
ఇది కథ కాదు. ఒక కళాస్వభావి పడే తపన. తన తో పటు తన లోని కళా తపస్వి అంతమయి పోకూడదు. తరాలకు ఆనందం పంచె స్వరూపాన్ని
సృష్టించాలి , తన సృష్టి తో పటు తాను చిరస్మరణీయుడు కావాలనే చిన్న స్వార్ధం. దానికి జీవితకాలం అంతా వెచ్చిస్తాడు మనిషి. ఎవరి మెప్పు కోసం ఎదురు చూడడు. తనకు తెలిసిందని అందరి తో పంచుకోవాలను కునే అమాయకత్వం , దానివల్ల పెరిగే తొందరపాటు తనను తరచు అవమానాలకు, అవహేళనలకు దారి తీస్తుంది. అయినా కూడా తన ప్రయత్నం మానుకోకపోవడమే ఆ కళాకారుని యొక్క విలక్షణత. “ Those who stand & wait also serve God” అన్న ఫిలాసఫీ ని పూర్తి గ వంట పట్టించుకోని ఎదురుచూస్తూనే ఉంటాడు ఒక్క అవకాశం కోసం.
అదే సరోజ టీచర్ తో జరుగుతుంటుంది.
“ఆమెకు తొందర ఎక్కువ . అన్ని తనకు తెలిసినట్లే మాట్లాడు తుంటుంది. అన్నిట్లోనూ కాలు చేయి పెడుతుంది”. అంటూ విసుక్కునే వారు కొందరయితే.
“ఇంత వయసొచ్చాక కూడా ఇవన్నీ చేయాలా ఏంటి.ఎప్పుడు ఈమెకు ఈ తాపత్రయమేమిటో. విచిత్రంగా!” అని ఆమె వెనకాలే అనే వాళ్ళు కొందరు.
“మేడం ! మీ గురించి మీ ముందు కొన్నిసార్లు, మీ వెనకాల చాలా సార్లు చాల అంటుంటారు. మరి మీరు వీళ్లమాటలెందుకు పట్టించుకోరు. మీ సీనియారిటీ ని కూడా గౌరవించరు. మిమన్లి చాలా నిర్ల్యక్షం చేస్తారు. అయినా మీరు చిరునవ్వుతో నే వాళ్ళని భరిస్తున్నారు . అది మీకు అవసరమా!”అంటూ కావ్య వాపోయింది.
“ కావ్య! ఎవరు ఏమనుకున్నా మనకు నచ్చిన పని చేయటానికి మనం వెనకడుగు వేయకూడదు. అది అందరికి ఆనందం పంచేదయితే. సంతోషంగానే చేయాలి”. అంటూ సరోజ టీచర్ కావ్య తలనిమిరి చెప్పింది.
నాకు క్లాస్ ఉంది అంటూ అక్కడితో వాళ్ళ మాటలు ఆపేసి సరోజ వెళ్ళిపోయింది. కావ్య మాత్రం ఆమె గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది.
**********************
సరోజ టీచర్ చాల చిన్న కుటుంబం నుండి వచ్చింది. అందరు కూతుళ్లే నన్న కొరవతో, ఆర్థిక స్థోమతలేని ఆమె తండ్రి తన కూతుళ్ళ గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. సరోజా మూడో అమ్మాయి. ఆ కుటుంబంలో .చదువు కునే స్వేఛ్ఛ మాత్రం సరోజకి దొరికింది. అందుకనే బి ఏ తరువాత బీఎడ్ కూడా చేసి టీచర్ గ మున్సిపల్ హై స్కూల్ లో ఉద్యోగం సంపాదించి , తన చెల్లెలి చదువుకు , అక్క పై చదువులు చదవడానికి సహాయ పడింది. ఇవన్నీ ఒకమాట అయితే. ఆమె కున్న కళాభిరుచి వేరు. నాట్యమన్న , సంగీతమన్న ప్రాణం. అందుకని నాట్య రీతులకు చెందిన పుస్తకాలు చదువుతూ, నూతన నృత్య రీతులను తయారు చేసేది. సంగీతం కూడా నేర్చుకొని, ఇంట్లోనే మ్యూజిక్ క్లాసులు నడిపేది. కానీ ఆమె కున్న ప్రతిభని ప్రదర్శించగలిగే అవకాశం మాత్రం ఎప్పుడు రాలేదు. అయినా సరోజ టీచర్ లో ఆ మక్కువ చావలేదు. ఆమెతో పాటె ఆ కళాభిరుచి పెరుగుతూ వచ్చింది. ఆ ప్రయాసలో అవమానాలు భరించింది, ఆదరణలను కూడా అపుడప్పుడు పొందింది. కానీ మనసుకి నచ్చే విధంగా ఆమె చేయ లేక పోయింది.
