యూరోప్ ట్రిప్ – 15 

తేది: 22-8-2024. కిందటి వారం తరువాయి భాగం… 

పారిస్ సైట్ సీయింగ్నెపోలియన్ గ్రాండ్ ఆర్చ్ 

నిన్న లండన్ డోవర్ నుంచి ఫ్రాన్స్ లోని కలైస్ చేరేసరికి  పారిస్ టైమ్ 15.25 అయింది. అక్కణ్ణుంచి మరో రెండు గంటల ప్రయాణం తరువాత హోటల్ బిఎన్ బి నార్డ్ లో చెకిన్ అయ్యాము కదా. మరునాడు ఉదయమే ఎనిమిది కల్లా బ్రేక్ ఫాస్ట్ కి డైనింగ్ హాల్లోకి రావాలని, ఎనిమిది ఏబై కల్లా బస్సు బయలు దేరాలని రాత్రే వైదేహి మెసేజెస్ పెట్టింది. వెంట అవసరమైన జాకెట్స్ మెడిసెన్స్, తెచ్చుకోవాలని కూడా రాసింది. ఆరోజు పారిస్ సిటీ సైట్ సీయింగ్ ఉంటుందట.  

ఉదయం తొమ్మిది గంటలకు బస్ లో బయలు దేరాము. మొదటగా నెపోలియన్ బొనపార్ట్ సైనికుల విజయ పరంపరలో భాగంగా ఏర్పాటు చేసిన చార్లెస్ దె గల్లె ఎటాయిల్’ అనే ఆర్చ్ ని చూసాము. అది పూర్తి అయ్యే లోపే ఆయన చనిపోవటం జరిగిందట. రోమన్ ఆర్ట్ లో నిర్మించిన ఆ గ్రాండ్ ఆర్చ్ గురించిన విశేషాలు వివరించే ముందు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగిన నెపోలియన్ బోనపార్ట్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చక్రవర్తి ఎలా అయ్యాడో ఆయన  జీవితపు చారిత్రక విశేషాలు తెలుసుకున్నాం. 

నెపోలియన్ బోనపార్టీ (ఆగస్టు 15, 1769 మే 5,1821)ఫ్రాన్సు కు చెందిన సైన్యాధ్యక్షుడు, రాజకీయ నాయకుడు.ఐరోపా చరిత్రపై బలమైన ముద్ర వేసినవాడు. అతను1769 ఆగస్టు 15 న కొర్సికా దీవిలో అజోసియాలో, ఒక న్యాయవాది కుటుంబంలో జన్మించాడు. పారిస్ లోచదువుకున్నాడు. అతనికి చరిత్ర, రాజనీతి శాస్త్రము, గణితం, తత్వశాస్త్రాలపై ఆశక్తి మెండు. నెపోలియన్ మీద రూసోప్రభావం అధికంగా వుండేది. 1785 లో ఫ్రెంచి సైన్యంలో లెఫ్ట్‌నెంట్‌గా నియమితుడయ్యాడు. 

1792 లో ఫ్రెంచ్ విప్లవం జరుగుతున్న రోజుల్లో నెపోలియన్, విప్లవాత్మకమయిన అరాచకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఫ్రెంచి విప్లవాన్ని అంతం చేయడానికి యూరోపియన్ దేశాలు చేసిని ప్రయత్నాల్లో భాగంగా 1793 వ సంవత్సరంలో నౌకదళం టేలర్ను పట్టుకోవడానికి ఇంగ్లీషు నౌకాదళం ఫ్రాన్స్ మీద దాడి చేసింది. నెపోలియన్ వారిని సమర్ధవంతంగా నిలవరించాడు. ఈ విజయం తరువాత అతనిని బ్రిగేడియర్ జనరల్‌గా పదోన్నతిని కల్పించారు. ఆ తరువాత1795 అక్టోబరులో  నెపోలియన్ సాధించిన విజయం వల్ల అతనిని సైనికాధిపతిగా నియమించారు. నెపోలియన్ఆస్ట్రియా, ఇటలీ (సార్డీనియా) దేశాలమీద దాడిచేసి విజయం సాధించాడు. ఆస్ట్రియా, ఇటలీ (సార్డీనియా) యుద్ధాలు నెపోలియన్ వ్యక్తిగత ఘనతను పెంచాయి. నెపోలియన్ అద్భుతవిజయాల వల్ల అతనిని ఫ్రెంచి ప్రజలు గొప్పనాయకుడిగాను గౌరవించారు. ఫ్రాన్స్ శత్రువయినఇంగ్లాండునుఓడించడానికి సిద్ధపరిచిన సైన్యానికి నెపోలియన్‌ను అధిపతిగా డైరెక్టరీ నియమించింది. విస్తృతమయిన నౌకాబలం లేకుండా ఇంగ్లాండును ఓడించడం కష్టమని, ఇంగ్లాండుకు కీలకమయిన ఈజిప్టు మీద 1798 మేలో దాడిచేసాడు. పిరమిడ్ యుద్ధంలో విజయం సాధించినప్పటికి,ఇంగ్లాండునౌకాధిపతి నెల్సన్ చేతిలో పరాజయం చెందాడు. 

