నాకు కావాలిసింది ఇది కాదు.

ఉమాదేవి ఇల్లందుల

“నాకు ఆ అబ్బాయి నచ్చలేదు.నాకీ సంబంధం ఇష్టం
లేదు.” అన్నది హిమజ.
ఆరోజు ఉదయమే జరిగిన పెళ్ళిచూపుల గురించి
మాట్లాడుకుంటున్న హిమజ తల్లి భారతి‌, తంఅడ్రి రామారావు, పెదనాన్న హనుమంతరావుల తలలపై
బాంబు పేలినట్టు ఉలిక్కిపడ్డారు ముగ్గురూ ఆమె
మాటలకు.
“అదేంటీ? ఆ అబ్బాయికి నువ్వు నచ్చావని అప్పటికప్పుడు పెళ్ళి చూపులలోనే చెప్పడంతో,
దాదాపు పెళ్ళి కుదిరినట్టే అని సంబరపడుతుంటే ,ఈ పైత్యపుమాటలేంటీ?” కోపంగా అన్నది భారతి.
“నువ్వుండమ్మా!,నే మాట్లాడతాగా!అని మరదలితో
అని,”ఏమయింది హిమాతల్లీ! అబ్బాయి చూడడానికి బాగున్నాడు. మంచి ఉద్యోగం,మంచి
కుటుంబం…నిన్ను మెచ్చాడు.మరి ఏంటి నీ అభ్యంతరం?”అనునయంగా అడిగాడు హనుమంతరావు.
“నీ మనసులో ఏముందో క్లియర్ గా చెప్పు తల్లీ!”
ప్రేమగా అన్నాడు రామారావు.
“చెప్తాను కానీ విన్నాక మీరెవరూ నన్ను ఈ పెళ్ళి చేసుకొమ్మమని.ఫోర్స్ చేయకూడదు.” అని చెప్పసాగింది హిమజ మొత్తం తమ మధ్య జరిగిన
సంభాషణని.
** *** *** ***
“చూడు హిమజా!నువ్వు నాకు బాగా నచ్చావు.ఆల్
మోస్ట్ మనపెళ్ళి ఫిక్స్ అయినట్టే. నేనెంత హ్యాండ్సమ్
గా ఉన్నానో చూస్తునే ఉన్నావు. నా సాలరీ రెండు లక్షలు నెలకి.ఇప్పుడంటే నెలకి ముప్పై వేలు మా ఇంట్లో ఇస్తున్నాను. మన పెళ్ళయాక ఇవ్వక్కర్లేదు.
ఎందుకంటే నేను పెళ్ళయాక నాభార్య,నేను ఉండడానికి ఒక మంచి గేటెడ్ కమ్యునిటీలో ఫ్లాట్
బుక్ చేసాను.ఇప్పటిదాకా మా ఇంట్లో ఎవరికీ ఈ
విషయం తెలియదు.చెప్తే, వేరేగా వెళ్తారా అని రాద్ధాంతం చేస్తారు. పెళ్ళయాక కూడా ఇంకా వేరే
బాధ్యతలు మనకుండకూడదు.”అన్నాడు పెళ్ళిచూపులకొచ్చిన అనిరుధ్.
“మరి మీ చెల్లి ఎడ్యుకేషన్, పెళ్ళి ఆ బాధ్యత ఎవరిది?” అడిగింది హిమజ.
“అదంతా మా అమ్మానాన్నవాళ్ళు చూసుకుంటారు.
తన పెళ్ళికి కావాలంటేలక్షో,రెండు లక్షలో సాయం
చేస్తానంతే. ఇంకో విషయం. నువ్వు ఉద్యోగం కూడా
చేయనక్కర్లేదు.” అన్నాడు అనిరుధ్.
“ఎందుకని?నేనిప్పుడు మంచి జాబ్ లోనే ఉన్నాను కదా!”అన్నది హిమజ కొంచెం అసహనంగా.
“ఆఫీసులో మగ వెధవలందరూ నిన్ను రాసుకొని,
పూసుకొని తిరగడం పెళ్ళయాక నాకీష్టం లేదు.బీ
ఆస్ ఎ గుడ్ హౌస్ వైఫ్.దట్సాల్.”ధృఢంగా చెప్పాడు
అనిరుధ్.
“మీ ఆఫిస్ లో అమ్మాయిలు లేరా?వాళ్ళతో మీరు
అలాగే ఉంటారా?” చిరాగ్గా అడిగింది హిమజ.
“అందరు నాలాగే మంచి వాళ్ళుండరు కదా! అయినా
ఆ అమ్మాయిల ఓవరాక్షన్ లు నాకు నచ్చవంతే.”
అన్నాడు అనిరుధ్.
“నేను చెప్పిదంతా విన్నాక ఐ థింక్ యూ ఫీల్ యువర్ సెల్ఫ్ లైక్ ఎ లక్కీ గర్ల్ కదా!” అన్నాడు అనిరుద్ నవ్వుతూ.
** *** ****
” ఆ అబ్బాయికి తల్లిదండ్రులంటే గౌరవం లేదు.ప్రేమ
లేదు. అభిమానమసలే లేనట్టు మాట్లాడుతున్నాడు.
కుటుంబ విలువలసలే తెలియవు. బాధ్యతలు వద్దు
తోడబుట్టిన చెల్లి అంటే కూడా ప్రేమ లేదు.తాను,తన
భార్యాపిల్లలంతే…..ఉత్త స్వార్థపరుడిలా ఉన్నాడు.
ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళంటే చులకన భావం.
స్త్రీ లంటే గౌరవభావం లేదు.అసలు నాఅభిప్రాయం
తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు.గమనించండి
తను ఒక్కడే మంచివాడననే అహం అంతే.ఇప్పుడు చెప్పండి. ఇతనినా నాకు తగిన వాడంటున్నారు .
ఇలాంటి వ్యక్తిని పెళ్ళి చేసుకొమ్మంటారా?” ఆవేశంగా
అడిగింది హిమజ.
“నిన్ను బాగా చూసుకుంటానంటున్నాడు కదే.” అన్నది భారతి.
“ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావమ్మా?రేపు
తమ్ముడిలాచేస్తే, నువ్వు సంతోషిస్తావా? చెప్పు.
అయినా తన వాళ్ళపట్ల ఇంత స్వార్థపరుడిలా ఉన్న
వాడు నన్ను మాత్రం మనస్ఫూర్తిగా ప్రేమమిస్తాడని
ఎలా అనుకుంటాం?తన వాళ్ళనే ప్రేమించలేని వాడు
ఎవ్వరినీ ప్రేమించలేడనేది నా అభిప్రాయం .అయినా పెళ్ళనేది నా ఆలోచనలకూ, నాఅభిప్రాయాలకు
సంబంధించింది.నేనిలాంటి సంకుచిత భావాలున్న
వ్యక్తితో సంతోషంగా ఉండలేను.నాకు కావలసింది ఇది కాదు.నన్నర్థం చేసుకొండి.ప్లీజ్.!”ఎంతో భావోద్వే
గంతో అన్నది హిమజ.
కాస్సేపు అంతా నిశ్శబ్ధంగా ఉన్నారందరూ.
“నీ ఇష్టం తల్లీ!.నీఇష్ట ప్రకారమే చేద్దాం” అన్నాడు
హిమజ పెద్దనాన హనుమంతరావు.
అలాగే అన్నట్టుగా తల పంకించారు.హిమజ అమ్మా
నాన్న.

Written by Illandula Umadevi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తరుణి చిత్రం

కట్నాల కొలిమిలో…