మహిళలు మహారాణులు
మహానగరాలు మెరిసేలా
మన ఊర్లన్నీ మురిసేలా
మహిళలు మహామహులు
సుజన పరిజన సన్నిహితులు
సరిలేని గరిమగల విదుషీమణులు
సారమెరిగిన జీవన స్రవంతులు
సకలకళా పారంగతులు
తారతమ్యాలెరిగి బ్రతుకు సవరించి
తక్షణ కర్తవ్యాల చర్యతామగుతారు
తరగని సిరుల రమణీమణులు
‘తరుణి’అరుణిమ చెప్పగతరమా!!
అవును!! ‘తరుణి’ అంతర్జాల వేదికను ఒక పత్రికలా తీసుకొస్తున్న ఉద్దేశ్యం ముఖ్యంగా పై గేయంలోని అంతర్భాగం, అంతర్భావం అందరికీ తెలియాలనే! On Women, By Woman 3 tag line ముందుకు తీసుకొస్తున్నాం.
విద్య, వైజ్ఞానిక, సారస్వత వ్యాపార, సేవారంగాలన్నింటిలో ఆడవాళ్ళు ఎంతో ముందంజలో ఉన్నారు. సకల కళామతల్లులు,
అందుకే ప్రపంచ వ్యాప్తంగా రాయగలిగే స్త్రీలకు వారి వారి అభిప్రాయాలను పంచుకునే అవకాశాన్ని కల్పించాలన్న సదుద్దేశంతో మా ‘తరుణి’ మీ ముందుకు వస్తున్నది.
సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, శిల్పం, నాట్యం – లలిత కళలు అనే ఈ కళల్లో ప్రావీణ్యమో, ప్రవేశమో ఉన్నవాళ్ళను వారి వారి అనుభవాలను రాసి పంపించాలి అని కోరుతున్నాం. ఇది తెలుగు పత్రిక. భారతదేశంలోని తెలుగుమఙిళలంతా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు మహిళలంతా తెలుగులో కవితలో, కథలో, వ్యాసాలో రాస్తారు. కాని వేరే భాషల స్త్రీలు కళలలోనూ, ఇతర అనేక సేవారంగాలలోనూ ఉంటారు కాబట్టి, వారు ఇంగ్లీషులో రాసి పంపిస్తే, ఆ ఆర్టికల్స్ లోన ఉన్న భావాన్ని క్లుప్తంగా తెలుగులో రాసి పెట్టాలని అనుకుంటున్నాము. ఇలా అనుకని ప్రారంభించిన మా ఆశయం ఏమంటే పిల్లల పెంపకంలో పడుతున్న ఇబ్బందులు, చేయవల్సిన పనులు, తీర్చిదిద్దేందుకు తగిన సలహాలు వంటివి రాసి పంపవచ్చు. ప్రతి తల్లి ఒక టీచర్, ప్రతిి టీచర్ ఒక మార్గదర్శి. అందుకే పిల్లలకు అర్థం చేయిస్తున్నామని తెలియకుండా నేర్పించే ఉపాయాలేైనా ఉంటే ఏదో ఒక కొత్త తరహాలో చిన్న చిన్న ఆర్టికల్ గా రాసి పంపవచ్చు. అలాగే పంట చేయడం ఒక కళ. ఏవైనా మంచి తినుబండారాలు గాని, స్పెషల్ ఐటమ్స్ గాని చేసే పద్ధతులు రాసి పంపవచ్చు. ఇంటి అలంకరణ, ఆర్థిక స్వావలంబనా చాతుర్యమూ, ఉద్యోగంలో మెళకువలు ఇలా సమాజానికి ఉపయోగపడే విషయాలపై దృష్టి పెట్టి రాసే చక్కని రచనలకు ‘తరుణి’ ఒక వేదిక అవుతుంది.
మరి ఇంకేం? మీ కలాలు సంధించండి! సాహిత్య అంశాలు రాసే వాళ్లే కాదు. ఇలాంటివి కూడా రాయవచ్చు. ఇవి రాయడానికి గొప్ప భాషా సాహిత్యాలు అవసరం లేదు. కావలసిందల్లా కాస్త కళాత్మకంగా చెప్తున్నట్టు రాస్తే సరి. మీ మీ ఆర్టికల్స్ కోసం ‘తరుణి’ సంపాదక వర్గం ఎదురు చూస్తూ ఉంటుంది. శుభాకాంక్షలతో ఆహ్వానాలను పలుకుతున్నాం. ఇదిగో ఈమెయిల్ ఐడికి మీ రచనలు, వాటికి తగిన చిత్రాలు, మీ వివరాలు, మీ ఫోటోతో సహా మాకు పంపండి.
tharuni.page@gmail.com
డా. కొండపల్లి నీహారిణి, తరుణి అంత్రజాల వారపత్రిక సంపాదకురాలు.