
‘ పుస్తకం ‘హస్తభూషణమే కాదు మస్తిష్కపు మనోవిశ్లేషణా భాండాగార సర్వస్వం
పొత్తపు పుటలలో దాగిన జ్ఞాపకాల దొంతరలెన్నో !
మదిని తొలిచేవి కొన్నైతే కదిలించేవి మరెన్నో!
మనస్సుప్పొంగి ఆనంద భాష్పధారలు రాల్చే సందర్భాలుంటాయి
మనోవేదనతో కళ్ళు కన్నీటి కాసారాలనూ తలపిస్తాయి మనోవికాసపు మార్గదర్శిలా మారుతుంటుందోసారి !
మంచి మిత్రుడి ఆత్మ ప్రబోధంలా గోచరిస్తుంది ఇంకోసారి!
భాషలోని మాధుర్యపు రసానుభూతిని ఆస్వాదిస్తూ ఆకృతి దాల్చిన అక్షర శిశువుల్లా దేదీప్యమానమై
పొత్తపు పొత్తిళ్ళలో సేదతీరుతుంటాయి ఎల్లవేళలా..
ఆకర్షితులై చేతబూని మదినింపుకుంటే
తరగని నీ జ్ఞాన తృష్ణకు సత్కారాలందిస్తుంది
అలజడులతో అలసిన మదిని సేదదీర్చే
సుందర మలయానిలమే ఈ అరచేతి అక్షరధామం
ఓటమిలో తనది
స్ఫూర్తి ప్రదాత స్థాయి
ఒంటరి పోరులో సుశిక్షితుడైన యోధుడి సాటి
ఏకాంతంలో హాయిని గొల్పే
చైతన్య స్రవంతి
అనునిత్యం ఉత్తేజాన్నందించే అక్షరసమాహా