
పత్ర,ఫల, పుష్ప, తోయములకే
సంతసించి వరములిచ్చు
బొజ్జ గణపయ్య మట్టి విగ్రహమును పూజించిన చాలును
బలవంతపు చందాల నీలాపనిందలేల?!
రసాయనాలతో రూపొందించిన భారీ విగ్రహాలేల?!
జాతీయ సమైక్యతను
చాటుటకు సాధనమైన పర్వదినమునకు
ఆడంబరాలు, హంగులతో
పని ఏల?!
ఏ ఆకారమునైననూ ఒదిగి
విఘ్నములను తొలగించి
విద్యా బుద్ధి, జ్ఞాన సిద్ధు ల
ప్రసాదించే వినాయకునకు
విద్యుద్దీప తోరణాల తళుకులేల?!
వినికిడికి చేటు కలిగించే
వాయిద్యఘోష ఏల?!
పుడమి కాలుష్యమును హరించుటకు…
హరితహారమే ఔషధమని చాటుతూ
వినాయక చవితి నాడు చేయు
ఔషధయుక్తమైన ఇరవైయ్యొక్క రకముల పత్రిపూజ తెలుపునది
తరువుల రక్షణ ప్రాముఖ్యతనే!
విగ్రహ నిమజ్జనము చేయునది
నదులు,చెరువుల పరిరక్షణ కొరకే!
పండుగలోని పరమార్థము తెలుసుకుందాము
ఆచరించి భూగోళమును కాపాడుకొందాము!