ప్రియమైన శత్రువు

కవిత

మృదుల తెలుగు అధ్యాపకురాలు సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల, ఇబ్రహీంపట్నం.

లేశమైన లేదు ఆశ
నా వెంట నీ వొస్తావని
నిరాశ కూడా లేదు సుమా
నువ్వొచ్చినా
నాతోనే ఆగవని
నాకెపుడో తెలుసు .

ఐనా ఎందుకో
ఈ ఆశ నిరాశలు?

చావు పుట్టుకలను
గెలుపోటములను
చీకటి వెలుగులను
రెండింటినీ
సమానంగా పంచడం
అందరికీ
సరితూగేలా చేయడం
నీకు తెలిసినంతగా
సూర్యచంద్రులకు
కూడా తెలియదేమో ?

కాలం తన పని తాను
చేసుకుపోతుంది అంటే
అమాయకపు బాల్యంలో
అర్థం కాలేదు .
పెద్దయితే కానీ
తెలిసి రాలేదు
నువ్వింత ప్రాక్టికల్ అని.

కానీ
ఒకటి మాత్రం బాగా తెలిసింది

కాలంతో పోటీ పడడమే
కానీ గెలవలేమని.
కాలంతో పరిగెత్తడమే
కానీ ఆగిపోతామని.

Written by Mrudula

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మానవత్వం పరిమళించిన వేళ

మన మహిళామణులు – శ్రీమతి భవానీ కృష్ణమూర్తి