మేమిద్దరం- వాళ్ళిద్దరూ

(కథానిక)

          డా. నీలంస్వాతి

సడన్ గా కలవాలన్న ఈ ప్లాన్ ఏంటే, ఏమైనా గుడ్ న్యూస్ వుందా అని అడిగింది వర్ష నవ్వుతూ. గుడ్ న్యూసా పాడా ఇంట్లో ఒకటే గొడవలు
బయట వచ్చయినా
కాస్త రిలాక్స్ అవుదామని మిమ్మల్ని రమ్మని పిలిచాను అంటూ
పక్కనే ఉన్న చైర్ ని లాక్కుని
కూర్చుంది ప్రియ. గొడవలా ఎందుకు అంటూ ఆరా తీయడం మొదలు పెట్టింది
రమ్య. చెప్తాలే కానీ ముందు తినడానికి ఏదైనా ఆర్డర్ చెయ్ ఆకలిగా ఉంది పొద్దున కూడా ఏమీ తినలేదు అంటూ ప్రియ చెప్పగానే స్మైలీ, ఫుడ్ ఆర్డర్ చేసింది. ఫుడ్ సర్వ్ అవ్వగానే డిస్కషన్ మొదలైంది…రీసెంట్ గానే కదే మ్యారేజ్ అయింది
మా ఆయన బంగారం అంటూ తెగ పొగిడే దానివి, గౌతమ్ కూడా చాలా కేరింగ్ గా
నిన్ను చూసుకునేవాడు అలాంటిది మీ మధ్య గొడవలు ఎందుకు వచ్చాయే? అంటూ
వాటర్ బాటిల్ ని అందుకుంది రమ్య. మా ఆయన చాలా మంచి వాడేనే వచ్చిన తంటంతా
మా అత్తమామలతోనే. ఏంటే జోక్ చేస్తున్నావా అంటూ నవ్వింది వర్ష, నా జీవితం నీకంత జోక్ గా ఉందా, అవునులే
నీకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కదా, మ్యారేజ్యే అత్తవారి ఇంటికి వెళ్లాక తెలుస్తుంది నేను పడుతున్న కష్టం ఏంటో అంటూ టిష్యుని నలిపి విసిరి కొట్టింది ప్రియ. అబ్బా విసిగించకుండా
అసలు సంగతి ఏంటో చెప్పు అని రమ్య తొందర పెట్టగానే రోజూ గొడవలేనే
మా అత్త మామలకు
టిఫిన్ చేయలేదని, వంట అవ్వలేదని, వండాక వడ్డించలేదని, స్నానానికి నీళ్లు ఏర్పాటు చేయలేదని, టైం కి మందులు ఇవ్వలేదని ఇలా మా వారికీ నాకూ ప్రతిరోజు గొడవలే. అసలు నేనెందుకు చేయాలే ఇవ్వన్నీ, నాకేమంత కర్మ చెప్పు నువ్వే. మా అమ్మ నాన్న దగ్గర ఎంత గారాబంగా పెరిగానో మీకు తెలుసు కదా
నాకు ఒక్క పని కూడా చెప్పకుండా మా అమ్మే అన్నీ చేసుకునేది. ఇక్కడ అన్నీ నేనే చేసిపెట్టాలి. పొద్దున్నే లేచి టిఫిన్, వంట చేయడం, ఆఫీస్ కి వెళ్లి రావడం, రాగానే డిన్నర్ చేసి పెట్టడం ఇలా రోజంతా పనులతోనే సరిపోతుంది. నాకు మా వారికి కాస్త ప్రైవసీ కూడా లేకుండా పోయింది. అందుకే రాత్రి గౌతమ్ కి చెప్పేశాను మనం వేరు కాపురం పెడుదామని.
వేరు కాపురమా వామ్మో అదేంటే ఇంత సడన్గా…అంది
స్మైలీ. అవునా దీనికి గౌతమ్ ఏమన్నాడు అంది ఆత్రుతగా వర్ష. ఈ మాట చెప్పానో లేదో రాత్రంతా పెద్ద కురుక్షేత్రమే నడిచింది మా ఇద్దరి మధ్య.
మీరే చెప్పండే నేను అడిగింది తప్పా? అనగానే అందులో తప్పేముంది వేరుగా వెళితే అప్పుడు మీ ఇద్దరే కనుక గొడవలు తగ్గుతాయి కదా అంది వర్ష. నువ్వు ఊరుకోవే
అది ఏది చెపితే దానికి తందానా అంటారు. వేరు కాపురం పెడితే సమస్యలు సర్దు మణుగుతాయా? అసలు గౌతమ్ పేరెంట్స్ తో నీకు ప్రాబ్లెమ్ ఏంటే….అంది స్మైలీ? నరకం చూస్తున్నానే రోజూ నేను
అంటూ సహనాన్ని కోల్పోయినట్లుగా మాట్లాడింది ప్రియ. అయినా పెళ్లి అయ్యాక నేను మా తల్లిదండ్రులని నా ఇంటిని వదిలిపెట్టి వచ్చానుగా తను మాత్రం తన తల్లిదండ్రులని వదిలిపెట్టి రాలేడా నా కోసం?
అన్ని త్యాగాలూ నేనే చేయాలా. తను నాకోసం ఏమీ చేయడా,
