
పసి మనసులు
విరిసిన పువ్వులు
ఊహలు ఊసులు
కంటి మెరుపులు
కమనీయ దృశ్యాలు
పున్నమి కి వెన్నెల పోలికగా
కుటుంబ వృక్షానికి తానో కొమ్మ
తాతగారట నానమ్మనట
తనతో సరితూగునట
ప్రేమ మొత్తం
నవ వర్ణపు చెట్టట
రంగులు రూపం తో
చిహ్నమైపోతాయట
ముత్తాత వారసత్వంగా
తానే బొమ్మలో బొమ్మ అయినట్టు
అక్షర చిత్రాలెప్పుడేస్తుందో
కాలం కలకాలం
కన్నుల పండుగగా
నవ్వులు తీర్చినప్పుడు
కవితగా పురివిప్పదూ
కళామతల్లికి భుజకీర్తి అవదూ!
చిత్ర కవిత రచన – నీహారిణి కొండపల్లి