
ఈరోజు సమాజాన్ని దేశాన్ని కలవర పెడుతూ సంచలనం సృష్టిస్తున్న న్యూస్ ఒకటే…. హిందూ ఆడపిల్లలపై విసురుతున్న వల…లవ్ జిహాద్ …!!
చాలా ఆలోచించదగ్గ విషయం ఏమిటంటే దీనికి బలి అవుతున్నది అధిక శాతం హిందూ అమ్మాయిలే ….
కారణం ఏమిటి .?
మన ధర్మం మనకు ఇచ్చిన అధిక స్వేచ్చా.?
మన ఇళ్లల్లో పిల్లలకి పెద్దల మాటపై గౌరవం లేకపోవడమా ..?
పాశ్చాత్య సంస్కృతి పై మోజుతో చాలా కుటుంబాల్లో చోటు చేసుకుంటున్న విచ్చలవిడితనమా ..?
కారణం ఏదైనా నష్టపోతున్నది అక్షరాలా మన ఆడపిల్లలు …
లవ్ జిహాద్ ఏమిటి అనేది అందరికీ తెలుసు. పరిణామాలు కూడా అందరికీ తెలుసు .ప్రస్తుతం అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉంటూ చేయాల్సిన మొదటి పని టీనేజ్ ఆడపిల్లలకి ఈ విషయం గురించి పూర్తి అవగాహన కలిగించడం.
ఇది చాలా అవసరం. మహిళా సామాజిక కార్యకర్తలు ఈ విషయంలో ముందుకు వచ్చి..
– ఆడపిల్లలకు అవగాహన తరగతులు తీసుకోవాలి.
– చెప్పడం ద్వారా కన్నా వీడియోల ద్వారా వారిలో ఆలోచన కలిగించాలి.
– బలైపోయిన ఆడపిల్లల వీడియోలను విరివిగా ప్రచారం చేయాలి .వాటిని సజీవ ఉదాహరణలుగా చూపాలి.
– లవ్ జిహాద్ కోసం అవతలి వారు అవలంబిస్తున్న పద్ధతులను అత్యధికంగా ప్రచారం చేయాలి. –
– ముస్లిం స్నేహతురాళ్ల విషయంలో వారు అప్రమత్తంగా ఉండేలా చేయాలి.
– మారుపేరులతో పరిచయం చేసుకునే అబ్బాయిల గురించి తెలియ చెప్పాలి .
అతి ముఖ్యంగా …
” అందరూ ఎలాంటి వారైనా నేను ప్రేమించిన అబ్బాయి మాత్రం చాలా మంచివాడు .” అని చెప్పే ఆడపిల్లల భ్రమలు తొలగించాలి .
ఇంకా ముఖ్యంగా ఇంట్లో పెద్దల నుంచి దాచిపెట్టి పరిచయాలను, ప్రేమకలాపాలను సాగించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో వారి జీవితాలకే ప్రమాదం అని పదేపదే హెచ్చరించాలి .
ఇవన్నీ ఒక ఎత్తు అయితే తప్పు చేసే అవకాశాలు అధికంగా ఉండే వయసులో ఉన్న పిల్లల కదలికలను తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ ఉండాలి. గారాబం మొహమాటం వదిలివారిని హెచ్చరిస్తూ ఉండాలి.
పిల్లల కదలికలు అనుమానాస్పదంగా కనిపిస్తున్నా కొన్ని కుటుంబాల్లో పెద్దలు ఏమీ చెప్పలేని స్థితిలో నిస్సహాయంగా సతమతమవుతూ ఉండడం కనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రవర్తన ఆలోచన విధానం మారాల్సింది మన ఆడపిల్లల్లో మగపిల్లల్లో కూడా….
రెండు చోట్ల వీరే నష్టపోతారు కనుక.