
అందాల సిరుమల్లె …
అల్లుతుంది చక్కని బంధాల ముల్లె…
చెరగని స్వచ్ఛమైన ప్రేమల్లే…
కల్మషం లేని మనసులు..
పంచుకుంటాము అందరి కష్టాసుఖాలు…
ఇరుగు పొరుగు మమకారాల పుల్లకూర …
ఉండదు మామధ్య ఎలాంటి కలహచెర…
కష్టాన్ని తీర్చేది…
కన్నీళ్లను తుడిచేది…ఇ
బాధని పంచుకునేది…
ఆపదలో ఆడుకునేది…
భరోస్సానదించేది….!!
కనులకు విందైన ప్రకృతి అందాలు…
చెవులకు సొంపైన పక్షుల కిలకిల రావాలు…
పొదలు…గట్లు…చెట్లు..పుట్టలు..గుట్టలు…
ఆహ్లాదకరమై అద్భుత వనాలు…
మైమరిపించే కోయిల మధుర గానాలు…
ఎటు చూసినా ప్రకృతమ్మ ఆహ్వానిస్తున్నట్లు…
స్వాగతం పలికే పచ్చని చెట్లు…
సమీపాన గ్రామదేవతల ఆలయాలు…
మనసు ప్రశాంతతకు చక్కని నిలయాలు…
పండగలు జరుపుకోవటం లో ప్రత్యేకం…
ప్రతీ పబ్బంలో చూస్తాము ప్రాముఖ్యం…
అందరూ కలిసి ఆడబిడ్డలతో…
బతుకమ్మను పేరుస్తారు తీరొక్క పూలతో…
గౌరమ్మను కొలుస్తారు భక్తిశ్రద్ధలతో…
ప్రతీ ఏటా జరిగే జాతర మహోత్సవం…
ఉత్సుకతతో నిర్వహిస్తారు ఆ ఉత్సవం..
అంగరంగ వైభవంగా కొలుస్తారు భక్తజనం…
అంబరాన్నంటిన వేడుకకు అదే నిదర్శనం…
బంగారు పట్టునేతకు ప్రతీక మా ఊరు…
కనులకు ఇంపుకా వస్త్రాలను నేస్తారు…
మనిషికీ మనిషికీ అడ్డుగోడల్ని కట్టే టెక్నాలాజీ కాలంలో…
టెక్నాలాజీ ఎలా వాడాలో చేస్తాము పల్లెలో…
సాయంకాలం అరుగుల మీద ముచ్చట్లు..
తెలుపవు ఇలాంటి విషయాలు ఎలాంటి వార్తలు…
ఎన్నో ఆచారాలకు మూలం మా పల్లె…
సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లే…
వావి వరుసలకు సొంత ఇల్లు..
మమతానురాగాల బంధాల హరివిల్లు…
మతపిశాచికి ఉండవు ఇక్కడ నెలవులు…
సహాయం చేయటానికి ముందుంటారు ఆప్తులు…
ఉంటాయా…??! వీళ్ళకంటే విలువైన ఆస్తులు…!!
ఒడిదుడుకుల్లేని జీవితం..
ప్రతీ నిమిషం సంతోషం…
ప్రతీ వాకిలి ఆనందమయం…
“పల్లెలె దేశానికి పట్టుకొమ్మలు” అనటంలో లేదు అతిశయం..