మన మహిళామణులు బండారం వాగ్దేవి

బండారం వాగ్దేవి పాటతో ఉర్రూతలూగిస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది.ఆమె తన పరిచయం ఇలా చేసుకుంటోంది…..
పేరు: వాగ్దేవి (software engineer in Broadridge Financial solutions)
తల్లి: శ్రీదేవి (హౌస్ వైఫ్)
తండ్రి : B S G V L శాస్త్రి(ప్రభుత్వ ఉద్యోగి)
తమ్ముడు: సాయి వసంత్(బీటెక్)
పుట్టింది: నల్గొండ
ప్రస్తుతం: హైదరాబాద్ లో ఉంటున్నాం

పేరు బండారం వాగ్దేవి శర్మ పుట్టి పెరిగింది అంతా నల్లగొండ జిల్లాలోని వాగ్దేవి పేరుకు తగ్గట్టుగానే చిన్నప్పటినుండి క్లాసికల్ డాన్స్ మరియు మ్యూజిక్ శిక్షణ తీసుకుంది మూడేళ్ల వయసు నుండి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ భగవద్గీత శ్లోకాలు వంటి ఎన్నో పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకుంది శ్రీకృష్ణ వేషధారణ గోదాదేవి వేషధారణ శబరి వేషధారణ మరియు మదర్ తెరిసా ఇలా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో పాల్గొని జిల్లాస్థాయిలో ప్రధమ మరియు ద్వితీయ బహుమతులు గెలుచుకున్నది భగవద్గీత శ్లోకాలు పోటీలలో జిల్లాస్థాయిలో రెండుసార్లు ప్రధమ రెండు సార్లు ద్వితీయ బహుమతులు గెలుచుకుంది . నల్గొండలో డాక్టర్ ముడుంబై పురుషోత్తమాచార్యులు గారి దగ్గర సంగీత శిక్షణ తీసుకున్నది. జిల్లాలో పలు సంగీత కార్యక్రమాల్లో పాల్గొనేది జిల్లాస్థాయిలో ఎన్నో బహుమతులు గెలుచుకుంది రాష్ట్రస్థాయిలో కూడా పాడడం జరిగింది 2014లో మొదటిసారి ఈటీవీలో బాలసుబ్రహ్మణ్యం గారు నిర్వహించిన పాడుతా తీయగా ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. తరువాత 2015 లో జెమినీ టీవీలో బోల్ బేబీ బోల్ అనే ప్రోగ్రాంలో పాల్గొని తన పాటలతో అందరినీ అలరించింది. ఆ తరువాత ఈటీవీలో స్వర సంఘం స్వరాభిషేకం సామజ వర గమన ఇలాంటి ఎన్నో పాటల కార్యక్రమాలలో సపోర్టు సింగర్ గా కోరసు సింగర్ గా పాల్గొనడం జరిగింది. హైదరాబాదులో నిర్వహించిన వాయిస్ ఆఫ్ హైదరాబాద్ పాటల పోటీలలో రెండవ బహుమతి గెలుచుకుంది అంతేకాకుండా బాలల హక్కుల సంఘం వారి ఆధ్వర్యంలో 2015 లో నిపుణ అవార్డు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా 2017లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు అంతర్జాతీయ కార్టూన్ ఫెస్టివల్ జరిగింది ఆ సందర్భంలో వాగ్దేవి వేసిన కార్టూన్ తెలంగాణ చరిత్ర మరియు బతుకమ్మ. ఈ కార్టూన్ ప్రపంచ తెలుగు మహాసభలకు ఎంపికైంది. అందుకుగాను ఒక సర్టిఫికెట్ కొంత ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చదువుకు ఎక్కడ ఇబ్బంది కలుగకుండా తన బీటెక్ పూర్తి చేసుకుని సాఫ్ట్వేర్ గా ఉద్యోగం చేస్తూ తన సంగీత జీవితాన్ని కొనసాగిస్తుంది. ఎన్నో యూట్యూబ్ రికార్డింగ్స్ మరియు షార్ట్ ఫిలిమ్స్ కి వెబ్ సిరీస్ కి పాటలు మరియు చిన్న చిన్న డబ్బింగ్ కూడా చేస్తున్నది. దాదాపుగా చిన్నప్పటినుండి ఒక 200 సంగీత కార్యక్రమాలు చేపట్టింది. అన్నమయ్య రామదాసు త్యాగరాజు గీతాలను ఆలపించడం జరిగింది.