 నెపోలియన్ ఫ్రాన్స్ తిరిగివచ్చాడు. ఆ సమయంలోఫ్రాన్స్ కు ఐదుగురు సభ్యులతో కూడిన డైరెక్టరీ పాలకమండలి పరిపాలించేది. ఈ పాలకమండలిలో ఐక్యత కొరవడింది. శక్తివంతమయిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయుటలో విఫలం చెందింది. డైరెక్టర్ల మధ్య కాని, డైరెక్టరీకి, శాశనసభకు మధ్య కాని సరిగా సంబంధాలు లేవు. తగాదాలు, కుట్రలతో పాటుగా సాంఘిక ఆర్థిక అక్రమాలు సర్వసాధారణమయ్యాయి. డైరెక్టరీ విధానం ప్రజల మద్దతును పొందలేకపోయింది. ఫ్రాన్స్ అంతరంగిక పరిస్థితి దెబ్బతింది. ఖర్చు మితిమీరిపొయింది. ప్రజలు పాలనలో మార్పును కోరుకున్నారు. పటిష్ఠమయిన, సమర్దవంతమయిన పరిపాలన కోసం ఎదురుచూశారు. అదే సమయానికి నెపోలియన్ ఫ్రాన్స్ చేరి సైన్యంతో పాటు శాశనసభ లోకి ప్రవేశించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నడు. నెపోలియన్ అధికారాన్ని చేపట్టిన తరువాత, కాన్సులేట్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసాడు. ఈ ప్రభుత్వం 1799-1804 ల మధ్య కొనసాగింది. 

నెపోలియన్ఫ్రాన్స్ వ్యతిరేకంగా వున్నఇంగ్లాండు, ఆస్ట్రియా దేశాలతో సంధులు కుదుర్చుకొని యుద్ధాల నుండిఫ్రాన్స్ ను కాపాడి శాంతి ఏర్పరిచాడు. అనంతరం ప్రజల మధ్య సాంఘిక, ఆర్థిక సమానత్వాన్ని కల్పించుటకు ప్రయత్నించాడు. కాని స్వేచ్ఛ సిద్ధాంతాలను వ్యతిరేకించాడు. నెపోలియన్ దృష్టిలో ” ఫ్రాన్స్ ప్రజలకు కావలిసినది సమానత్వం కాని స్వేచ్ఛ కాదు”. దేశ శాంతిభద్రతల కోసం బలమయిన కేంద్రీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నించాడు. 

“ప్రజలకు కావలిసినది మతం, కాని ఆ మతం ప్రభుత్వ ఆధినంలో వుండాలి” విప్లవకాలంలో రూపొందించిన రాజ్యాంగం కారణంగా సమాజంలో ఒక వర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వుందని గ్రహించి రోమన్ కేథలిక్ చర్చి యొక్క మతాధికారి అయినపోప్ తో ఒప్పందం కుదుర్చుకొని ఫ్రాన్స్ లో మతాచార్యుల నిర్వాహణ బాధ్యతలను నెపోలియన్ స్వీకరించాడు. చర్చి ఆస్తులను ప్రభుత్వం స్వాధిన పరచుకోవటానికి పోప్ అంగీకరించాడు. ఫ్రెంచ్ విప్లవానికిమునుపుఫ్రాన్స్ లో నిర్ణీత న్యాయవ్యవస్థ లేదు.  ప్రఖ్యాత న్యాయవేత్తల సహాయంతో నెపోలియన్ న్యాయస్మృతిని రూపొందించాడు.   

