శ్రీమతి హిప్నోపద్మాకమలాకర్ ఎలియాస్ గ్రంథి పద్మావతి తల్లి పుష్పావతి, తండ్రి పూర్ణ చంద్రరావు కి ఆగస్టు 5, 1973లో జన్మించి రాజమండ్రిలోనే విద్యనభ్యసించి జీవన ప్రస్థానాన్ని ప్రారంభించారు. హిప్నో కమలాకర్ వద్ద హిప్నాటిజం, సైకాలజీకి సంబంధించి పలు అంశాలు, నైపుణ్యాలలో శిక్షణ పొంది ఫిబ్రవరి 27, 1994లో ఆయననే వివాహం చేసుకున్న ఈమె ఆయనతోపాటు పలు రంగాలలో అత్యున్నత శిఖరాలను అదిరోహించారు.
వీరి కుమార్తె సరోజారాయ్, కుమారుడు హిమకర్లు ప్రపంచంలోనే మూడేళ్ళ ప్రాయానికే ఇంద్రజాల ప్రదర్శనలిచ్చిన అతి చిన్న వయసు కలిగిన బాల మెజీషియన్లుగా ప్రపంచ ఖ్యాతి గడించారు. ఈమె సైకాలజీ, సోషియాలజీ, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో మూడు మాస్టర్ డిగ్రీలను, మ్యారేజ్-ఫ్యామిలీ హెల్త్-సైకాలజికల్ కౌన్సెలింగ్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో నాలుగు పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లొమాలు చేశారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధించాలంటే ముందుగా మానసికంగా సంసిద్ధురాలు కావాలనేది ఆమె ప్రగాఢ విశ్వాసం. అందుకే ఆమె భారతదేశ తొలి మహిళా స్టేజ్ హిప్నాటిస్ట్గా హిప్నాటిజం ప్రదర్శనలు ఇచ్చారు. వీటి ద్వారా మూఢనమ్మకాల నిర్మూలన కోసం సామాజిక సమస్యల పరిష్కారం కోసం జన చైతన్యానికి ప్రయత్నం చేశారు. దీనికోసం ఆమె సైకాలజీ, వ్యక్తిత్వ వికాసం, గృహ అవసరాలపై 50కు పైగా పుస్తకాలు రచించారు. వీటిలో 20కి పైగా కన్నడ భాషలోకి అనువధించబడ్డాయి. ప్రతి మహిళా “రేపటి ప్రపంచం నాదే” అన్న విశ్వాసంతో ముందడుగు వేయాలని ఆమె ఆకాంక్ష. అందుకే ఆమె నిర్వహించిన కార్యక్రమాలు అభివృద్ధికి ఆటంకంగా పరిణమించే నమ్మకాలనీ, తప్పుడు అభిప్రాయాలను తొలగించి అభివృద్ధిపథంవైపు ప్రతివ్యక్తి పయనించడానికి దోహదం చేస్తున్నాయి. ఆమె పత్రికలలో కాలమ్స్ నిర్వహించడం ద్వారా వందలాది టి.వి. ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి కృషి చేశారు.
ఈ విశేష కృషిని గుర్తించి కేంద్ర ప్రభుత్వ మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా 2012-మార్చి 7వ తేదీన న్యూ ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా “దేవి ఆహల్యాబాయి హోల్కర్ అవార్డు-2011”ను హిప్నో పద్మాకమలాకర్కు అందజేసారు. ఈ అవార్డు కింద 3 లక్షల నగదు, ప్రశంసాపత్రం అందజేసి దుశ్శాలువాతో సత్కరించారు. ఈమె మైండ్ పర్సనాలిటీ కేర్ సంస్థ ద్వారా హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నంలలో సైకాలజీ కౌన్సెలింగ్ సేవలు అందిస్తున్నారు. కుమార్తె సరోజారాయ్ హ్యుమన్ ఫ్యాక్టర్స్ పై అమెరికా ఓల్డ్ డోమినీయన్ యూనివర్సిటీ లో పి.హెచ్.డి చదువు తుంది. తల్లిదండ్రులు రాసిన గ్రంథాలను ఆంగ్లంలోకి అనువదిస్తూ, స్టేజ్ హిప్నాటిజం ప్రదర్శనలు ఇస్తూ భారతదేశ రెండవ మహిళా స్టేజ్ హిప్నాటిస్టుగా సంచనలం సృష్టిస్తోంది. కొడుకు హిమకర్ విఎప్ఎక్స్ పై పి.జి చదువుతున్నాడు.
ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు ఉచితంగా (స్వాతంత్ర్య, రిపబ్లిక్ డే,అబ్ధుల్ కలామ్, గాంధీ, పటేల్, అంబేద్కర్ జయంతి) ముఖ్య తేదీలలో వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించి అవగాహన కల్పించడం. బాలికలకు*బ్యాడ్ టచ్, గుడ్ టచ్* పై అవగాహన, అనాథ విద్యార్థులు గృహం, ఫిజికల్ ఛాలెంజ్ పిల్లలకు లో హెల్త్ క్యాంపులు నిర్వహించి మందులు,శానిటరీ నాపికిన్స్, పోషకాహారం అందించడం. పరీక్ష సమయంలో అవగాహన కల్పించడం. టిచర్స్ బాగుంటే విద్యార్థులు బాగుంటారని వారికి సదస్సు నిర్వహించడం. నవతెలంగాణ దినపత్రికలో, ఉషా మంత్లీ పత్రిక లో ఆర్టికల్స్ వస్తున్నాయి. కుటుంబం, భార్య భర్తలు ఆనందంగా ఉంటే సమాజం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో సాక్షి, వనితా, సుమన్ ఛానెల్స్ లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఫిబ్రవరి 27, 1994 మా పెళ్లి సమరం, పెద్ద వ్యక్తులు ఆధ్వర్యంలో రాజమండ్రి మహాలక్ష్మి హోటల్ లో వెయ్య మంది మధ్య అంగరంగ వైభవంగా దండలు మార్చుకున్నాం. ఆరోజే హబ్బీ (కమలాకర్) తో ( తిట్లు)అక్షింతలు మా స్నేహితులు భయంతో వద్దు నీవు వెళ్ళకూ అని…. కానీ (తూర్పుగోదావరి నాగుల్లంక)అక్కడికి వెళ్ళాకా ఒంటరిగా..
తర్వాత రాజమండ్రిలో (అత్త, మామగారు, బావగారు, మరిది, కమలాకర్ అక్క కొడుకు) ఉమ్మడి కుటుంబం. మా మామగారు ఏం వంట చెయ్యమంటే అదే చెయ్యడం. పిల్లలు పుట్టిన తరువాత వాళ్ళు స్కూల్ కి వెళ్ళే టప్పుడు వాళ్ళకి ఇష్టమైనవి బాక్స్ లో పెట్టడంతో హమ్మయ్యా అనుకోవడం…మా నాన్న ఓకే మాట అనేవారు. ఎవరు ఏమి అన్నా పట్టించుకోవద్దు. నీవు వారికి టైమ్ కి పెడుతున్నావా.. లేదా అని…. నా హబ్బీ చాలా సున్నితమైన మనసు… వాళ్ళకు “టీ ” లో పంచదార తగ్గినా ఈయన అలిగేవారు.
మా ఇద్దరి మధ్య అలుముకున్న విరుపులు మెరుపులు విరసం సరసం చాలా చక్కగా ఉండేవి. గొడవ జరిగిన వెంటనే నేనే అలక తీర్చడానికి మాట్లాడే దానిని. అబద్దం చెప్పావు అంటే నేను పాము బుసలు కొట్టే విధంగా అరిచే దానిని. ఇప్పుడు మా అమ్మాయి హ్యూమన్ ఫ్యాక్టర్స్ పై అమెరికా ఓల్డ్ డోమినీయన్ లో పి.హెచ్.డి చేస్తుంది. బాబు హిమకర్ విఎప్ఎక్స్ లో పిజి చేస్తున్నాడు.
