తక్కెడ ఒరిగింది

కథ స్నేహం
అంశం. రియల్ స్టోరీ
23 1 25.
నా సంఖ్య 139

మాది పల్లెటూరు.
ఓ ముప్పై ఏళ్ల క్రిందటి మాట మా పక్కింట్లో వృద్ధ దంపతులు ఉండేవాళ్లు. వాళ్లకు పిల్లలు లేరు. ఆ ఇంటి ఆయన పేరు రాఘవయ్య గారు.అందుకే ఆయన తమ్ముని కుమారుడిని సాక్కున్నాడు. తమ్ముడికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు.
అందుకే ఒక కొడుకును రాఘవయ్య గారు దత్త తీసుకున్నాడు. ఇంతమటుకు బాగానే ఉంది.
రాఘవయ్య దత్త తీసుకున్న పిల్లవాడి పేరు సుబ్బారావు.
సుబ్బారావు జల్సా
రాయుడు. సుబ్బారావు పెద్దక్క, అప్పట్లోనే కులాంతర వివాహం చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది.

అంతటితో ఆమెకు వీళ్ళకు సంబంధాలు తెగిపోయాయి.
సుబ్బారావు పెళ్లి కాకముందే ఒక అమ్మాయి తో సంబంధం పెట్టుకొని వాళ్ళ ఇంటికి పోతూ
తిరుగుతూ ఉండేవాడు. తర్వాత సుబ్బారావుకు పెళ్లి అయింది. అయినా కూడా సుబ్బారావు మొదటి అమ్మాయితో సంబంధం కొనసాగిస్తూ ఉండేవాడు. ఇంతలో సుబ్బారావుని పెంచుకున్న రాఘవయ్య గారు చనిపోయారు. ఆ వార్త తెలిసి సుబ్బారావు పెద్దక్క, (అంటే కురాంత వివాహం చేసుకున్నామే) రాఘవయ్య గారి ఇంటికి వచ్చింది. ఆమెకు పెదనాన్న కదా రాఘవయ్య గారు. ఆయన చనిపోయాడు కాబట్టి బాధతో వచ్చింది.

చనిపోయిన రాఘవయ్యకు దహన సంస్కారాలు సుబ్బారావుకదా చేయాలి. సుబ్బారావు ఇప్పుడు మొండికేశాడు.
“ఆమె అక్కడ ఉంటే నేను వచ్చి దహన
సంస్కారాలు చెయ్యను”, అని మోండి కేసాడు. ఊళ్లో వాళ్లంతా ఆయనకు ఎంతో నచ్చ చెప్పారు.
సుబ్బారావు వినలేదు. అప్పుడు సుబ్బారావు అక్కకి _నువ్వు వెళ్లమ్మ దహన సంస్కారాలు జరగాలి కదా ,”అని చెప్తే అప్పుడు ఆమె వాళ్ళందరితో ఇలా అన్నది “నేను కులాంతరవాహం చేసుకున్నానని నన్ను వెలివేశారు. మరి మా తమ్ముడు ఒకరిని ఉంచుకొని దానితో తిరుగుతూ మళ్లీ పెళ్లి చేసుకుని కూడా దానితోనే ఉంటే, అది తప్పు కదా? మగవాడికి ఒక తప్పు, ఆడవాళ్లకు ఒక తప్పు ఉంటాయా? అంటూ నిలదీసింది.
ఏం చెప్తారు పెద్దలు? పెద్ద మనుషులుగా చలామణి అయ్యే కొందరు మహానుభావులు కూడా ఏకపత్నీవ్రతు లు కారు కదా.
అందుకే ఆ ఊరి మునసపు (ఆయనో జల్సా రాయుడు)
ఆమెను బలాత్కారంగా బయటికి పంపించేసాడు.
నాకప్పుడనిపించింది మన దేశంలో రాముని నమ్ముకోని మగ భక్తుడు లేడు. మరి రాముడు పాటించిన ఏకపత్ని వ్రతం
ఎంత శాతం పురుషులు పాటిస్తున్నారో లెక్కలు తీస్తే బాగుండు అనిపించింది.
రామాలయాలు, రామ రామనామ జపాలు, ఎందుకు? మన కోర్కెలు తీర్చడానికి నా? అన్న ప్రశ్న నన్ను ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది.

Written by Dr. Vasundhara

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు భాగ్య…

 పారిస్ – సేన్ రివర్ నౌకా యాత్ర