ఫ్రెంచ్ విప్లవం సంభవించుటానికి ఆర్థిక సమస్య ముఖ్యకారణమని నెపోలియన్ గుర్తించాడు. దేశంమొత్తానికి క్రమబద్ధమయిన శిస్తు వసూలు చేయు విధానాన్ని ప్రవేశపెట్టి, అవినీతి ఉద్యోగులను కఠినంగా శిక్షించాడు. వ్యయంలో దుబారా తగ్గించాడు. దేశీయ పరిశ్రమలను ప్రొత్సహించాడు. నదులమీద ఆనకట్టలు నిర్మించి వ్యవసాయాభివృద్ధికి కృషి చేసాడు. 1800 వ సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ ను స్థాపించాడు. నాణాల చెలమణీని క్రమబద్దం చేసాడు. మొదటి కౌన్సిల్ గా అధికారం చేపట్టిన తరువాత నెపోలియన్ తన స్థానాన్ని భద్రపరచుకోటానికి వీలుగా అనేక చర్యలు చేపట్టాడు. క్రమక్రమంగా ఈ లక్ష్యాన్ని చేరుకోగలిగాడు. 1804 డిసెంబరు 2న పోప్ చేత నెపోలియన్ చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైనాడు.ఆ తరువాత తన విజయవంతమయిన దాడుల ద్వారాఐరోపాచిత్రపటాన్ని తిరిగి గీయించాడు. పరోక్ష యుద్ధంలో ఇంగ్లాండును ఓడించడానికి ప్రసిద్ద ఖండాంతర విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ విధానం ద్వారా ఇంగ్లాండు వర్తకాలను ధ్వంసం చేయాలని భావించాడు.  పొరుగు దేశాలపై యుద్దాల వల్ల, తన విధాన్నాన్ని విజయవంతం చేయడానికి అతడు చేప్పట్టిన చర్యలన్ని అతని పతనానికి కారణం అయ్యాయి. 

ఉత్తర జర్మనీలో బాల్టిక్ సముద్రం వరకు గల విశాల ప్రాంతాన్ని ఆక్రమించాడు. స్పెయిన్, ఫ్రాన్స్ దేశానికి సామంత రాజ్యంగా మారింది.  పోర్చుగల్ కూడా స్పెయిన్ ను అనుసరించింది. ఆస్ట్రియా కూడా బలహీనంగా మారింది. జర్మనికూడా ఫ్రాన్సుకులోబడివుండు విధంగా రైన్ సమాఖ్యను ఏర్పాటుచేసి తాను దానికి సంరక్షకుడిగా తన అధికారాన్ని స్థాపించాడు. ఈ విధంగా నెపోలియన్యూరోప్ మొత్తానికి అధిపతి అయినాడు.ఫ్రాన్స్, యూరప్ కు రాజకీయ రాజధాని అయింది. 1808 నాటికి నెపోలియన్ యొక్క అధికారం ఫ్రాన్స్ లోనే గాక యూరోప్ మొత్తానికి విస్తరించింది. నాటి యూరోప్ రాజ్యాలన్ని నెపోలియన్ పట్ల భయంతో కూడిన గౌరవాన్ని ప్రదర్శించాయి. ఆ తరువాత అతికొద్ది కాలంలోనే నెపోలియన్ పతనం ఆరంభమయింది. భూఖండ విధాన అమలులో నెపోలియన్పోర్చిగల్, స్పెయిన్ లతో వినాశకరమైన యుద్ధము చేయవలసి వచ్చింది.  స్పెయిన్ లో  ఫ్రాన్స్ అధికారానికి వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు జరిగాయి. వీటిని అణచుటకు నెపోలియన్ తన సైన్యాన్ని అధికంగా వినియోగించవసివచ్చింది. అయినా వైఫల్యం తప్పలేదు. సముద్రాదిపత్యం లేకపోవడం కూడా నెపోలియన్ పతనానికి కారణం అయింది. జాతీయతా భావం, ఫ్రెంచి విప్లవం నుండి ఐరోపా అంతటికి విస్తరించింది.   