కొందరు మిత్రుల సలహాతో ఒక ఏడాది సెలవుతీసుకొని మదరాసు బయలు దేరింది. చిన్న చిన్న ప్రయత్నాలు చేసింది. అదొక రంగుల ప్రపంచం. అక్కడ ప్రతిభ మాత్రమే చాలదు. మనలోని నైపుణ్యాన్ని గుర్తించి అవకాశం ఇచ్చేవారు కూడా ఉండాలి. ఆ సినీ రంగంలో నిలదొక్కుకోవడానికి ఏమేమి కోల్పోవాలో స్వయంగ చూసిన సరోజ టీచర్, తన నైతికతను, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక , టీచర్ గ సెలవు కాలం అయిపోగానే తిరిగి అదే చోట జాయిన్ అయింది. అప్పుడే ఆమెకు అసలయిన సమస్య ఎదురయింది.
“ఏంటి సరోజ! వెన్నక్కి వచ్చావు. అక్కడే ఎవరితోనో ఉండి పోతావనుకున్నానే” అంటూ వెకిలి చూపులు చూసే సహా ఉద్యోగులు.
“మనకు చెప్పదు గా ని ఎవరితోనో ఎదో సంబంధం పెట్టు కొనే ఉంటుంది. అయినా మన కెందుకు ఆమె ఎట్లా పోతే మాత్రం”’ అంటూ మూతి ని మూడు వంకర్లు తిప్పే జనాలు కొందరు.
“ఏ మాత్రం సంపాయించా వేంటి?” అని అతి ఉత్సాహం చూపే శ్రేయోభిలాషులు.
ఇవన్నీ భరించడం కష్టమే అయినా భరించక తప్పదు. ఎందుకంటే తాను ఒక స్త్రీ, అంతే కాదు అవివాహిత. ఇవి రెండూ చాలు ఈ సమాజానికి తనను అనుక్షణం వేటాడడానికి. అందుకే మౌనమే శరణ్యం గా కాలం గడపసాగింది.
కావ్య కు మాత్రమే తెలుసు సరోజ టీచర్ లోని ప్రతిభ. అందుకనే ఆమె సరోజ టీచర్ కి అండగా ఉంటుంది. ఒక్క అవకాశం దొరికితే చాలు ఆమె ప్రతిభ ఈ లోకానికి తెలుస్తుంది అని తలిచే అతి కొద్దీ మందిలో కావ్య ప్రధమురాలు.
ఆ ఏడాది అనుకోకుండా కావ్య ని ప్రోగ్రాం ఇంచార్జ్ గ చేసారు. అది కూడా “”ఆజాది కా అమ్రితిమహోత్సవ్” సందర్భముగా ఇంటర్ స్టేట్ కాలేజీ పోటీలు. రిజిస్టర్ అయిన టీమ్స్ కి మెంటర్స్ ని కూడా ఇచ్చే బాధ్యత ఆ ఏడాది రాష్ట్ర సాంస్కృతిక విభాగం తీసుకోంది. ఆ మొత్తం ప్రోగ్రాం కి కావ్య ని సెలక్షన్ టీమ్ మెంబెర్ గ చేసారు. ఈ అవకాశం పోగొట్టదలచుకోలేదు కావ్య . ప్రాధమిక చర్చలు మొదలయ్యాయి.
“సుబ్బరామయ్య గారు! ఈ సారీ మనం ఒక అవకాశం సరోజ టీచర్ కి ఇవ్వాలి, సర్.” అంటూ ఎంతో వినమ్రంగా చెప్పింది.
“అదేంటి కావ్య! She is a big failure. ఆమెకెలా ఇస్తాము . it is a prestige issue for our district.” అంటూ ఆమె మాటను తోసివేశాడు.
