
జీవితం చాలా విచిత్రమైనది మమకారాలు అనుబంధాలు అన్ని మాటలే కొత్త కొత్త భావాలతో కొంగ్రొత్త ఆశలతో ఇరికిస్తారు మనసుని ఇనప సంకెళ్ళతో.. ఈభావనలోఉన్నసుగుణమ్మకు అనుకోకుండా ఫోన్ వచ్చింది
” హలో” అంది.
“హలో”.”అన్నాడు అవతల వ్యక్తి…
” ఎవరు బాబు నేను సుగుణమ్మని” అంది.
“నేను రాజు అమ్మా “అన్నాడు.
” ఆహా అయితే ఏం కావాలి నాన్న”!
” ఏమీ లేదమ్మా మీ పేరు చూస్తేనే అమ్మ” “అని పిలవాలనిపించింది అందుకమ్మనన్ను తప్పుగా అనుకోవద్దు”!
“దానికేమి లే నాన్న, అమ్మ అని పిలిపించుకోవడం, ఓ గొప్ప అదృష్టం నువ్వు ఆత్మీయతో అమ్మ అంటే ఎంత ఆనందంగా ఉంటుంది”!
“అమ్మ నా పేరు రాజు నేను అనాధని అమ్మ, అందుకే ఇలా అడిగాను”
సరే నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు”?
“నేనుఅనాధాశ్రమం నుండిచిన్నచిన్నపనులుచేసుకుంటూ మెల్లిగా మెల్లిగా బీటెక్ పూర్తి చేశానుఇప్పుడుఇంజనీర్ గా పనిచేస్తున్నాను”.
“ఓహో అలాగా సరేలే బాబు” “నీకుఆఫీస్కిటైంఅవుతుందేమో చూసుకో.”అలాగే లేమ్మా నేను తయారవుతాను”..
****
******
యధాతధంగా వారిరువరి బాంధవ్యం పెరుగుతోంది
ఒకరోజు రాజు ఫోన్ లో
“అమ్మా, అమ్మా, మీకు పిల్లలు లేరా”?
“లేరేమీటి నాన్నా”! ఉన్నారు.ఇద్దరు,ఒక మగ పిల్లాడు నీ లాగే ఇంజనీర్,మే మే, పెళ్ళి చేశాం.హాయిగా
అమెరికా వెళ్లిపోయాడు.ఇంక కూతురంటావా మాకన్నా ఉన్నతుల ఇంట ఇచ్చాం, అంతే అదే…
మా పాలిట శాపమై పోయింది.మా ఇంటికి రావడమే మానేసింది… వున్నారు అని చెప్పుకోడానికి.
నేను నీలాగే అనాధనే నాన్నా.కానీ నువ్వు ఇప్పుడు
వున్నావు కదా! దేముడిచ్చిన బిడ్డవి…
,”అమ్మా!బాధ పడకు నేనే మీ బిడ్డని, మీరు బాధపడడం దేనికి”!
“వద్దు నాన్నా ఆ బంధం”,.నేను నా బిడ్డలు వదిలి పోతే, పూర్వజన్మ ఋణం అంతే !అని సర్దుకున్నా”తృప్తిపడుతున్నా”.అలాంటి బంధం మనకి వద్దు…
మళ్ళీ నష్టపోలేను.నన్ను అమ్మ కాని అమ్మగా నేవుండనీ తండ్రీ”
“అమ్మా!అంత మాట అనకమ్మా, అనాధాశ్రమం లోప్రేమ,అభిమానాలకి
ముఖం వాచి వచ్చిన వాడినమ్మ, నీలాంటి అమ్మ దొరకడం నాకెంత సంతోషము, నీకెలా తెలుపనమ్మా, ప్లీజ్”…
“సరే అయితే నేను చెప్పినట్టు చెయ్” రోజు పొద్దుటే లేచి స్నానం చేసి పూజ చెయ్ సరేనా,”
“అలాగే అమ్మ నువ్వెలాగు చెప్తే అలా”
“సరే నిన్ను నేను రామన్న అని పిలుస్తాను”‘
” మరి నీ ఇష్టం నీ దగ్గరికి రావాలని నిన్ను చూడాలని ఉంది రానా”‘
“నేను అడ్రస్ చెప్తా, పున్నమ్మ తోటలో ఉన్నాను ఒక ఫ్లాట్లో ఉన్నాను సొంతమేలే అడ్రస్ చెప్తా రా”!
“మా వారు పిల్లలు చేసిన పని తట్టుకోలేక పారిపోయాడయ్యా దేముడి దగ్గరకు నన్ను వదిలి అందుకే ఈ వంటరితనం”! కానీ నాకు అన్యాయం చేయలేదు ఆయన లెక్చరర్ గా పని చేసారు.కావాలసినంత ధనం వుంది. సరే రేపు రా నీకు ఇష్టమైన వన్నీ వండి పెడతా”!
“రేపు నాకు శలవమ్మా అంచేత త్వరగా వస్తా”!
” అలాగే నాన్నా”!
,*****
మరి చటి రోజు రానే వచ్చింది ఎంతో సంతోషంగా ఆనందంగా గడిపారు భగవంతుడు కలిపిన బంధం బంధింపబడ్డా అమ్మ కొడుకులు….
ఉన్నట్టుండి ఇద్దరు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారుకారుతున్నకన్నీరు చూసుకునీ పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నారు…..
ముందుతేరుకున్న సుగుణమ్మ నాన్నా, ఇన్నాళ్ళు దాచుకున్న బరువు దిగి పోయింది కన్నీటి
రూపంలోనీకుఅంతేనా ,అవునమ్మా, చాలా ఆనందంగా
అలాగే రెండు సంవత్సరాలు .
,****
” రామూ ఫోన్ చేసేడు”
సమాధానం లేదు మనసులో “అమ్మ,’అమ్మ”పిలుస్తున్నట్టుంది ప్రయత్నించి ప్రయత్నించి అమ్మ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ సుగుణమ్మ తలుపు ఓర
వాకిలి గా వేసి సోఫా మీద పడుకొని ఉంది దగ్గరికి వెళ్లి అమ్మా అన్నాడు ఆమె పరిస్థితి చూసి కన్నీళ్లుధారాపాతంగా కారుతున్నాయి అమ్మా….అన్నాడు
బల్లమీద పేపరులో ఏదో రాసి పెట్టింది
చదవమని సైగ చేసింది చదివాడు ఇది ఆమే
మరణం వాజ్మూలం. తాను చనిపోయాక తనకర్మ కాండలన్నీ రామూ చూడాలని,తన బాంక్ లో
ధనమంతా రాముడికే చెందాలని, తన ఇష్టపూర్వకంగా
రాస్తున్నానని సంతకం చేసింది.
ఇంకా రాసింది నా పిల్లలు ఒంటరిని చేసేసారు
గానీ నువ్వు భగవంతుడిచ్చిన బిడ్డగా నా కోరికతీర్చు అని అమ్మ గాని అమ్మ అని సంతకంచేసింది….సుగుణమ్మ.