
పల్లెటూర్లు మనకు పట్టుకొమ్మలు….
పాడిపంటలకు భాగ్య సీమలు..
పచ్చని మామిడాకు తోరణాలు
పల్లెలు
వాసన లేక వెలవెల పోయే
రంగు రంగుల కాగితం పూలు పట్నాలు…
నగరీకరణ పేరుతో రూపురేఖలు మారి
నవీన పోకడలతో జనారణ్యమయ్యి
సుసంపన్నం అని చెప్పుకునే దుర్భర జీవనం పట్నవాసం…
ఒకరికొకరు మనస్ఫూర్తి
గా మాటలో మాటై
అక్క ,అన్న, అవ్వ ,అత్త ,కాక ,మామన్న ఆప్యాయత ,అనురాగాల పలకరింపులు పల్లెలు….
ఎవరి దారి వారిదిన్న చందం పట్టణ వాసులు…
ఒక్క వాన కోసం ఎదురు చూపులు పల్లెల్లో…
వానతో నాళాలు తెగి రోడ్లు సంద్రాలు పట్టణాల్లో…
పంచ మాంగల్యాలు లతో అలరారు పల్లెపడుచులు…
అన్ని వొలిచి అలమరా లో భద్ర పరిచేది పట్టణ వాసులు…
ఆకలేస్తే అమ్మ చేతి గోరు ముద్దలు పల్లెలు…
ఆర్డర్ చేస్తే వచ్చే పిజ్జా బర్గర్ల విష సంస్కృతులు పట్టణాలు…
చక్కని ప్యాంటు చిరిగితే పరువు పోతుందని కుట్టి కట్టేవి పల్లెలు…
చిరిగిన గుడ్డల ఫ్యాషన్లు పట్నాలు
ఆప్యాయతానురాగాలు పుట్టిల్లు పల్లెలు…
ఊసరవెల్లి మనస్తత్వాలు పట్నాలు…
దేశ ,కాల,మాన పరిస్థితుల
నవీన త్వాన్ని ఆదరణలో మరచిపోక మూలాలు …
మన సంస్కృతి సంప్రదాయాల గౌరవాదరాలు
నీవై
మనమై
ముందుకు వెళ్లడం
అందుకొని నడవడం
శ్రేయోదాయకం