వీడ్కోలు(Fall Season )

Dr. లక్కరాజు నిర్మల

నీలాకాశం
ఆకుపచ్చని ప్రకృతి
పసిడి నేల
రాత్రి మంచు కరిగి
వెండి వెలుగుల పచ్చికబయళ్ళు
ప్రొద్దుతిరుగుడు పువ్వుల
సూర్య నమస్కారాలు
రంగురంగుల పువ్వులు
గోధుమ చెట్లు గాలి ఉయ్యాలలు
నేను యూఎస్ వచ్చినప్పటి నుంచి
ఈ చల్లటి ప్రకృతిలో
ఉదయపు సూర్యకాంతి
ఎంతో ఆనందాన్నిస్తుంది
ఆకుపచ్చని ప్రకృతి
నీలాకాశం
చల్లటి చిరుగాలి
మెత్తటి నేల భూమిపై కాలు పెట్టగానే
పులకరించి పోతుంది శరీరం
రోజు ఈ పచ్చని ప్రకృతిలో
ముచ్చట్లు చెబుతూ
నానడక ఎంతో ఆనందాన్నిచ్చింది
ఆరోగ్యాన్ని ఇచ్చింది
పాజిటివ్ ఎనర్జీ నిచ్చింది
కానీ
ఈ నాలుగు రోజులలో
నేను తిరిగి ఇండియా వెళ్లిపోతున్నానని
కన్నీరు కారుస్తూ
ఆకుపచ్చని ఆకులు
ఎర్రని కళ్ళనీళ్ళతో
పసుపు పచ్చగా మారుతున్నాయి
నేను ఇండియా వెళ్తున్నానని
మేము రాలిపోతాం అంటూ
మా రాము చేస్తున్నాయి
గాలికి ఊగుతూ
పిచ్చిగా రాలుతూ
ఆకులన్నీ కన్నీరు కారుస్తూ
ఎర్రటి బుగ్గలపై పసుపు పచ్చని ఆకులు
నేల రాలి నా పాదాలకు నమస్కరిస్తున్నాయి.
అయ్యో ఈ ప్రకృతికి
నేనంటే ఎంత ఇష్టం
నేను మళ్ళీ వస్తానమ్మా
ఇంకో ఆరు నెలల్లో అంటే
నాకోసం ఎదురు చూస్తూ
ఆకులన్నీ రాలుస్తూ
కనిపించని సూర్యుడు
కనిపించని నాకోసం
మోడులా మారి
కన్నీరు కారుస్తూ
నా కోసం ఎదురు చూస్తానంటున్నాయ్
నేనంటే ఎంత ఇష్టం ఈ ప్రకృతికి
నేను వెళుతున్నానని బాధపడి కన్నీరు కార్చి ఎర్రగా మారి బుగ్గలు పచ్చనై
రాలిపోతూ వాడిపోతూ
నా కాళ్ళకి మొక్కుతున్నాయి
రాలే ఆకుల గల గలలు
నా హృదయాన్ని
కలవరపరుస్తున్నాయి.
నేను మళ్ళీ వచ్చేదాకా
చిగురించమని చిగురులు వేయమని
మొండికేసి పసిపిల్లా మారం చేస్తున్నాయి
నేను ఉన్న ఈ నాలుగు రోజులు
చల్లటి ఆహ్లాదకర వాతావరణం ఇస్తామని
నేను వెళ్లే రోజు నుంచి
కాలము మారిపోతుందని
టైం జోను మారిపోతుందని
నాకోసం తపిస్తూ
కాలనీలో అందరూ తలుపులేసుకుంటారని
ఎవరి ఇంటి తలుపులు తెరవరని
బయటకొస్తే మంచు
బిందువులు చల్లటి చలి
నాకోసం ఏడ్చి ఏడ్చి
ఈ ప్రకృతి
గడ్డ కట్టుకు పోతుందట.
ఈ ప్రకృతికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోను
నేను ఉన్నన్ని రోజులు
ఆనందంగా ఆటలాడుకున్నాం
పాడుకున్నాం
ఆహ్లాదంగా గడిపాను
ఆకుపచ్చని ఆకులు
రంగురంగుల పువ్వులు
పళ్ళు నన్ను ఆహ్వానించాయి
ప్రకృతి ముస్తాబై
పేరంటానికి నన్ను పిలిచాయి
ఈ వనంలో ఓ కుర్చీ వేసి
చెట్టు క్రింద
తాంబూలాలిచ్చి
ఆశీర్వదించాయి
ఈ ప్రకృతికి నేను ఇంత మంచి నేస్తాన్ని అయ్యాను
మా అన్యోన్యత చూసి
అందరూ కుళ్ళుకునేవారే
మాకు దిష్టి తగిలిందా!!!!!!
ఈ ప్రకృతికి-నాకు
ఎంత మంచి అన్యోన్యత
ఏ పూర్వ జన్మ పుణ్యమో కదా
నేస్తం
నీవు నేను ఒకటే
మనిద్దరి అనుబంధం విడదీయరానిది
మనిద్దరి అన్యోన్యత
ఆత్మీయత మరపురానిది.
మీరు నేను ఒకటే
నాలోను మీరు
మీలోను నేను
నాకు బాధగానే ఉంది
మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్తున్నానని
మరిచిపోకు నేస్తం
నీ వీడ్కోలు (Fall season)
మన అనుబంధం
విడదీయరానిది
నా నోట మాటలు రావడం లేదు
మళ్లీ వస్తాను బాయ్ బాయ్
ఈ విశ్వంలోని పంచభూతాలకి
పేరుపేరునా కృతజ్ఞతలు కృతజ్ఞతలు

Written by Lakkaraju Nirmala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కార్తీక మాస విశిష్టత

ఎడారి కొలను