
కష్టించి పనిచేసి కడుపునింపునురైతు
పరులకొరకు తాను పస్తులుండు
కనురెప్పగజవాను కాపాడు దేశాన్ని
శతృమూకల ద్రుంచు శరము తానె
జైజవా ననుచును జనులెల్లపొగడగా
జాతికంకిత మగు చరిత నీదె
జైకిసాననుచును జగమేను కీర్తించ
ధాత్రినాకలితీర్చు ధన్య జీవి
ఆటవెలది:-
అన్నదాత యెపుడు ఆకలిన్ తీర్చగా
దేశభక్తి పెంచు తేజమొకరు
నిలను వెలుగు నింపు నిరువురు ధన్యులై
భరత భూమి గన్న భాగ్యమిదియె