కానీ కావ్య తన పట్టు వదలలేదు. “సర్, ఎవరి విఫలత శాశ్వతం కాదు కదా, ఆ అనుభవంతోనే సరి కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. ఈ ఏడాది ఆమె కు మనం ఒక్క అవకాశం ఇవ్వాలి సర్. ఇలాటి అవకాశాలకోసమే ఆమె ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నది. చాల సీనియర్ టీచర్. గౌరవించడం మన బాధ్యత ఏమంటారు”. అంటూ నచ్చచెప్పింది. సుబ్బరామయ్య గారు మెత్తబడ్డారు ఈ విషయంలో.
“సరే కావ్య! నువ్వంతలా చెబుతుంటే కాదనలేక పోతున్నాను. ఒక మంచి డాన్స్ టీం ని ఆమె కివ్వు .అదే రామకృష్ణ గారి టీమ్. ఆమె చేయలేక పోయిన అయన సారథ్యంలో వాళ్ళు మంచిగా చేస్తారు”. అంటూ అయన తన అంగీకారం తెలిపారు.అదే భాగ్యంగ తలచి రామకృష్ణ గారి శిష్య బృందానికి సరోజ టీచర్ ని మెంటర్ గ చేసింది కావ్య.రామకృష్ణ గారిని ఆ కమిటీ కి సలహాదారునిగా ఎంపిక చేసారు.
రామకృష్ణ గారు వయసు పైబడిన ఇంకా నాట్యం నేర్పుతూనే ఉన్నారు. కానీ అతి కొద్దీ కాలం లో ఒక ఐటెం ని చేయించగలిగే శారీరక స్థోమత ఆయనకి లేదు. కానీ అయన శిష్యబృందం ఆయనని భరత ముని గ భావిస్తారు. సరోజ టీచర్ అప్పుడప్పుడు అయన ఇంటికెళ్ళి ఆయన నేర్పుతున్న నృత్య శైలిని పరిశీలిస్తుంటుంది. ఆయనకి తెలుసు సరోజలో ఉన్న నైపుణ్యం. అందుకే రామకృష్ణగారికి కూడా సరోజ ఆయన టీం కి మెంటర్ కావటంలో అభ్యంతరం లేదు.
*******************
అక్కడ కూడా సరోజ టీచర్ కి అవహేళనలు, తిరస్కారాలు తప్పలేదు.
“అయినా ఆత్మ చైతన్యం నింపుకుంటూనే ఉంటుంది. ఒక లయ ధ్వని, మధుర గానం, వాయిద్యాల తరంగ ఘోష నన్ను నిలవనీయవు. నా మనో పలకంపైన ఒక రూప కల్పన జరుగుతూనే ఉంటుంది. అలా ఆ కళామతల్లి చుట్టూ అనంతమైన ఆనంద తాండవం నా అంతరంగంలో చేస్తూనే ఉంటాను. అక్క డ నేను మాత్రమే ఈ ప్రపంచము ఉండదు. ఈ అవమానాలు, అవహేళనలు, వినిపించని ప్రపంచం నాది . అక్క డా నేను మాత్రమే స్వచ్ఛమైన హిమజ్వాల లాగా నా మనోరంగం పైన అందె ల రవళి వీనుల విందుగా ధ్వనిస్తూంటుంది. అక్కడ నాకు ఎవరి పైన ద్వేషం కనిపించదు. అందరు ఋషిత్వం పొందిన మహా మహులే. వాళ్లకు సేవ చేస్తున్న పరిచారికను.ఎదో తపన , తపస్సునన్నీ భౌతిక ప్రపంచంలో నిర్జీవం చేస్తుంది. నిస్సహాయురాలిగా నిలిచిపోతుంటాను. కానీ ఈ కళాజగత్తులో ఒక కాంతిపుంజాన్ని” అలా సరోజ లో అంతరంగ మధనం జరుగుతుంటుంది .
ఆమెలో ని ఆత్మకు మెరుగులు దిద్ది ఒక సంపూర్ణ సంకీర్ణ నృత్యా రూపానికి ప్రాణం పోసింది సరోజ టీచర్. భారతీయ ప్రధాన నృత్యశైలులను ఆ రూపకం లో పొందుపరిచింది. ప్రతి పాత్రలో ఆమె తన ఆత్మను నింపింది. రెండు నెలలపాటు అహోరాత్రులు ఆ నృత్యరూపకానికి మెరుగులు దిద్దుతూ తన పంచప్రాణాలు ఆ నృత్య కళాకారులలో నింపుతూ తాను నిర్జీవమయి పోయింది.
