
మీరాబాయి హిందూ ఆధ్యాత్మిక కవియిత్రి గాయకురాలు,శ్రీ కృష్ణుని భక్తురాలు. 16వ.శతాబ్దము కాలంలో ఉత్తర భారతదేశ హిందూ సాంప్రదాయంలో పేరొందిన భక్తురాలుగా తన జీవితాన్ని సాగించారు.
ఆమె జననం 1498-కుర్కి,వాలీ,అమెద్య,జోద్ పూర్ జిల్లా,రాజస్థాన్. మరణం-1546 లేదా 1547 ద్వారక అనిచెప్తారు. ఆమె మతం హిందూ. ఆమె గురించి చెప్పాలంటే ఆధ్యాత్మిక వైష్ణవ కవయిత్రి అని చెప్పవచ్చు.సామాజికంగా,కుటుంబపరంగా తాను నిర్లక్ష్యానికి గురవ్వడం వల్ల శ్రీకృష్ణుడి పట్ల భక్తిని పెంచుకుని కృష్ణుడిని తన భర్తగా భావించిందని,ఇందుకోసం ఆమె తన అత్తమామలచే హింసించబడిందని మీరాబాయి గురించి అనేక కథలు చెప్పబడుతున్నాయి. భారతీయ సాంప్రదాయంలో కృష్ణుడిని స్తుతిస్తూ వ్రాయబడిన మిలియన్ల భక్తి కవితలు మీరాబాయి వ్రాసిందని అనుకోగా వాటిల్లో కొన్ని వందల కవితలు మాత్రమే ఆమె వ్రాసారని పండితులచే ప్రామాణికరించబడింది.ఈ కవితలను భజనలుగా పిలుస్తారు.ఇవి భారతదేశమంతటా ప్రాచుర్యం పొందాయి. చిత్తోర్ ఘర్ కోట వంటి హిందూ దేవాలయాలు మీరాబాయి జ్ఞాపకార్థంగా ఆమెకు అంకితం చేయబడ్డాయి. మీరాబాయి రాజ్ పుత్ రాజకుటుంబంలో జన్మించారు.
1516 మీరాకు మేవాడ్ యువరాజు బోజ్ రాజ్ తో వివాహం జరిగింది.మొఘల్ సామ్రాజ్యం స్థాపించిన బాబర్ కు చెందిన ఇస్లామిక్ సైన్యంతో జరిగిన యుద్ధంలో మీరా భర్తతోపాటు, కొన్ని సంవత్సరాలకు ఆమె తండ్రి బావ ఇద్దరూ చంపబడ్డాక ఆమె అత్తమామలు మీరాబాయిని చిత్రహింసలకు గురిచేశారని ప్రతీతి. ఆమెకు పాము ఉన్న పూలబుట్టను పంపిస్తే పూలహారంగా మారిందని,తనను తాను నీటిలో మునిగిపొమ్మని విక్రమ్ సింగ్ కోరగా ఆమె నీటిలో మునగగా ఆమె మునగకుండా నీటిలో తేలిందని ఇతిహాసాలలో వ్రాయబడింది. మొఘల్ చక్రవర్తి అక్బర్ మీరాబాయిని చూడటానికి తాన్ సేన్ తో వచ్చి ఒక ముత్యాలహారం ఇచ్చారని వ్రాయబడింది. మేవాడ్ రాజ్యాన్ని విడిచిపెట్టి తీర్థయాత్రలకు వెళ్ళి చివరి రోజుల్లో ద్వారక (బృందావనం)లో నివసించిదని, అక్కడ 1547లో కృష్ణుడిలో ఐక్యమయ్యారని పురాణాలు చెబుతున్నాయి.తన జీవితాన్ని కృష్ణుడికి అంకితం చేసి,భక్తిగీతాలను రూపొందించి వాటిని గానం చేసి మీరాబాయి భక్తి మార్గంలో నడిచిన కవయిత్రిగా పేరుపొందారు. ఆమె వ్రాసిన గీతాలలో “పమెజీ మైనే రామ్ రతన్ ధన్ పాయో” అన్నగీతం ఇప్పటికి మనం పాడుకుంటున్న విషయం విదితమే.