నా కనుపాపల ఊయాలలో
చిరు, చిరు నవ్వుల
పాపడివై,
నిదురింపుమురా
హాయిగా.
పాడెద జోల ప్రశాంతి
నిలయా!
నా ఎద మెత్తని
పానుపు చేసెద.
శేష శయన ఇక
శయనింపుమురా!
హాయిని గొలిపే
నీ మురళి రవళులే
జావళులై ,ఘన
కీర్తనలై జోలపాటలుగా
మార్చేదరా!నిను మురిపించెదరా కృష్ణయ్యా!
రాముడవని నిను
రమ్యముగా,
శ్యాముడవని బహు
లలితముగా,
లాలలుపోసి, జోలలు
పాడెద
నిద్దురపోరా!నాముద్దుల మూట
ముల్లోకాలను
మురిపించే ముక్తి మార్గము చూపించే
నిన్ను తల్లులందరూ
తమ బిడ్డలను నీ రూపముగా. భావించి
జో అచ్యుతానంద
జో జో ముకుందా!
లాలి పరమానంద
రామ గోవిందా! అనుచు పాడి మురిసె పోయేదరు
పారవస్యమున.
పాలింపరా తండ్రి
వారి పాపడవై
పక పకా .పూలవానవలె నవ్వుమురా!
అమృతపు జల్లు వలె
మా మది ఝల్లుమన.