం!!!
_