అసలైన ధీరత సునిత
సిసలైన సాహస వనిత
అదరని బెదరని మనో నిబ్బరత
అవనికి నింగికి వెలుగయిన మెలత
అలుపెరుగని పరిశోధన సునిత
ఆకాశపు తారక మహిత
చిరునగవుల మేలిమి మమత
చిరజీవము శోధన ఘనత
మాటల చేతల మహిమాన్విత
మనసంతా నిండిన శాస్త్ర సాంకేతికత
కలల సాకారపు రూపము సునిత
కడలి అలయై ఎగసిన జ్ఞాన సుగీత
మహిళా ప్రగతికి సూచిక సునీత
ఓర్పు సహనాల నిండుదనమీ గగన విజేత
జయహో జయహో సునీతా విలియం
జయమన్నది జగతి ఒకటై చేసిన నినాదం.