
స్నేహితుడు ‘మంచివాడే’
అన్న నమ్మకం అతడు
వెన్నుపోటు పొడిచేదాక తెలియదు.
షావుకారు ఎంత మంచోడో
అన్న నమ్మకం అతడు
భూమిని కాజేసే
దాకా తెలియదు .
అన్నదమ్ముల సఖ్యత తండ్రి చనిపోయే వరకే
అన్న విషయం తెలియదు.
భార్యని అణిచేసేవాడికి
భార్య విలువ ఆమె అతడ్ని విడిచిపెట్టేశాక గానీ తెలియదు.
మూతి కాలాకే దీపాన్ని ముద్దు పెట్టుకోవడం తప్పుని తెలియదు.