రష్యా, ఆస్ట్రియా ప్రష్యా దేశాలు కలిసి సంయుక్త సైనిక శక్తిని రూపొందించాయి.1813 లో నెపోలియన్ సేనలకు,సంయుక్త సైన్యాలకు మద్య లిప్ జిగ్ వద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నెపోలియన్ సేనలు అధ్బుతంగా పోరాడినప్పటికి ఘోరంగా ఓడింపబడినాడు.నెపోలియన్ చక్రవర్తి బిరుదుతో ఎల్బా అను చిన్న దీవికి పాలకునిగా పంపివేశారు. ఫ్రాన్స్ కు లూయి 18 ని రాజుగా నియమించారు. కాని తన తెలివి తక్కువ పనుల వల్ల అనతికాలంలో నే ప్రజ విశ్వాసాన్ని కోల్పోయాడు.  దీన్ని అవకాశంగా తీసుకొని నెపోలియన్ ఎల్బా నుండి తప్పించుకొని పారిస్,1815 మార్చ్ న చేరుకున్నాడు. వెంటనే లూయి 18దేశం వదిలి పారిపోయాడు. నెపోలియన్ తనను తాను తిరిగి రాజుగా ప్రకటించుకున్నాడు. ఇది 100 రోజులు మాత్రమే కొనసాగింది. మరలా ఐరోపా రాజ్యాలు అన్ని తిరిగి ఒక్కటై నెపోలియన్ తో వాటర్లూ యుద్ధంలో తలపడ్డాయి. ఈ యుద్ధంలో నెపోలియన్ ఓడి సెయింట్ హెలినా అను దీవికి పంపబడినాడు. ఆ దీవిలో అతనిపై అనేక నిర్భందాలు విధింపబడ్డాయి. కాన్సర్ వ్యాధితో భాదపడుతూ నెపోలియన్ తన 52వ ఏట మరణించాడు. నెపోలియన్ మృతదేహాన్ని సెయింట్ హెలినా దీవిలో సమాధి చేసినప్పటికి తిరిగి అక్కడినుండి తీసుకువచ్చి పారిస్ లో ఖననం చేశారు.   

1806లో, నెపోలియన్ గ్రాండ్ ఆర్మీని కీర్తించడానికి ఒక విజయోత్సవ ఆర్చ్‌ను నిర్మించాలని ఆదేశించాడు. 

పారిస్ సమీపంలోని ఆర్క్ డి ట్రియోంఫేను (లా డెఫెన్స్‌లోని గ్రాండే ఆర్చ్) 110 మీటర్ల ఎత్తు, మరియు దీనిని విజయోత్సవ తోరణంగా పరిగణిస్తే, ప్రపంచంలోనే ఎత్తైనదిగా గుర్తించబడింది. ఆర్క్ డి ట్రియోంఫ్ సేన్ నది కుడి ఒడ్డున పన్నెండు ప్రసరించే అవెన్యూల డోడెకాగోనల్ కాన్ఫిగరేషన్ మధ్యలో ఉంది. నెపోలియన్ చక్రవర్తి తన అదృష్టం యొక్క శిఖరాగ్రంలో ఆస్టర్లిట్జ్ వద్ద విజయం సాధించిన తర్వాత, 1806లో దీనిని ప్రారంభించారు. పునాదులు వేయడానికి రెండు సంవత్సరాలు పట్టింది. 1810లో, నెపోలియన్ తన కొత్త వధువు, ఆస్ట్రియాకు చెందిన ఆర్చ్‌డచెస్ మేరీ-లూయిస్‌తో పశ్చిమం నుండి పారిస్‌లోకి ప్రవేశించినప్పుడు, పూర్తయిన ఆర్చ్ చెక్క నమూనాను నిర్మించాడు.ఇంత అద్భుతమైన ప్రదేశంలో, స్మారక చిహ్నం భారీగా ఉండాలిఅని నెపోలియన్ పేర్కొన్నాడట 