పోటీలు నిర్వహించే తేదీ వచ్చేసింది. రామకృష్ణ గారు ఆమె పడిన కృషి ని చాలా అభినందించారు, కానీ పెద్దవాళ్ళతో జరిగే అన్ని మీటింగుల లో ఆయనకే పెద్ద పీట వేశారు. సరోజ టీచర్ కేవలం ఒక అసిస్టెంట్ గానే మిగిలిపోయింది. కానీ ఆ టీం లో ఉన్న నృత్య కళకళాకారులయిన విద్యార్థులకు మాత్రం ఆమె అర్ధమయింది. ఆమె నిర్దేశానికి కట్టుబడి ఆమె చెప్పినదల్ల చేసారు . ఆమె ఆత్మ ను తమలో ఆహ్వానించుకున్నారు .
ఆ పోటీలలో సెలెక్ట్ చేయబడిన ప్రధమ అంశం రాజభవన్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలలో లో ప్రదర్శించ బడుతుంది. ప్రోగ్రాం లిస్ట్ వచ్చింది. వాటిలో సరోజ టీచర్ టీమ్ దే చివరి అంశం. నిర్లిప్తముగా నవ్వుకుంది సరోజ టీచర్.
మెంటర్స్ స్థానంలో వెనక గ ఆమె కోసం ఒక సీట్ ఇవ్వ బడింది. ముందు వరసలో రామకృష్ణ గారిని కూర్చోబెట్టారు.
“ఇదేమిటీ? సరోజ మేడం కి అంత వెనక సీట్ కేటాయించారు? ఆమె కూడా మెంటర్ కదా, ఎవరు చెప్పారు మీకు ?”అంటూ అక్కడ ఉన్న వాలంటీర్ ని అడిగింది.
“మాకు తెలియదు మేడం. అదుగో తెల్ల పంచ ,లాల్చీ వేసుకొని అక్కడ కూర్చొని ఉన్నారు ఆయన చెప్పారు.”
నేరుగా అయన దగ్గరికి వెళ్ళింది కావ్య . “ సర్, ఇదేంటి సరోజ టీచర్ కి అంత వెనక సీట్ కేటాయించారు”/? అంటూ అడిగింది.
“అదా ! నీకు ప్రోటోకాల్ తెలియదా. ముందున్న వాళ్లంతా చాల పేరున్న డాన్స్ కొరియోగ్రాఫర్స్. ఆమెని అక్కడే కూర్చొని”. అంటూ కొంత ఛీత్కారం తో సుబ్బరామయ్య గారు అన్నారు.
కావ్య చేసేదేమి లేక అక్కడ నుంచి వెళ్ళిపోయింది.
ఆమెను చూస్తుంటే కావ్య కి కొంచం కంగారుగా ఉన్నది. మొదటి ఐటమ్స్ అన్ని చాల బాగా చేసారు. పోటీ చూస్తుంటే చాల తీవ్రంగా ఉన్నది. ప్రేక్షకులు ఎవరు ఆ ఆడిటోరియం నుండి కదలటం లేదు.
కావ్య వీలు చేసుకొని చివరి అంశం ప్రకటన సమయానికి సరోజ టీచర్ దగ్గరకి చేరు కుంది.
“మేడం , అంత సవ్యం గానే జరుగుతుంది “అంటూ ఆమె భుజం మీద ఆప్యాయంగా చేయి వేసింది. సరోజ టీచర్ లో ఏరకమయిన భావన ఆమె కు కనిపించలేదు.
నృత్య రూపకం ప్రారంభమయింది. “మహోన్నతం నా దేశం. కళల కాణాచి. ఈ భిన్నత్వమే మా సమైక్యత అనే అంతర్లీనమయిన భావం తో ఆ రూపకం రూపొందించబడినది. ఎక్కడ గేయం కానీ గీతం కానీ లేదు. నృత్య రూపకం అంత వాయిద్యాల మీదనే నడిచింది. ఆ కళావేదికే తమ కౌసల్య రంగంగా, శిక్షణ పొందిన యోధులు మాదిరిగా ఆ విద్యార్థులు నర్తిస్తున్నారు. అణువణువునా భారతీయత ప్రదర్శించబడుతున్నది. భారతీయ సమగ్ర నాట్యరూపం మహోన్నతముగా వేయి పడగలు విప్పి నాట్యమాడుతున్నట్లని పిస్తున్నది. ఆహూతులందరు కొత్తగా భారత దర్శనం చేసుకుంటున్నట్లు కదలకుండా కూర్చొని ఉన్నారు. ప్రేక్షకులలో అనిర్వచనీయమైన అనుభూతి. ఒక కొత్త శైలికి ఆవిష్కారం జరిగింది. సరోజ టీచర్ తన స్థానం నుండి లేచింది.