హిప్నాటిస్ట్‌గా
1987లో మిస్టర్ హిప్నోకమలాకర్ ద్వారా హిప్నోటిజం టెక్నిక్స్‌లో శిక్షణ పొందారు. 1988లో హిప్నాటిజంలో స్టేజ్ పెర్ఫార్మెన్స్ (భారతదేశంలో) ఇచ్చిన మొదటి మహిళ నేను మరియు మీడియా ప్రశంసలు అందుకున్నాను. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మరియు అనేక ఇతర రాష్ట్రాలలో నేను ప్రజలలో మానవ వనరుల ప్రయోజనం కోసం హిప్నాటిజం ప్రదర్శనలు ఇచ్చాను, దేశ ప్రగతికి ఆటంకం కలిగించే సామాజిక అంధ విశ్వాసాలు మరియు విశ్వాసాల గురించి అవగాహన కల్పించడం. 3000 రంగస్థల ప్రదర్శనలు ఇవ్వబడ్డాయి మరియు గొప్ప విజయాల కోసం దేశాన్ని నిర్మించడానికి వారి బలాలు మరియు సామర్థ్యాలను పెంచడానికి ప్రజలను ప్రోత్సహించారు.
మనస్తత్వవేత్తగా
వివాహం, కుటుంబం, ఆరోగ్య సలహాదారు మరియు మనస్తత్వవేత్తగా 25 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం. నా వృత్తి జీవితంలో నేను చాలా విజయవంతమైన కేసులను తీసుకున్నాను. నేను క్లినికల్ ఇచ్చాను. వ్యక్తులు, కుటుంబాలు మరియు సమూహాలకు సేవలు. ఇతర ఆరోగ్య మరియు ప్రవర్తనా ఆరోగ్య నిపుణులు మరియు సంస్థలతో ఇంటర్ మరియు ఇంట్రా-ప్రొఫెషనల్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. నేను వ్యక్తులు వారి జీవిత లక్ష్యాలను చేరుకోవడానికి సహాయం చేసాను మరియు వారి లక్షణాలను మెరుగుపరచడానికి వ్యక్తిత్వ వికాసంలో ప్రజలకు శిక్షణ ఇచ్చాను.
శిక్షకుడిగా మరియు సామాజిక కార్యకర్తగా
ముఖ్యంగా యువతకు అవగాహన తీసుకురావడానికి మరియు వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి మరియు వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి వందలాది శిక్షణా సమావేశాలను నిర్వహించింది. మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రదర్శనలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. SURE (సొసైటీ ఫర్ అర్బన్, రూరల్ ఎంపవర్‌మెంట్) స్థాపించడం ద్వారా A.P.లో మహిళలు మరియు కుటుంబ సంక్షేమ అభివృద్ధికి వివిధ కార్యక్రమాలను నిర్వహించింది. మరియు సమాజాన్ని సుసంపన్నం చేసేందుకు యువతలో క్రమం తప్పకుండా వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలను కూడా నిర్వహించింది. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా టాక్ షోలు మరియు I News I café, Maa TV- Maavidakulu, Z TV- TaruniTarunam, TV 5, Vanitha TVలో బీ హ్యాపీ అండ్ మహిళా హెల్ప్‌లైన్, జెమిని న్యూస్ సంభాషణలు. ఆంధ్రభూమిలో చెలి, భూమిక, సూర్యలో ధీర, ఆంధ్రజ్యోతిలో నవ్య, ఆంధ్రప్రభలోని సండే మ్యాగజైన్ వంటి దినపత్రికలు మరియు వారపత్రికలలో గత 5 సంవత్సరాలుగా వ్యాసాలు మరియు కాలమ్‌లు.
నాకు 2007 సంవత్సరంలో యాక్సిడెంట్లో రెండు చేతులు ఇరిగిపోవడం, సంవత్సరానికి ఎడమచేయి పనిచేయడం, అన్నింటికన్నా భయంకరమైన సంఘటన…కరోనా కాలంలో కమలాకర్ గారిని కోల్పోవడం ఆ సమయంలో నాకు , నా పిల్లలకు మనోధైర్యాన్ని సమాజమే కలిగించింది. ఆ అండ మాకు ప్రేరణగా నిలిచింది, ముందుకు సాగేందుకు బాటలు చూపించింది.”
అందరికి ఒకటే జీవితం అయితే నాకు ‘2’
ఇప్పుడిప్పుడే మరలా మొదలైన జీవితం…
నిజంగా ఇలాంటి మహిళామణిని పరిచయం చేయటం నాకు గర్వకారణం…