బాలగిరిలో పుట్టి పరుగులెడతావు,
బాసర తీర్థాన గోదావరిలో కలుస్తావు,
అమ్మా మా జీవనాధారం నీవు,
మూడు లక్షల ఎకరాల పంటకి మూలమయ్యావు,
వనదుర్గ క్షేత్రాన ఏడుపాయలుగ పారావు,
సింగూరులో పొంగుల హారమయ్యావు,
చాముండేశ్వరి క్షేత్రాన ప్రసిద్ధి గాంచావు,
పేరూరు సరస్వతమ్మ ఒడిలో గరుడ గంగవయ్యావు,
మెతుకు సీమ రైతుల కల్పవల్లివి నువ్వు,
మంచి నడవడికను మాకు నేర్పావు,
ఆది నుండి తుది దాకా మాతోనే ఉంటావు,
కంటికి రెప్పలా మమ్మల్ని కాస్తావు,
మెతుకుదుర్గమునకు ప్రతిబింబమయ్యావు,
నీ ఋణాన్ని తీర్చాలంటే
మాకు ఎన్ని జన్మలైనా చాలవు.