లే లే అదిగో మంచు తెర తొలగించ భానుడు లేలేత కిరాణాలు ప్రసాదిస్తన్నాడుగా,
నీ ముసుగు తెర తీయలేవా.
నీ తలంపుల తరి నాకు నిద్ర లేని నిశిధి మిగల్చింది మరి,
నీ ప్రసన్న వదనం పదే పదే తదేకంగా చూడాలని,
నీ మురిపించే మాటలతో నను మరిచి పోయేలా…
* * *
మలయమారుతం నీ ముంగురులను సుతారంగా తాకుతుంటే,
కరిమబ్బు అనుకొని సూరీడు వెలుగు జిలుగులు నిను వెతుకుతుంటే,
నీ మబ్బు నిద్రని వదలనంటే ఏల?
నీ కనులలో జాము రాతిరి కన్న కలలు,
నాతో పంచుకోగ రావా ప్రియ నేస్తమా,
మన స్నేహ గంధపు పరిమళాలను,
పూచెటి పూలకు అద్దుదాం,
అందుకే లేచి రా మిత్రమా,
సకల శుభాల శుభోదయం అందుకో….నేస్తం