మన మహిళామణులు భాగ్య…

బాల్యం నుంచీ కష్టాలు శరీరాంగాలలోపంతో బాధలను తట్టుకుని గుర్తింపు తెచ్చుకున్న భాగ్య…

నా పేరు దయ్యాల భాగ్య నా పుట్టుకతో వన్ లెగ్ లేదు మా ఊరు గూడూరు:- గ్రామము &మండలం. మహబూబాబాద్ జిల్లా. నేను పీజీ కంప్లీట్ చేశాను పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నాంపల్లి లో. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం మా మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకొని తర్వాత కొన్ని కొన్ని స్టేజ్ ల మీద డాన్స్ వేసుకుంటూ ఈరోజు రవీంద్ర భారతి అలాంటి పెద్ద వేదిక దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కొంతమంది చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్య చేసుకుంటున్నారు నన్ను చూసి ఏ ఒక్కరిలో ఆయన మార్పు వస్తుందని నా చిన్న ఈ ప్రయత్నం. ఇంకా నాలాంటి వాళ్లకు నేను ధైర్యం ఇవ్వాలని నా కోరిక.

నేను చిన్నప్పుడు స్కూల్ కెళ్లే టైం లో చాలా ఇబ్బందులు పడ్డాను మా అమ్మ నాన్న స్కూల్లో దించి మళ్ళి సాయంత్రం వాళ్లు పనికి వెళ్లి వచ్చిన తర్వాత నన్ను స్కూల్లో నుండి తీసుకొని వెళ్లే వాళ్ళు అలా ఫిఫ్త్ క్లాస్ వరకు అమ్మ నాన్న తోడు ఉన్నారు తర్వాత హనుమకొండ లోని ఒక హాస్టల్ ఉంటదని డిజేబుల్ వాళ్లకి ఇలా హాస్టల్స్ ఉంటాయని తెలిసి హన్మకొండ లోని సుబేదారి హైస్కూల్లో దాని పక్కనే హాస్టల్ లో జాయిన్ చేయడం జరిగింది తర్వాత నా తోటి విద్యార్థులు డిజేబుల్ పిల్లలని చూసి నేను స్కూల్ కి వెళ్లడం వాళ్ళతో టెన్త్ క్లాస్ అక్కడ పూర్తి చేసుకున్నాను సుబేదారి హై స్కూల్ తర్వాత ఇంటర్ హనుమకొండ విద్యారణ్య కాలేజ్ పూర్తి చేసుకున్నాను. ఆర్ట్స్ కాలేజ్ అక్కడే డిగ్రీ పూర్తి చేసుకున్నాను తర్వాత 2021లో హైదరాబాదులో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో జాయిన్ కావడం జరిగింది అక్కడ శ్రీలక్ష్మి మేడం గారి పరిచయం ఏర్పడింది డాన్స్ వేయడంతో మా తంగేడ కిషన్ రావు సార్ గారు ఆ డాన్స్ చూసి ఈ అమ్మాయికి లెగ్గు పెట్టించాలి అని శ్రీలక్ష్మి మేడం గారితో అనడంతో మేడం గారు ఎంతో అమూల్యమైన సమయం నా కోసం కేటాయించి మేడం గారు అక్షర్యన్ సంస్థ నుండి నాకు డబ్బులు హెల్ప్ చేయించారు అప్పనుండి ఇప్పటివరకు మేడం నాకు చాలా తోడ్పడ్డారు అమ్మ నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే ముందుగా నాకు గుర్తుకొచ్చే పేరు అయినంపూడి శ్రీలక్ష్మి మేడం గారి . నాకు దేవుడిచ్చిన వరం శ్రీలక్ష్మి మేడం గారు.

ఆమె ఎడంచేయి 2వేళ్లు పూర్తిగా లేకున్న నవ్వుతూ ఒంటి కాలితో డాన్స్ చేసే భాగ్య మనకు స్ఫూర్తిదాత. దైవం అనుకూలించి మంచి జాబ్ లో స్థిరపడాలని ఆశిద్దాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కనిపించే దైవాలు

తక్కెడ ఒరిగింది