సూర్యభగవానుడు
ఉత్తరాయణ ప్రయాణంలో
మకర రాశిలో ప్రవేశించిన
చైతన్యవంతమైన దినం
సంక్రాంతి సంబరం!
ఆరుగాలం శ్రమించిన పంట
రైతన్నల ఇంటికొచ్చిన
ఆనందదాయకమైన రోజు
సంక్రాంతి వేడుక !
స్వర్గలోకంలో ఉన్న
రక్తసంబంధీకుల్ని
సాదరంగా ఆహ్వానించి
ఆతిథ్యమిచ్చి
మననం చేసుకునే
కృతజ్ఞతా సందర్భం
సంక్రాంతి పర్వదినం!
దీక్షా స్వాములకు
జ్యోతి స్వరూపునిగా
అభయ ప్రదాయ
అయ్యప్పస్వామి ఆశీర్వదించే
పవిత్ర సమయం
సంక్రాంతి శోభ!
బతుకుతెరువు కోసం
ఉద్యోగ వ్యాపారాల కోసం
పట్టణాలకు పోయిన
వలస జీవులు
స్వగ్రామాలకు వచ్చి
పలకరించే ఉబలాటం
సంక్రాంతి వైభవం!
జయహో సంక్రాంతి
జయ జయహో
సంప్రదాయ సంపత్తి !
వై.సు జాత ప్రసాద్
లచ్చపేట
సిద్దిపేట
9963169653