నీ కోసం రానని – నా బాల్యం అలిగింది

గంగ్వార్ కవిత కులకర్ణి

నా బాల్యం నన్ను ప్రశ్నిస్తుంది…
గడిచిన కాలం తిరిగి రాదని…
గడుస్తున్నా కాలం నీ యవ్వనమని…
సంతోషంగా,కష్ట సుఖాలను…
పాలు నీళ్ళలా స్వీకరించమని…
ఎప్పుడు చేయవలసిన పనులను…
అప్పుడే చేయమని…
కాలముతో సంతోషంగా ఉంటావని‌…
నేడు నీ భవిష్యత్తుది…
నాడు నీది, నిన్న నాదని…
సమయం మనకోసం వేచి ఉండదని…
నీ బాల్యం గడిచిపోయింది…
అందుకే ఇక నేను రానని …
క్షణం ఒక యుగం…
అది ఎంతో విలువైనది …
దాని కోసం నువ్వు పరుగెత్తాలి…
కాని………….
కాలం నీతో పరుగెత్తదు…
వాయిదా వేస్తే ఒకసారిగా కాలం….
వెనక్కి తిరిగి చూస్తే నీ కోసం రానని…
బాల్యం స్వేచ్ఛ జీవనం…
బాల్యం తిరిగి రానిది…
కుటుంబము లో అమ్మ నాన్న…
అక్కాచెల్లెళ్ళు తమ్ముడు…
ఆటలతో ,నవ్వు లతో,కేరింతలతో…,
అలగటాలు ,చిలిపి పనులు….
చెట్టు,చేమ ,వాగు వంకలు….
స్నేహితులతో ఎంతటి ఆనంద జీవితం…
ఆనాటి పాఠశాల జీవితం….
సరదా సరదాగ సాగిన నీ జీవితం…
చదువులకై పరుగులు…
ఉద్యోగానికి నానా ప్రయత్నాలు…
ఇవన్ని గడిచి పోయినా తీపి జ్ఞాపకాలు…
అందుకే యవ్వనంలో ఉన్న…
నీ కోసం నేను రానని….
నీ కంటు ఒక కుటుంబం….
బాధ్యత ,సుఖసంతోషాలున్నాయి….
వాటితో కాలయాపన చేయి ఆనందంగా…
అప్పుడప్పుడు నన్ను గుర్తు చేసుకో…
జ్ఞాపకంగా నీ గుండెలో ఉంటాను…
కాని సంతోషం ఒకసారిగా…
ఒకసారి నీవు రమ్మన్నా రాలేని కాలం…
అందుకనే నీకోసం రానని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

డా. అంజలీదేవి

ప్రేమికుల రోజు