
ఎప్పుడొస్తుందో ఆ రోజు…!
నిను చూసిన కనులు చెమ్మగిల్లన రోజు…
నా పెదవులు విచ్చుకున్న రోజు..
నీ కోసమే జీవించే ఈ ప్రాణం..
స్పందించే హృదయం..
ఆనందించే రోజు…
కనులారా నీ ఆననం దర్శించే రోజు..
నీ చిటికెన వేలు అందించి …
నువు నను నడిపించే రోజు…
ఇరువురి పదముల గమ్యం..
ఒకే వైపుగా సాగే రోజు…
నా ఎద కలవరింపులు..
నీకు వినిపించే రోజు..
నేనంటే నూవేనని…
నీకు తెలిసే అ రోజు…!!