కొత్తగా ఆలోచించాలి. అప్పుడే జీవితం మాధుర్య భరితం అవుతుంది. ఈ విషయాన్ని కవయిత్రి ,రచయిత్రి ,తెలుగు ఉపాధ్యాయురాలు కామేశ్వరి ఓగిరాల గారు తెలుగు వ్యాకరణం లోని అక్షర మాల నుండి అచ్చులు హల్లులు , వర్గాక్షరాలు, సంధులు సమాసాలు అలంకారాలు ఛందస్సు వంటివి నిత్య జీవితానికి అన్వయం చేస్తూ చక్కగా క్లుప్తంగా రాస్తున్నారు. సీరియల్ గా వచ్చే ఈ విశేషాలను చదివి ఆనందించండి.
– డాక్టర్ కొండపల్లి నీహారిణి
తరుణి సంపాదకురాలు
మిత్రులారా పోయిన వారం వ్యాకరణానికి మనుష్యులస్వభావాలకు పోలికలు ఎలా కన్పించాయో చూసాము. ఈ వారం మరి కొన్ని అంశాలతో మీ ముందుకు వచ్చాను.

లోకంలో కొంతమంది పైకి ఎంతో గంభీరంగా పరుషంగా కన్పిస్తారు. తనకు ఎదురు లేరు అనుకుంటారు కానీ మనసు వెన్నపూస. అలాంటి వాళ్ళు కూడా ఎలా అణచి వేయ బడతారో చూడండి.
కొంతమంది పైకి సరళంగా అమాయకంగా కన్పిస్తారు. కాని తమ మాటలతో చేష్టలతో ఎంతటి వారినైనా లొంగ డీసుకుంటారు.చూడండి
దీనికీ మంచి ఉదాహరణ
దృత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
క చ ట త ప లు పేరుకు మాత్రమే పరుషములు. కానీ
సరళముల ముందు దిగదు డు పే
పూచేన్ +కలువలు
క స్థానం లో గ వస్తుంది
సరళాలు రావటమే కాదు బిందు సంశ్లేషా లను వెంటఁ తీసుకు వచ్చి దృతానికి స్థానం లేకుండా చేస్తాయి.
కొంతమంది వెనుక ఉండి ఎంతో సహాయం చేస్తారు. వారికి పేరు రావాలని కోరుకోరు.
అలాగే దృతం కూడా తన రూపం మార్చుకొని మాయమవుతుంది.
గ స డ ద వ లు కూడా ఏ మాత్రం తీసిపోవు పరుషాలను నామ రూపాలు లేకుండా చేస్తాయి.
మరి కొన్ని స్వభావాలను వచ్చే వారం చూద్దాం