కదలిరండీ పర్యావరణ ప్రేమికుల్లారా!
స్వాగతించండీ పులకితాంగ రసైక మందిరప్రకృతి కాంతను
అలంకరించండీ భూమాత గళమున పచ్చని మణులహారాన్ని
పెంచండీ మానవాళి మనుగడ కోసం మహావృక్షాలను
కల్పించండీ విత్తనబంతుల విసిరి అడవులకు రక్షణను
పదిలపరచండీ వనాలసంపదను,వన్యప్రాణులజీవనాలను
నివారించండీ జనావాసాలనడుమ విషవాయువుచిమ్మేపరిశ్రమా భూతాలను
పంచండీ ఔషధమొక్కలునాటి మహాభాగ్య
ఆరోగ్యసిరిని
విరచించండీ బంగారు తెలంగాణ భవితవ్యాన్ని
శ్రమించండీ హరిత తెలంగాణకై అహరహమ్మును
చాటండీ ఎలుగెత్తి నాటినమొక్కల సంరక్షణ
బాధ్యత ను మరవద్దని
బోధించండీ జగమంతా మురిసేట్టుకన్నబిడ్డలవలె చెట్లను సాకాలని
కాపాడండీ కాలుష్యభరితమైన నేటి పంచభూతాలను
చెప్పండీ పరిశుభ్రత పచ్చదనం ఇంటింటా నెలకొల్పాలని
చల్లండీ ఉషఃకిరణ నవోఢలీభువిపై హరిత వర్ణ పత్రాలకళ్ళాపిని
తీర్చండీ చిత్రవిచిత్ర వర్ణ శోభితమైన సుమాల రంగవల్లులను
ఆస్వాదించండీ ప్రకృతి ప్రసాద ఆనంద జీవన ఫలాలను
దీవించండీ భావి తరాలకు చిరంజీవ సుఖీభవ యని