 1810లో, నెపోలియన్ అతని కొత్త భార్య మేరీలూయిస్ పారిస్‌లోకి ప్రవేశించారు, వారు చెక్క, పెయింట్ చేయబడిన వస్త్రంతో ఉన్న పునాదులపై నిర్మించబడిన ఆర్చ్ నమూనా కిందకు వెళ్ళారట. 1815లో సామ్రాజ్యం పతనం నిర్మాణ పనులను నిలిపివేసి 1824లో నిర్మాణం తిరిగి ప్రారంభించబడింది. ఈ ఆర్చ్ 1830లో పూర్తయింది. 29 జూలై, 1836 ప్రారంభించబడింది. అయితే, డిసెంబర్ 15, 1840 నెపోలియన్ శవాన్ని మోసుకెళ్ళే శవ వాహనం ఈ ఆర్చ్ కిందకు వెళ్ళే వరకు దీనికి అధికారిక పవిత్రీకరణ జరగలేదు. 

 1830 విప్లవం తర్వాత ఆర్చ్ లో ఎన్ని శిల్పాలు ఉన్నాయో నిర్ణయించారు. పీఠాలను నాలుగు ఉపమాన హైరిలీఫ్‌లతో అలంకరించారు. రెండు టుయిలరీలకు ఎదురుగా, చాలా కొటేషన్స్ రాయబడి ఉన్నాయి. 1835లో, రోమన్శైలి కాఫెర్డ్ వాల్ట్‌లో రిపబ్లిక్, సామ్రాజ్యం సమయంలో జరిగిన 128 యుద్ధాల పేర్లు మరియు వాటిలో పాల్గొన్న అన్ని జనరల్స్ పేర్లను చెక్కాలని నిర్ణయించారు. ఆర్చ్ లోపల ఉన్న మ్యూజియం దాని నిర్మాణ చరిత్రను వివరిస్తుంది. అక్కడ జరిగిన ముఖ్యమైన సంఘటనలను గుర్తుచేస్తుంది. బోర్బన్ పునరుద్ధరణ సమయంలో, నిర్మాణం నిలిపివేయబడింది మరియు 1833 మరియు 1836 మధ్య లూయిస్ ఫిలిప్ I పాలనలో తిరిగి ప్రారంభించారు. తుది ఖర్చు దాదాపు 10,000,000 ఫ్రాంక్‌లు (2020లో అంచనా వేయబడిన €65 మిలియన్లు లేదా $75 మిలియన్లకు సమానం)గా నివేదించబడింది. 

 డిసెంబర్ 15, 1840న, సెయింట్ హెలెనా నుండి ఫ్రాన్స్‌కు తిరిగి తీసుకురాబడిన నెపోలియన్ అవశేషాలు లెస్ ఇన్వాలిడెస్‌ లోని చక్రవర్తి చివరి విశ్రాంతి స్థలానికి వెళ్లే మార్గంలో దాని కిందనుంచి తీసుకెళ్లబడ్డాయి.   

