యోగులు పలురకాలు.వీళ్ళు సమాజహితం కోరుతూ శిష్యులకు బోధనలు చేయడం మామూలే. కాని ఇటీవల వీళ్ళ దర్శనం కరువైంది. సాధారణంగా వీళ్ళను నమ్మే జనం భక్తి ప్రపత్తులతో సేవలు చేస్తారు. పూజిస్తారు. వాళ్ళ దర్శనం కోసం తహతహలాడుతారు..ఆశ్రమంలో ఉండే ఈ యోగులకు కట్న కానుకలు విరాళాలివ్వడమూ మామూలే. వాళ్ళను కలువాలంటే నియమనిబంధనలు పరిమితులు చాలానే ఉంటై.ఈ భిన్నయోగులలో కొందరికి భోగులకుండే సౌకర్యాలుంటై. అంతకంటే ఎక్కువ కూడా. వాళ్ళు కేవలం వేషధారణకే పరిమితులు. ఇక చర్యల్లో ప్రజల …ప్రభుత్వ…. భూములను తమ అధీనంలోకి తెచ్చుకోవడమే కాదు అమాయక స్త్రీలను ఉపదేశాల పేరిట,సంతానం పేరిట మోసం చేయడం, అత్యాచారాలు చేయడం,తమ బండారం బయటపడుతుందనే ఆలోచనతో ఏకంగా హత్యలుచేయడం కూడా సాదాసీదాగా జరుగుతూనే ఉంటై.వీళ్ళంతా మేకవన్నె పులులే.ఈ అనుభవాలు మురారి కథలో రామచంద్రం తండ్రికి చాలానే ఉన్నై. అందుకే
” నాయినా ఇంటున్నరా ఈ మాట! ఈ సారి ఈయనెవరో మహానుభావుడే ఉంటడు. భిక్ష ఏర్పాటు చేద్దామా ?” అని తండ్రిని రామచెంద్రయ్య అడిగిండో లేదో గతంలో ఊళ్ళోవాళ్ళకు వచ్చిన స్వాముల చిట్టాను వాళ్ళ మోసపూరిత చర్యలను తవ్విపోసి మందలించిండు రామచంద్రయ్య తండ్రి
మాలగూడెం జనం ఊరవుతలి ఊర బాయిని ఊరి సేదబాయిని ముట్టగూడదని అగ్ర వర్ణాల శాసనం. అందువల్ల నీళ్లకు అలమటించిన దళితులు విధిలేక గుంతలలో నిలిచిన నీళ్లనో , పొలం గట్ల దగ్గర ఉన్న గుంతల పోతులు పందులు పొర్లిపోయినంక అడుగున మిగిలిన నీళ్లనో దోసెళ్ళతోడి ముంచుకొచ్చుకొని తాగేవాళ్లు . అదంతా గతం.. కానీ సాధువు అంటరాని వాళ్ళకు తవ్వించిన బాయినీళ్ళు పెద్ద కులస్తుల పిల్లలు కూడ తాగడానికి పనికి రావడం గమనించి తీరాల్సిందే.
ఆ సాధువే గూడెం జనంసాయంతో ఊరి బురుద తొవ్వను బెందడితోని గట్టిగా చేయించడంతోపాటు ఆంజనేయులు గుడిని పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అనుకూలంగ చేయించిండు. పాడుపడిన పాఠశాలను చక్కగ తీర్చి దిద్దిండు. పిల్లలకు ఆటపాటలు నేర్పిండు.వర్గ భేదం లేకుండ మసులుతూ అపర ప్రవరుడా! అన్నట్లు ఆడవాసనను చూడక అంటక ముట్టక గ్రామ సేవే పరమావధిగా చేస్తూ బడి పక్క గుడిలో కాలం గడిపిండు. అంటే మనం పైన చెప్పుకున్న. అందరి యోగులకంటె భిన్నమైనవాడు. ‘‘ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం ‘‘అన్నట్లు ఏ రాగద్వేషాలు లేకుండా నిలిచిండు. పైన ప్రస్తావించినట్లు గ్రామానికి ఏ ప్రభుత్వాలు చేయలేకపోతున్న పనులను తాను చేసి చూపించిండు. తనకు వీలైన సౌకర్యాలు కల్పించిండు. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, మాలలు మొదలైన వాళ్ళంతా పరస్పరం సహకరించుకునేందుకు తొవ్వ వేసిండు.సాధువు అనే రూపానికి సార్థకత చేకూర్చిండు.
ఐతే దీనికి గల తార్కికతలోకి పోతే
. . యథార్థంగా ఆ సాధువు ఆ ఊరి అల్లుడు. రామచంద్రయ్య బావ. అంటే చెల్లెలు శాంత భర్త. పైచదువులకోసం పట్నంబోయిన శాంత మురారితో సహ జీవనం చేసింది. కానీ కొద్దిరోజులకే సన్నిపాత జ్వరం వలన చనిపోయింది.మురారికి శాంతపై అవ్యాజమైన ప్రేమ. ఆమెను మరిచిపోలేకపోయిండు.ఆ జన్మకు ఆమెతో గడిపిన క్షణాలు విలువైనవిగా భావించిండు. ఆమె పుట్టింటి గ్రామానికి చేరుకుని ఆ గ్రామ చైతన్యానికి కృషి చేసిండు.
ఆ గ్రామంలో తొలి అడుగు వేసినపుడు ఈసడించుకున్న రామచంద్రయ్య తండ్రే
“చెంద్రా! సాదుకు జెర పెయి ఎచ్చ జేసినట్లుండది. కషాయం బెట్టిచ్చు.”
” ఇయ్యాళ్ళ పుల్లావు ఈనింది. జున్నుపాలు……..పంపండి.”
” కంకులు లేతగ మొగ్గలోలె ఉండవి. రొండు కాల్చి సాదువును పిలువుండి.”
“మక్క గారెలు చేసి ఎన్నపూస రాసి సాదువుకు పంపండి”అంటూ మాట్లాడడంలో
సాదువు పట్ల అతనికి గల ఆప్యాయత కొట్టవచ్చినట్లున్నది.
“చెంద్రం! సాదు నిజంగ అవతారపురుషుడో ఏందో? ఎక్కడ అంతువడ్తలేదు. సాదువును
జూసినప్పుడల్ల నాకు శాంతమ్మ మనసులో మెదుల్తాది.” అని చివరిగా తేల్చిచెప్పడంలో రామచెంద్రు తండ్రికి కూడా సాదు జీవితవిధానంలోని తార్కికత అర్థమైంది.మురారి అనబడే ఈ సాధువు ఎందరికో ప్రేమమయుడైన మార్గ దర్శకుడు. ఉదాాత్తుడేకాదు. ధీరోధాత్డుత కూడా
బిర బిర. తొందరగా