వేణువేల వినిపింతువు కమ్మగాను కన్నయ్యా
వేలపేర్ల పిలిచేముర వింతగాను కన్నయ్యా
మాధవయని మధురముగా తలవగనే పలికేవులె
చింతలన్ని మరపింతువు చక్కగాను కన్నయ్యా
నళినాక్షా నీవేరక్ష చిరునవ్వుల మత్తు తోను
మోహమేల పెంచేవుర మాయగాను కన్నయ్యా
యదునందన అందముగా రాసలీల ఆడినావు
అలసితివా నిదురించర పాపగాను కన్నయ్యా
గోపాలా గోపికలే నీకొరకే వేచినారు
రాధకొరకు వచ్చితివా ప్రేమగాను కన్నయ్యా
బృందావన మధుసూధన నీలీలలు అపురూపము
చంద్రునిలా కరుణచూపు చల్లగాను కన్నయ్యా
