
పాకశాస్త్ర ప్రావీణ్యానికి పరిచయ వేదిక
విస్తట్లో విందు భోజనానికి విషయసూచిక
వంటింట్లో మకుటం లేని మహారాణి
ఇంతి చేతిలో ఇమిడిన సేఫ్టీ లాకర్
ఔషధాల గని పోషకాల ఖని
చిట్కా వైద్యపు చిరునామా
భిన్నరుచుల సమ్మేళనం
రోగనిరోధక ప్రత్యామ్నాయం
మసాలా ఘాటు నసాళానికెక్కినా
విస్తరాకు హరివిల్లై విరబూసినా
ఆ ఘనత పోపు డబ్బా సొంతం
ఇంటి ఇల్లాలికి ప్రియనేస్తం
చిల్లర డబ్బులు దాచిన వాళ్ళ కు
అత్యవసరవేళ అక్కున చేర్చుకునే ఆపన్నహస్తం