మహిళామణులు

చేగూరి శశికళ

ఆమెను అంతా పెద్ద బొట్టు అక్క వదినమ్మ అనిపిలుస్తారు. నుదురంతా ఆక్రమించిన సూర్య బింబం లాంటి ఎర్రటి కుంకుమ బొట్టు నీట్ గా ఫ్రెష్ గా చిర్నవ్వులు కురిపించే ఆమె అమ్మమ్మ బామ్మ గా
ఇంటిపనులు చక్కబెడ్తూ షాపులో 10 నుంచి కూర్చుంటారు.సాయంత్రం 4 కల్లా మళ్ళీ షాపులో బేరసారాలు చూస్తారు.ఇద్దరు కొడుకలు కోడళ్లు కూడా ఆమె కి సాయపడ్తారు. లింగంని మెళ్ళో కట్టుకునే లింగాయత్ ఆచారం పూజలు నిష్ఠగా పాటిస్తారు.బిజినెస్ లో బిజీగా ఉన్నాతీర్థయాత్రలు చేస్తారు.పదిమందిలో మంచి అనిపించుకునే ఆమె జీవితం ఓకథ! బాథను గరళం లో దాచుకున్న మహిళ.

చేగూరి శశికళ

మహబూబ్ నగర్ లోని రావిరాలలోపెద్దకూతురిగా పుట్టిన ఆమె బాల్యం నుంచే బాధలు బాధ్యతలు పంచుకుంటూ పెరిగారు.ఇద్దరు తమ్ముళ్ళు.పొలంపనికి బాల్యంలోనే వెళ్లి బడి మొహం చూడని ఆమె పిల్లల్ని పెద్ద చదువులు చది
వించారు.వారంతా మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.కోడళ్ళు కూతురు కూడా సాఫ్ట్వేర్ చదువులు.ఆరోజుల్లో పల్లెలో బడి 5 కి.మీ.అందుకే శశికళ కి చదవటం రాయటం రాదు.చదివి విన్పించాలి ఇప్పటికీ.ఆమె 8వ ఏటనుంచీ అమ్మ నాన్న లతో కల్సి పొలం పనులు గడ్డి పీకటంపంటకోయటం నేర్చుకున్నారు.తండ్రికి 8ఎకరాలపొలం ఉంది.నువ్వులు పల్లీలు కందులు జొన్నలు రాగులు పండేవి.అమ్మతోపాటు తెల్లవారుఝామునే లేచి ఇంటి పని వంట పని తమ్ముళ్ళకి సాయం జేసి9 కల్లా బాక్సుల్లో జొన్న రొట్టెలు రాగిసంకటి తీసుకుని పొలానికి వెళ్లేవారు పొలంలో ఆకుకూరలు పుంటికూర పాలక్ తుమ్మికూరతో పప్పు టమాటా వేసి కూర రొట్టెలుతినేవారు ఇంటిల్లిపాదీ.సామలు కొర్రలు వండేవారు.రోజూ ఓపాతిక జొన్న రొట్టెలు ఆనాటి భోజనం.బియ్యం అన్నం లేదు.చాకలి మంగలి కుమ్మరి మొదలైన వారికి పని కూలీలకు ప్రతిపండగకి వారానికోసారి చిరుధాన్యాలు తృణధాన్యాలు ఇచ్చే వారు.ఆలుగడ్డ తెలీదు.వంకాయ చిక్కుడుసొర అవే కూరలు.
ఇంట్లో 4 గేదెలు పాలు పెరుగు వెన్న ఇరుగుపొరుగు కి ఫ్రీగా పంచేవారు.పాలు 1 గ్లాస్ 10 పైసలు!? నిజం!రోకలి తో కాఫీ గింజలు వేయించి పొడిదంచేవారు.పెంకుటిల్లుఇక రోజూ 25 జొన్న రొట్టెలు వాటిలోకి కందిపప్పు లోగునుగాకు పాలకూర గంగబాయిలకూర వేసిన పప్పు.ఇదే వారి మూడుపూటలా ఆహారం.ఆతర్వాత పర్గి దగ్గర మోత్కూరు లో పెరిగారు.మేనమామ పిల్లలతో ఆటలు పొలంలో వడిసెల్తో పిట్టల్ని తరమటం, అంట్లు తోమటం అన్ని నిండా 12 ఏళ్ళు లేని ఆమె చేసేవారు.12వ ఏడురాగానే‌ అమ్మ నాన్నల దగ్గరకు వచ్చేసింది.రాగులు కూడా నారు పోయాలి.వరిలాగానే నాట్లు వేయాలి.మోదుగ ఆకుల్తో రోజూ 200విస్తళ్ళు కుట్టేది ఆచిన్నారి.
ఎర్రగడ్డ నుంచి రోజూలాగే రాత్రి బండీమీద వచ్చే భర్త తెల్లగా తెల్లారినా రాకపోవడంతో గుండె జారిపోయింది.ఆరోజుల్లో ఫోన్ సౌకర్యం లేదు.శశికళ బాధపడుతూ ఇలా చెప్పారు ” అప్పుడు నావయసింకా పాతికేళ్లు గూడా నిండలేదు.తెలుగుకూడా చదవటం రాయటం రాదు.
అమ్మ నాన్నలు ఇద్దరు తమ్ముళ్ళు వారి కుటుంబాల తో నిలదొక్కుకుని చీరెల వ్యాపారం ప్రారంభించాను.చీరెకి 40రూపాయల కమీషన్.దేవునిదయవల్ల 3నెలల్లో 40వేల రూపాయల చీరెలు అమ్మాను.” ఆయన కనపడలేదు అని పోలీసు కంప్లైంట్ పేపర్లో వేయించారు.భర్తజాడ ఇంతవరకూ దొరకలేదు.7ఏళ్ళు గడిచినా ఆచూకీ లభించలేదు.ఎందరో జ్యోతిష్యుల్ని సంప్రదించినా ఫలితం శూన్యం.ఇక గుండె రాయి చేసుకుని అలా పిల్లలపెళ్ళిళ్లు మనవలతో షాపు లో కూర్చుని తన జీవితంలో నల్గురితో స్నేహం ఉండటంలోనే గడిచిపోతోంది అని నిట్టూర్పు విడిచారు ఆమె. శంకర్ క్లాత్ షాప్ భారత్ నగర్లో ఉంది.
మోదుగాకులు కోసి గుచ్చి రాత్రి నీరు చల్లి ఉంచేవారు.జొన్నపుల్లల్తో విస్తరి కుట్టే వారు.100 విస్తర్లు అమ్మితే ఒక రూపాయి చార్ అనా ఇచ్చేవారు. మోదుగ ఆకుల్ని 2నెలలుముందుగా కోసికుప్పలుగా పోసి పెట్టాక విస్తర్లు కుట్టే వారు.తండ్రి సంసారం గూర్చి అస్సలు పట్టించుకోలేదు.తల్లి తాను కష్టపడి సంసారం నెట్టుకుని వచ్చారు.

