అందహీనమైన అవతారం
ఎత్తడానికి
ఆత్రుతగా ఎదురుచూస్తుంది
నవమాసాలు కడుపులో కదలికతో ఆనందపడుతొంది
పురిటినొప్పులకు ఓర్చుకొని జన్మనిస్తానంటుంది
పస్తులున్నాసరే పసి పాపకు పాలిస్తానంటుంది
అన్ని బాధలు అనుభవించిన అమ్మే ……?
అంతు పట్టని …!
సమస్య……!
అమ్మకే…!
నిస్వార్థమైన
ప్రేమ ఉంటే
ఇప్పుడు అమ్మ ప్రేమ..!
భారమయ్యేది కాదేమో ..!
ఈ సమస్య వచ్చేది కాదేమో!
కనటం లో వున్న ప్రేమ
పెంపంకంలో లేదెందుకో!
పెంచిపెద్దాచేసిన పిల్లలపై
ప్రేమ పంచితే బాగుంటుందేమో!