“ఎక్కడి కి మేడం , ప్రోగ్రాం ఇంకా పూర్తవ లేదు. రిజల్ట్స్ కూడా కొద్దీ సేపట్లోనే అనౌన్స్ చేస్తారు. అంటూ చెప్పింది . సరోజ పలక లేదు. “నేను వస్తాను మీతో.”
“వద్దు “” అంటున్న సరోజ టీచర్ ని చూస్తే కావ్య కి భయ మేసింది. ఏ అభినందనలు అవసరం లేని ఒక స్థిత ప్రజ్ఞత్వం ఆమె లో కనిపించింది.
************************
“నాలో నిర్జీవమైన కళామతల్లిని బతికింకున్నాను . నా ఈ ప్రయత్నం అమృతత్వాన్ని పొందింది. కళ ఒక వ్యక్తి కాదు. ఒక వ్యవస్థ కూడా కాదు. ఎన్ని ఒడిదుడుకులున్న నిరంతరం సాగిపోయే గంగా ప్రవాహం. హరిద్వార్ లో పవిత్రంగా కొలవబడే గంగా కాశీలో శవాలను మోసుకువెళుతుంది. మంచి చెడులు ఏవి ఆ గంగకి అంటావు. అలాంటిదే ఈ కళా ప్రవాహం కూడా . నిత్యా చైతన్య స్రవంతిని మనలో నింపుతుంటుంది . ఈ ప్రపంచం అమృతమయం. రాగద్వేషాలు లేని అమర లోకం. ఆ తల్లి నిత్య చైతన్య స్రవంతి నాలో అమృతత్వాన్ని నింపింది.” ఏదో లీలగ, ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్యలో “ నా దేశం మహోన్నతం” ప్రథమ స్థానం గెలుచుకున్నట్లు ప్రకటించబడినది.
కావ్య చుట్టూరా చూసింది . సరోజ మేడం కనిపించలేదు. బయటకు పరిగెత్తు కెళ్ళి చూసింది. దూరంగా ఒక చెట్టు కింద ఉన్న సిమెంట్ బెంచ్ మీద ఆమె కనిపించింది.
కావ్య దగ్గరకు వెళ్లి చూసింది. నిర్జీవురాలయిన సరోజ టీచర్ . ఆమె చేతిలో ఆమె డైరీ . అప్పుడే రాసుకున్న కొన్ని వాక్యాలు. అందంగా తీర్చిదిద్దిన అక్షరాలా వరుస , ఒక నూతనత్వానికి నాంది పలుకుతూ వ్రాయబడ్డాయి. .
*******************
“కావ్య పిచ్చిగా నా కోసం కన్నీరు కారుస్తున్నది అని నాకు తెలుసు. కానీ ఆమెకెలా చెప్పను! నేను మృతువు ద్వారా అమృతత్వం పొందానని”.
“అసతోమా సద్గమయ”
భగవాన్ నాలోని సత్యాన్ని సన్మార్గంలోకి నడిపించు .
“తమ సోమా జ్యోతిర్గమయ”
భగవాన్ నాలోని తమ్మస్సు ను జ్యోతే స్వరూపంగా మార్చి ఆ వెలుగులో నిన్ను చేరే మార్గాన్ని చూపించు.
“మృత్యోర్మా అమృతంగ మయ”
“భగవాన్ ఇది నాకు మృతువు కాదు. నాకు అమరత్వం. ఆత్మ సంతృప్తితో నేను నా ఈ దేహాన్ని వదిలేసి చేసే నా అంతిమ ప్రయాణం ”
కావ్య కన్నీళ్ళు తుడుచుకొంటూ , డైరీలోని చివరి పేజీ మూసింది.