2015 లో జరిగిన ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ కి ప్రపంచవ్యాప్తంగా 400 మంది చిన్నారులను చైల్డ్ డెలిగేట్స్ గా ఆహ్వానించారు అందులో వాగ్దేవిని కూడా ఒక చైల్డ్ డెలిగేటుగా ఆహ్వానించారు.
7 , 8 ఏళ్ల వయసులో ఆలిండియా రేడియోలో బాలల కార్యక్రమం లో రెండుసార్లు పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం సినిమా పాటలు ఫోక్ సాంగ్స్ డివోషనల్ సాంగ్స్ అన్ని రకాల గీతాలను ఆలపిస్తున్నది. నల్గొండలో ప్రతి సంవత్సరం జరిగే ఘంటసాల జయంతి రోజున తను కూడా పాల్గొనడం జరుగుతున్నది ఇంకొక విషయం ఏమిటంటే ఘంటసాల గారి పుట్టినరోజు వాగ్దేవి పుట్టినరోజు ఒకటే రోజు కావడం డిసెంబర్ 4 ప్రతి సంవత్సరం ఘంటసాల గారి పుట్టినరోజు ప్రోగ్రాంలోని తన పుట్టినరోజు చేసుకోవడం జరుగుతున్నది.
నా చిన్నతనం నుండి అంటే మూడేళ్ల వయసు నుండి మా అమ్మగారు ప్రతి కాంపిటీషన్లోనూ నన్ను పార్టిసిపేషన్ చేయించడం జరిగేది నా టాలెంట్ గుర్తించి మా నాన్నగారు సంగీతం .మరియు డాన్స్ లో శిక్షణ ఇప్పించారు వారి ప్రోత్సాహంతోనే టీవీ చానల్స్ లో ఇతర కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది నా చిన్నతనం అంతా నల్గొండ లోనే జరిగింది చదువు మరియు ఉద్యోగరీత్యా ఇతర సంగీత కార్యక్రమాల కోసం హైదరాబాదు రావడం జరిగింది.

2015లో 19th ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ హైదరాబాద్ లో జరిగింది. ఆ సమయంలో మేము నల్గొండలో ఉండేవాళ్ళం. అలా ప్రతి జిల్లా నుంచి ఒక నలుగురు టాలెంటెడ్ పిల్లలను సెలెక్ట్ చేసి హైదరాబాద్ పంపడం జరిగింది. అందులో నన్ను కూడా సెలెక్ట్ చేసి పంపించారు ఈ ఫిలిం ఫెస్టివల్ వారం రోజులు జరిగింది ఇక్కడ హైదరాబాద్లో.

భామిని భువన విజయం ప్రవేశం: ఒకానొక రోజు చిమ్మపూడి వారు మా గురువుగారైన డాక్టర్ ఎం పురుషోత్తమా చారి గారికి ఫోన్ చేయడం జరిగింది వారిద్దరూ పదేళ్ల నుంచి మిత్రులు వివిధ నాటకాల పోటీలకు న్యాయనిర్ణేతలుగా వెళ్లేవారు… అయితే ఈ మధ్యకాలంలో చీమ్మపూడి శ్రీరామ్ మూర్తి గారు మా గురువుగారికి ఫోన్ చేసినప్పుడు ఇలా మేము భామిని భువన విజయం అనే రూపకం వేస్తున్నట్లు ఆయనకి చెప్పి ఎవరైనా బాగా పాడే వాళ్ళు ఉన్నారా అని అడిగారు. అలా అడిగినప్పుడు శిష్యురాలైన నన్ను ఆయనకి సిఫార్సు చేయడం జరిగింది. తర్వాత నాకు చిమ్మపూడి శ్రీరామ్ మూర్తి గారు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. భామనీ భువన విజయం లో ఒక రెండు పద్యాలు పంపి నేర్చుకుని పాడి పంపమన్నారు అలాగే పాడి పంపాను. ఆయన విని చాలా బాగా పాడుతున్నావ్ అని చెప్పి నాకు పింగళి సూరన పాత్రను ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

జయహో జయహో సునిత

కనిపించే దైవాలు