నేను మాత్రం వాళ్ళ ఇంట్లో పని మనిషిలా బతకాలా అంటూ ఎదురు ప్రశ్నించడం మొదలు పెట్టింది. దాంతో వర్ష చొరవ తీసుకొని,అవునే ఇంటి పనుల్లో మీ అత్తయ్య కొంచెం కూడా సాయం చేయదా అంటే
ఎందుకు చేయదే చేస్తుంది నేను కూర చేసేటప్పుడు కూరగాయలను తరిగిస్తుంది,
సాయంత్రం ఇంటికి వచ్చేలాగా టీ పెట్టిస్తుంది, ఆఫీస్ కి వెళ్లేటప్పుడు క్యారేజీ కట్టిస్తుంది. అన్నీ చేసి పెడుతుంది కదా ఇంకా నీకు బాధేంటి అంటే….మా అత్తమ్మ సాయం చేస్తుంది కానీ రోజు ఇలా వంట చేసి పెట్టడం, సపర్యలు చేయడం అసలు
నావల్ల కావడం లేదు. అదే మేమిద్దరమే అయితే ఏదో ఒక పార్సెల్ తెచ్చుకొని తినేసి పడుకోవచ్చు, ఇంట్లో అత్తయ్య మామయ్య ఉన్నారు కాబట్టి వాళ్ళు బయట భోజనాన్ని తినరు, కచ్చితంగా వండి తీరాల్సిందే, అంతేనా రెండు రోజులకు ఒకసారి హెల్త్ ఇష్యూస్ దాంతో ఎక్స్ట్రా వర్క్. పాపం వాళ్ళు ఏజెడ్ కదే అంది రమ్య.
అయినా వాళ్ల తల్లిదండ్రులు అయితేనేనా ఈ పట్టింపులన్నీ అదే నీ తల్లిదండ్రులు అయితే నువ్వు గుండెల్లో పెట్టికొని చూసుకోవా ఏమిటే అంది రమ్య. అత్త మామల్ని చూడడం అనేది భారం కాదే అది నీ భాధ్యత అంతే కాని వేరు కాపురం పెట్టి
సంతోషాన్ని పొందాలని చూస్తే
పెళ్లి అయిన తర్వాత నీ తల్లిదండ్రులకు దూరమై నువ్వు ఎంత బాధ పడుతున్నావో అదే బాధ నీ భర్త కూడా అనుభవించవలసి వస్తుంది. నీ భర్త బాధ పడుతుంటే నువ్వు చూడగలవా చెప్పు. అందుకే ఎవరి తల్లిదండ్రులైనా ఒక్కటే
అంది వర్ష
సద్ది చెపుతూ… అయినా మనం వర్క్ చేసే ప్లేస్ లో
అది బాలేదు, ఇది బాలేదు అని హెచ్. అర్ హెచ్చరిస్తే ఆ జాబ్ ని వదిలిపెట్టి వచ్చేస్తామా చెప్పు, అదే వర్క్ నేను బెటర్ గా చేసి అదే ప్లేస్ లో యప్రిసేషన్ ని అందుకుంటాం.
ఆఫ్టర్ ఆల్ జాబ్ కోసం, మనీ కోసమే మనం ఇంతలా సర్దుకుపోతున్నప్పుడు, మన సంసారం కోసం, మన కుటుంబం కోసం ఈ మాత్రం సర్దుకుపోయి సాగలేమా?
అన్న వర్ష మాటలను
సమర్థిస్తూ స్మైలీ కూడా మన మైండ్ సెట్ ని మార్చుకుంటే మనతో పాటు
మన వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారే. భూతద్దంలో పెట్టి చూస్తే ప్రతి వస్తువు పెద్దదిగానే కనిపిస్తుందే చిన్న చిన్న విషయాలను పెద్దదిగా చేసి ఆలోచించడం మాని అత్తమామలను సొంత తల్లిదండ్రులుగా అక్కున చేర్చుకో… అంది రమ్య. ఇదంతా నీ మంచి కోసమే చెప్తున్నాము ఒక్కసారి ఆలోచించు అంటూ ప్రియకు అందరూ కలిసి నచ్చ చెప్పారు.
స్నేహితులు చెప్పిన మాటలను పదేపదే గుర్తు తెచ్చుకున్న ప్రియ తక్కువ సమయంలోనే మాములు స్థితికి చేరుకుంది.
ఇప్పుడు ప్రియకు ఫ్రెండ్స్ తో గడపడానికి ఫ్రీ టైం దొరకడం లేదు… మామయ్య తో వాకింగ్ కి వెళ్లి కూరగాయలు తీసుకురావడంలో, సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చాక అత్తయ్యకు కబుర్లు చెప్పడంలో బిజీగా మారిపోయింది. అందరూ కథ ఇలా వుంటే ఎంత బాగుంటుంది కదూ….

Written by Dr.Neelam Swathi

చిన్న చెరుకూరు గ్రామం,
నెల్లూరు.
6302811961.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పైశాచిక క్రీడ …లవ్ జిహాద్

అభ్యుదయ వాదిని