
మల్లెలార మౌనమేల పిలిచినాడు మాధవుడే
జాజులారా జాగేలా తలచినాడు మాధవుడే
మధు మాలతి శయ్యపైన మందారపు అరుణిమలే
విరజాజుల శిగపాయల తురిమినాడు మాధవుడే
సంపెంగల సమీరమే పల్లవిగా పాడినదే
కలికితనమే చరణాలుగ కోరినాడు మాధవుడే
రెల్లు పూల రేకులపై తారాడిన వెన్నెలమ్మ
వలపుమీరి ఒడిని చేరి వొదిగినాడు మాధవుడే
మురళి రవళి అధరాలపై నవ్వినదే విజయమనీ
నడిరేయిని మబ్బుగానె కమ్మినాడు మాధవుడే
పిల్లన గ్రోవి గజల్ సంపుటి లోనిది
Audio Player