
గత కొన్ని రోజులుగా రాష్ట్రాన్ని అట్టుడికిస్తున్న (ఆ మాటకొస్తే ఇదేమీ కొత్తగా ఉత్పన్నమైంది కాకపోయినా)
సమస్య కూడా ఊపిరి పీచుకోవడం కూడా సరిగా రాని పసిబిడ్డలపై జరుగుతున్న పైశాచిక రకీడ సభ్యసమాజఁ సిగుగతో తలదించుకనేలా చేసింది. మానవత్వాన్ని మంట గలిపిన ఈ సంఘటన ప్రతి హృదయాన్ని కలచివేసింది.
త్రిమాతలలో లక్ష్మీదేవి, పార్వతీదేవి, ఆలయాలలో పోల్చి చూస్తే సరస్వతిదేవికి ఆలయాలు తక్కువగా ఉండటానికి కారణం ప్రతీ బడి ఆ తల్లి గుడి అన్నది జగమెరిగిన సత్యం|| అంత పవిత్రమైన ప్రాంగణంలో విషనాగులు తిరుగాడుతుంటే, వాటి కోరలు పెరికేయడంలో క్రూరమృగాలు సంచరిస్తూ ఉంటే వాటిని తుదముట్టించడంలో ఎందుకు విఫలమౌతున్నాము, ‘జయము జయము మహారాజా… బందెగని తెచ్చినారము ప్రభుని కడకు’ అని సైనికాధికారి అన్నప్పుడు ఈమె కడుపుననే నుదయించి యున్న యెంతటి ధన్యుడనగుదునోగద’ అని కానుకలిచ్చి ఆ స్త్రీని సగౌరవంగా తిరిగి పంపించిన మహోన్నత మరాఠా యోధుడు శివాజీని కన్నభూమి ఇది. శాపవిమోచనం పొందిన అహల్యామాతకు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ప్రణమిల్లిన సంస్కృతి మనది.
ప్రతి భారత సతి రూపం చంద్రమతి మాంగళ్యం’, భరతభూమి స్త్రీ శీలానికి, పవిత్రతకు ఎంతగా ప్రాధాన్యత నిస్తుందో అవగతమవుతుంది. ‘అర్ధరాత్రి స్త్రీ స్వతంత్రంగా తిరుగగలిగినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్య్రం’ అన్న బాపూజీ మాటలు క్షేత్ర స్వరూపి అయిన స్త్రీ ఎంత పవిత్రమూర్తి అన్న విషయం అర్థమౌతుంది.
స్త్రీని ఇంతగా గౌరవించి, పూజించడం వల్లనే ప్రపంచపటంలో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం దక్కింది. మన సంస్కృతీ సాంప్రదాయాలకు ఉన్న పవిత్రత వల్లనే మన ఖ్యాతి దశదిశలా వ్యాపించింది.
పసిపిల్లలపై, వృద్ధులపై, విదేశీ పర్యాటకులపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఎంత నీచమైన, హీనమైన స్థితికి దిగజారిపోయిందో ప్రస్ఫుటమౌతుంది. ‘విశ్వంలో గొప్ప గురువు తల్లి’ అన్న రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలను ‘అమ్మ ఒడి బిడ్డకు మొదటి బడి’ అన్న సూక్తినిబట్టి నైతిక విలువలను ఉగ్గుపాలతో రంగరించిపోయాల్సిన బాధ్యత మాతృమూర్తులేనని నొక్కి వక్కాణించబడింది. తల్లి తర్వాత ఆ బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందనేది కాదవలేని సత్యం. ఇంట్లో సోదరులుగానీ, మరెవరైనాగాని తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పిన విషయాన్ని కాస్త మార్పు చేసి చెప్పినా అది వినడానికి పిల్లలు ఇష్టపడరు. ఆ పసి మనుసులు అందుకు ససేమిరా అంటాయి. అంతటి గౌరవ్రపదమైన వృత్తి అది.
రగులుతున్న రావణకాష్టంలా ఈ దురాగతాలు పునరావృతం కావడానికి కారణాలు అన్వేషిస్తే సత్వర శిక్షలు అమలు జరగకపోవడం అనేది అందరినోట వినిపిస్తున్న మాట. అంతరిక్షంలో, సముద్ర గర్భంలో, భూమిపైన ఇన్ని రకాలుగా మన శక్తి సామర్థ్యాలను ఋజువు చేసుకోగలిగినపుడు ప్రతిభాపాటవాలను నిరూపించుకోగలిగినప్పుడు ఈ చీడపీడలను వదిలించుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నాము.
ఇందుగల దండు లేడను సందేహంబు వలదు’ అని అన్ని రంగాలలో లబ్ద ప్రతిష్ఠులు, మేధావులు పుష్కలంగా ఉన్న మనకు ఈ సమస్యను పరిష్కరించుకోవడం అంత కష్టమైన విషయం కాదనేది వాస్తవం. లేకపోతే విచారణ పేరుతో కాలయాపన జరుగుతూ ఉంటే, శిక్షలను అవహేళన చేస్తూ, తేలికగా తీసుకుంటూ ఈ మృగాలు పెట్రేగి పోతూనే ఉంటాయి. రక్తబీజులు పుడుతూనే ఉంటారు.
మన ముంగిట విరిసిన సుమాబాలలు ఆ సరస్వతీదేవి పాదాల చెంత సుగాలు వెదజల్లాలి. వీరంతా ఆ తల్లిచేతిలోని ‘రచ్చషి’ తంత్రీవాదాలై రవళించాలి. భవిష్యద్భాండాగారాన్ని కాపాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది అనేకంటే అత్యవసరమైంది అనడం సబబుగా ఉంటుంది.