మన మహిళామణులు

నండూరి విజయసుమిత్ర

ఆమె ఇంటి వంటా సంగీతం సాహిత్యం జంటగా వెలిసిన పూదోట.సంగీతం పాడుతూ ఇతరులకు నేర్పుతూ సంగీత సరస్వతి ఆరాధన చేస్తున్న ఆమె నండూరి విజయసుమిత్ర గారు…


హలో ఫ్రెండ్స్
నా పేరు నండూరి విజయసుమిత్ర
మా నాన్నగారి పేరు నండూరి నరసింహారావు మా అమ్మ గారి పేరు నండూరి రాజరాజేశ్వరి మాది కళాకారుల ఫ్యామిలీ
నేను చిన్నతనం నుంచి కచేరీలు చేశాను అవి సినిమా పాటలు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా చేశాను లలిత సంగీతం చాలా బాగా పాడుతాను నేను ఆల్ ఇండియా రేడియో విజయవాడ క్యాజువల్ ఆర్టిస్టుని అంతేకాదు హైదరాబాదులో కూడా నేను క్యాజువల్ ఆర్టిస్ట్ గా ఉన్నాను
నేను B.A మ్యూజిక్ చేశాను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మద్రాస్ గవర్నమెంట్ కాలేజ్ నుంచి తమిళనాడు గవర్నమెంటు మ్యూజిక్ కాలేజీ నుంచి సంగీత టైటిల్ కోర్సు పాస్ అయ్యాను.
ఆమె తనను గూర్చి ఇలా పరిచయం చేసుకున్నారు ”
నేను ఆల్ఇండియోరేడియో లో బాల్యం నుంచి ఇప్పటి వరకూ డ్రామా ఆర్టిస్ట్ ని.లలిత భక్తి సంగీతం పాడుతాను.నేర్పుతాను.నాప్రథమగురువులు రామకుమారి
సర్వశ్రీ పెమ్మరాజు సూర్యారావు పాల్ఘాట్ కె.వి.నారాయణస్వామి టీ.ఎం.త్యాగరాజన్ రాజం అయ్యంగార్ మొదలైన హేమాహేమీలు

శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గారు శ్రీ షణ్ముఖ సుందరం మొదలైన వాళ్ళు కూడా నాకు గురువులు
ఆమె మద్రాసు లో సంగీత విద్వాన్ కోర్స్ చేస్తూ వైలెన్ నేర్చుకున్నారు.థియరీలో కూడా మంచి పట్టు ఉంది.స్వంతంగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి సంగీతం పాడుతూ బోధనకూడా చేపట్టారు.
మాతృదేవోభవ పితృదేవోభవ అని నా తల్లిదండ్రుల దీవెనలతో నేను సంగీతం లో అప్పటినుంచి ఇప్పటివరకు కూడా నేను పాడుతూనే ఉన్నాను నా జీవితమంతా ఇలాగే పడాలని పెద్దలందరూ ఆశీస్సులు కావాలని వేడుకుంటున్నాను
విజయవాడలో ఐదు సంవత్సరాలు నేను సంగీత కళాశాల గవర్నమెంట్ సంగీత కళాశాలలో విద్యనభ్యసించి డిప్లమా అయ్యాను అది తెలుగు యూనివర్సిటీ నుంచి
అక్కడ డ్యాన్సులకి ఐటమ్స్ అన్నిటికీ పాటనే కాకుండా అక్కడ మ్యూజిక్ అందరికీ బేసిక్స్ మ్యూజిక్ నేర్పుతూ ఉండేదాన్ని
ముఖ్యంగా సెయింట్ జోన్స్ సెకండరీ హై స్కూల్ గన్నవరంలో సింగరేణి కాలరీస్ గోల్డ్ హైస్కూల్లో కూచిపూడి ఆర్ట్ అకాడమీలో నేను చాలా అద్భుతంగా పనిచేశాను
అవుట్ స్టాండింగ్ గా నేను చాలా కచేరీలు చేశాను ఒకసారి సింగపూర్ కూడా వెళ్ళొచ్చాను
ఇలా తన అనుభవాలను పంచుకున్న సుమిత్ర గారి కి తరుణి అభినందనలు తెలియజేస్తోంది.
ఈమె ఫోన్ నెంబర్ 917995398454

Audio Player Audio Player

Audio Player

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మనసుటద్దం

గర్ల్ ఫ్రెండ్