ఇక 18 వ ఏట ఆమె కి పెళ్లి ఐంది.ఇంటికి పెద్ద కోడలు.భర్త కిరాణా షాపు లో ఇన్ చార్జి గా పనిచేసి ఆపై స్వంతం గాకిరాణా షాపు ఎర్రగడ్డ లో పెట్టారు.
ముగ్గురు పిల్లలు 2అబ్బాయిలు ఒక అమ్మాయి తో హాయిగా సాగిపోతోంది సంసారం.భరత్ నగర్ లో
ఇల్లు సంసారం.పిల్లలు బడిలో చేరారు.కానీ విధికి కన్ను కుట్టింది.
ఎర్రగడ్డ నుంచి రోజూలాగే రాత్రి బండీమీద వచ్చే భర్త తెల్లగా తెల్లారినా రాకపోవడంతో గుండె జారిపోయింది.ఆరోజుల్లో ఫోన్ సౌకర్యం లేదు.శశికళ బాధపడుతూ ఇలా చెప్పారు ” అప్పుడు నావయసింకా పాతికేళ్లు గూడా నిండలేదు.తెలుగుకూడా చదవటం రాయటం రాదు.
అమ్మ నాన్నలు ఇద్దరు తమ్ముళ్ళు వారి కుటుంబాల తో నిలదొక్కుకుని చీరెల వ్యాపారం ప్రారంభించాను.చీరెకి 40రూపాయల కమీషన్.దేవునిదయవల్ల 3నెలల్లో 40వేల రూపా
యల చీరెలు అమ్మాను.” ఆయన కనపడలేదు అని పోలీసు కంప్లైంట్ పేపర్లో వేయించారు.భర్తజాడ ఇంతవరకూ దొరకలేదు.7ఏళ్ళు గడిచినా ఆచూకీ లభించలేదు.ఎందరో జ్యోతిష్యుల్ని సంప్రదించినా ఫలితం శూన్యం.ఇక గుండె రాయి చేసుకుని అలా పిల్లలపెళ్ళిళ్లు మనవలతో షాపు లో కూర్చుని తన జీవితంలో నల్గురితో స్నేహం ఉండటంలోనే గడిచిపోతోంది అని నిట్టూర్పు విడిచారు ఆమె.శంకర్ క్లాత్ షాప్ భారత్ నగర్లో ఉంది.
శంకర్ క్లాత్ షాప్ నడుపుతూ చిన్న ఇంటిని రెండు అంతస్తుల బిల్డింగ్ గా కట్టించారు.ఒకషాపు అద్దెకు ఇచ్చారు.శశికళ స్వయంగా సికింద్రాబాద్ చార్మి నార్ మొదలైన ప్రాంతాలకు పోయి రకరకాల వెరైటీ చీరెలు డ్రెస్ ఫాల్స్ జాకెట్ ముక్కలు తెస్తారు.వికారాబాద్ దగ్గర మన్నెగూడలోఇల్లు 2 షాపులు కట్టించి అద్దెకిచ్చారు.ఇక తీర్థయాత్రలు రైలు బస్సు విమానం లో చేశారు.చార్ధామ్ శబరిమలై కాశ్మీర్ నేపాల్ ఇలా దాదాపు భారతదేశయాత్ర చేశారు.ఇలా భగవంతుని దయవల్ల బానే సాగిపోతోంది జీవితం అనే శశికళ మనందరికీ ఆదర్శం.చదువులేకున్నా జీవిత పాఠాలు నేర్చుకున్న ఆమె కి దైవం తోడ్పాటు ఉంది అని గట్టి నమ్మకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంకల్పం

దొరసాని