సైనికుల గొప్పగా చెక్కబడిన ఫ్రైజ్ పైన ఉన్న అటకపై ఫ్రెంచ్ విప్లవం మరియు నెపోలియన్ యుద్ధాలలో ప్రధాన ఫ్రెంచ్ విజయాల పేర్లతో చెక్కబడిన 30 కవచాలు ఉన్నాయి. స్మారక చిహ్నం లోపలి గోడలపై 660 మంది పేర్లు ఉన్నాయి, వీరిలో మొదటి ఫ్రెంచ్ సామ్రాజ్యం యొక్క 558 మంది ఫ్రెంచ్ జనరల్స్ ఉన్నారు. యుద్ధంలో మరణించిన ఆ జనరల్స్ పేర్లు అండర్‌లైన్ చేయబడ్డాయి. నాలుగు సహాయక స్తంభాల అన్ని వైపులా, నెపోలియన్ యుద్ధాలలో ప్రధాన ఫ్రెంచ్ విజయాల పేర్లు కూడా చెక్కబడ్డాయి. నెపోలియన్ ఎల్బా నుండి బయలుదేరి వాటర్లూలో అతని చివరి ఓటమి వరకు జరిగిన యుద్ధాలు చేర్చబడలేదు. 1882 నుండి 1886 వరకు నాలుగు సంవత్సరాలు, అలెగ్జాండర్ ఫాల్గుయెర్ రూపొందించిన ఒక స్మారక శిల్పం ఆర్చ్ పై అగ్రస్థానంలో ఉంది. లె ట్రియోంఫే డి లా రివల్యూషన్ (“విప్లవం యొక్క విజయం”) అనే పేరుతో, ఇది “అరాచకత్వం మరియు నిరంకుశత్వాన్ని అణిచివేయడానికి” సిద్ధమవుతున్న గుర్రాలు గీసిన రథాన్ని చిత్రీకరించింది. ఫ్రెంచ్ ఫస్ట్ రిపబ్లిక్, ఫస్ట్ ఫ్రెంచ్ సామ్రాజ్యం పోరాడిన 158 యుద్ధాల పేర్లు స్మారక చిహ్నంపై చెక్కబడ్డాయి. వాటిలో, 30 యుద్ధాలు అటకపై చెక్కబడ్డాయి. గొప్ప తోరణాల స్పాండ్రెల్స్ రోమన్ పురాణాలలోని పాత్రలను సూచించే ఉపమాన బొమ్మలతో అలంకరించబడ్డాయి (జేమ్స్ ప్రాడియర్ రాసారట). ఫ్రెంచ్ విప్లవం మరియు నెపోలియన్ యుగం యొక్క ముఖ్యమైన క్షణాలను సూచించే ఆర్చ్ యొక్క ముఖభాగాలపై చెక్కబడిన ఆరు రిలీఫ్‌లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక నిర్మాణాలు ఆర్క్ డి ట్రియోంఫేను పోలి ఉన్నప్పటికీ, కొన్ని వాస్తవానికి దాని నుండి ప్రేరణ పొందాయి.  మన ఇండియా గేట్ కూడా ఇంచుమించు దీని లాగే ఉంటుంది. 

 ఆ ఆర్చ్ విశేషాలు వివరించిన తరువాత బస్సు  నెపోలియన్ బోనపార్ట్ అవశేషాలను ఉంచిన చర్చ్ వేపు తీసుకెళ్ళారు. బస్సు దిగి ఆ భవనం ముందున్న పార్క్ లో కొన్ని ఫొటోలు తీసుకున్నాము. ఆ చర్చ్ గురించి వివరించింది, కాని లోనికి తీసుకెళ్ళ లేదు. నెపోలియన్ సమాధి  అనేది 1840లో సెయింట్ హెలెనా నుండి ఫ్రాన్స్‌కు తిరిగి వచ్చిన తర్వాత నెపోలియన్ అవశేషాలను ఉంచడానికి పారిస్‌లోని లెస్ ఇన్వాలిడెస్ వద్ద నిర్మించబడిన స్మారక చిహ్నం. ఇది రెండు దశాబ్దాల తర్వాత మాత్రమే పూర్తయింది. 1861 ఏప్రిల్ 2న చక్రవర్తి నెపోలియన్ III చేత ప్రారంభించబడింది. విస్కోంటి ఇన్వాలిడెస్ అనే ఆర్కిటెక్చర్, ఎగురుతున్న గోపురం కింద ఒక వృత్తాకార బోలు ఓపెన్ క్రిప్ట్‌ను సృష్టించాడుపైన నెపోలియన్ పారిస్‌లో ఖననం చేయాలనే కోరికను గుర్తుచేసే శాసనం ఉంది. ఇది విజయాలతో అలంకరించబడిన పన్నెండు స్తంభాల మద్దతుతో ఉన్న వృత్తాకార గ్యాలరీతో చుట్టుముట్టబడి ఉంది. గ్యాలరీ గోడపై పియరీచార్లెస్ సిమార్ట్ చేత నెపోలియన్ విజయాలను జరుపుకునే పది పెద్ద రిలీఫ్ ప్యానెల్‌లు ఉన్నాయి. ఒక సెల్లాలో సిమార్ట్ చేత కూడా పట్టాభిషేక దుస్తులలో నెపోలియన్ యొక్క పాక్షికంగా బంగారు పూత పూసిన విగ్రహం ఉంది. స్మారక చిహ్నం పూర్తి కావడానికి సంవత్సరాలు పట్టింది.  12.50 కిలోల గోల్డ్ తో చేసిన గోపురంతో ఉన్న చర్చిలో నెపోలియన్ బోనపార్ట్ కాఫిన్ ని ఇంకో ఏడు కాఫిన్ లలో పెట్టి 19 సంవత్సరాల తరువాత సెంట్ హెలేనా ఐలాండ్ 1840లో అతని శరీరపు అవశేషాలను తీసుకు వచ్చారు. 

