మన మహిళామణులు

ఆల్ రౌండర్ డాక్టర్ సాజిదాఖాన్!

ఆమె సహనం ఓర్పు ఉల్లాసం పట్టుదల ఆవృత్తికే ఆభరణం ఆల్ రౌండర్.భారతదేశంలోనే తొలి మహిళా మ్యూజిక్ టెక్నీషియన్ గా సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గాయనిగా వాయిస్ ఓవర్ గా ఆమె ప్రతిభ లోకవిదితం.బాల్యంలో సంగీతం కూచిపూడి డాన్స్ నేర్చుకున్నారు.పియానో కీబోర్డ్ వాయించటం భారతీయ వాద్యాలపై అవగాహన ప్రయోగాలు ఆమె సొత్తు.టైం రాత్రి పగలు అనే భేదం లేక వర్క్ ఈజ్ వర్షిప్ లా పనిచేస్తారు.
మనసు మార్గం ఉంటే కులం మతం ఆర్ట్ క్రాఫ్ట్ కి అడ్డంకాదు. స్త్రీ పురుష లింగ వివక్షత సినీ ఫీల్డులో లేదు.మన వర్క్ మనటాలెంట్ సిన్సియారిటి ముఖ్యం అనే సాజిదాఖాన్ పిన్నవయసులో సాధించిన విజయాలు మహిళలకు గర్వకారణం.ఆమె విజయాల్లో కొన్ని..ఒక ఆడియో ఇంజనీర్ గా ఫస్ట్ లేడీస్ అవార్డు ని ఆనాటి రాష్ట్రపతి
శ్రీరాంనాధ్ కోవింద్ నుంచి అందుకున్నారు.తెలంగాణా విశిష్ట మహిళా పురస్కారం యు.ఎస్.నుంచి ఆనరరీ డాక్టరేట్ యునైటెడ్ థియోలాజికల్ రిసెర్చ్ యూనివర్సిటీ నుంచి పొందారు.ఫేమస్ ఇండియన్ ఉమెన్ పర్సనాలిటీస్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఇన్ సినిమా
ఇండియన్ ఉమెన్స్ హిస్టరీ మ్యూజియంలో IWHMగా వెలిగారు.హైరేంజ్ ఆఫ్ బుక్ రికార్డ్ వండర్ఫుల్ రికార్డ్ లైఫ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ యు.కె.ఆడియో ఇంజనీరింగ్ సొసైటీ ఇలా అన్నింటా సాజిదా పేరు మారు మ్రోగింది.60మూవీలకు అడ్వర్టైజ్మెంట్స్ ఆడియో బుక్స్ కి ఆమె చిరునామా గా వెలుగుతున్నారు.

బడిపిల్లల పోయెమ్స్ వారి గళంలో రికార్డ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.
రవీంద్ర భారతిలో బాల్యం నుంచి సంగీత పోటీలు ఫోక్ మ్యూజిక్ పోటీల్లో పాల్గొన్న ఆమె 12వక్లాస్ పాసైనారు . సింగింగ్ వీణ కూచిపూడి నృత్యం
రేడియో ప్రోగ్రాం లలో పాల్గొన్న ఆమె కి సామెతలు సపోర్ట్ ప్రోత్సాహం ఉంది.టాలీవుడ్ బాలీవుడ్ లో
దూసుకు పోతున్న ఈమె సందేశం ఏమంటే పేరెంట్స్
పిల్లల్ని ప్రోత్సహించాలి.వారి టాలెంట్ గుర్తించాలి.
లవకుశ యానిమేషన్ మూవీ బాగా సక్సెస్ ఐంది.అవసరమైతే 2_3రోజులు కంటిన్యూగా వర్కు
చేస్తూ ముందుకు దూసుకు పోతున్న ఆమె కి
పద్మపురస్కారం దక్కాలని తరుణి ఆశిస్తూ సెలవు తీసుకుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మహాపరి నిర్వాణం  !

ఏం చేస్తున్నావంటే ఏమని చెప్పను ?