
కళ్లాపి జల్లిన ముంగిట పరిచిన రంగవల్లిక
సింహద్వారాన మెరిసే స్వాగత వేదిక
ఉత్తరాదిన ప్రకృతి రూపమై కనువిందు చేస్తుంది
దక్షిణాదిన రేఖాగణితమై ఇనుమడింపజేస్తుంది
భాగ్యానికి సంకేతం
చైతన్యానికి ఆహ్వానం
దుష్టశక్తుల దునుమాడే పవిత్ర తంత్రం
కేంద్ర బిందువు సూర్య స్థానానికి సూచిక
గ్రహ నక్షత్ర మండలాన్ని ఇలపై ఆవిష్కరించే సనాతన సాంప్రదాయిక ప్రక్రియ
తన్ను తాను మార్చుకుంటూ
కొత్త సొగసులను అలదుకుంటూ
ముంగిట మొలిచే నిత్య నూతన కళానికుంజం
వాకిట విరిసిన వర్ణ సమ్మేళనం