 అక్కడ నుంచి 3000 సంవత్సరాల పురాతనమైన ఓబ్లిస్క్ అసెంబ్లీ నేషనల్ భవనం ముందునుంచి మా బస్ ని తీసుకెళ్ళారు. గ్రీక్ ఆర్కిటెక్చర్ తో చాలా పెద్దభవనం కనబడింది.  

 ప్రపంచంలోనే గొప్పగా చెప్పుకునే మోనాలిసా చిత్తాన్ని భద్రపరచిన లూవ్ర్ మ్యూజియమ్ దగ్గర బస్ ని స్లోగా పోనిస్తూ ఆ ఫ్రాన్స్ గైడ్ ఆ విశేషాలను మాకు వివరించింది. కొద్దిగా ఫ్రెంచ్ యాసలో ఉన్న ఆవిడ ఇంగ్లీష్ మాకు అర్థమయ్యే రీతిలోనే ఉండింది. అంత కష్టంగా అనిపించలేదు. తేడా అల్లా ‘డ’ ని ‘త’ లాగా పలుకుతారు. మాకు ఉదయం నుంచి విని విని అలవాటైంది.  

ఆ లూవ్ర్ మ్యూజియమ్ గురించి, మరో విజయోత్సవ స్థూపం గురించి మరో వారం వివరిస్తాను.

  

Written by vijaya Ranganatham

ఆకారం విజయలక్ష్మి గా కేంద్ర ప్రభుత్వోగం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) హైదరాబాద్ లో ముప్పై యేళ్ళు ఉద్యోగం చేసి, రిటైర్ అయ్యాక జీవిత సహచరుడు రంగనాథాన్ని పోగుట్టుకుని మానసిక వేదనలో ఉన్నప్పుడు వెన్ను తట్టి రచనా వ్యాసంగం వైపు మళ్ళించిన స్నేహితుల వల్ల నా జీవిత విశేషాలను, మా అన్నయ్య విప్లవ రచయిత జ్వాలాముఖి గారి అనుబంధాన్ని, ప్రభావాన్ని “జ్ఞాపకాలు” గా గ్రంథస్తం చేసి “విజయారంగనాథం”అయ్యాను.

జీవిత అనుభవాలను కొన్నింటిని కథలుగా మలిచి స్పోటిఫై మాధ్యమంలో పోడ్ కాస్ట్ చేస్తూ “వీరవల్లి” గా పరిచయ మయ్యాను. “అనుభవ కథనాలు” పుస్తకం గా మార్చాను.
తెలుగు తెలియని, పుస్తకం చదివే తీరికలేని మితృలకోసం నా పుస్తకం జ్ఞాపకాలను నా నోట వినిపిస్తూ పోడ్కాస్ట్ చేస్తున్నాను. అలాగే ప్రసిద్ద రచయిత, “కథానిలయం”గ్రంథాలయ స్థాపకుడు కాళీపట్నం రామారావు గారి కథలను కూడా వారి కథానిలయం యాజమాన్యం అనుమతితో వరుసగా పోడ్ కాస్ట్ చేస్తున్నాను.
నేను బుడి బుడి అడుగులు వేస్తూ వింతగా చూస్తూ ఈ సాహిత్య లోకంలో కి అడుగు పెట్టాను. వేలుపట్టి దారి చూపుతున్న నీహారిణి గారికి కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పద్యం

మన మహిళామణులు – దేవరాజు రేవతి