మనసు ఒక మందారం

ఎద మీటే స్వర సుధ జలజలమన్నప్పుడు
నింగి నీకు చుక్కల పందిరే!

మబ్బులు వాన ఏకమై
తుళ్ళింతలు ఇచ్చినప్పుడు
మనసు ఒక మందారం వనమే!

చిత్రకారిణి _ భవ్యధూళిపాళ సిరి

ఏకాంత సౌరవాల
ఆవాస విలాసాల కేళీ విలోలతే
విమలమై వెలుగుల పురివిప్పు!

ఇప్పుడు చినుకుల సవ్వళ్లే
కాళ్లకు వినిపిస్తున్నవి
నీ హృదయ విమానం రెక్కలార్చినట్టు!

నీడ నిర్గుణ భావంలా
నీవే ఓ విహంగానివి
ఇక యవ్వనం విరిసిన గొడుగై
ఒక రక్షణాయుధం అవుతుంది!

చిత్రకవితా కవయిత్రి – డాక్టర్ కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకులు.

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఓడిన గెలుపు

పులికాపు