చిగురించిన జీవితం

కథ

             కామేశ్వరి ఓగిరాల

ఆఫీస్ కు వేళ అవుతోంది ఒక్క ఆటో కూడా రావడం లేదు. తులసి కంగారు పడుతుంటే పక్కన్నే కారు ఆగింది.
” హలో అండి నేను సాగర్ . ఆఫీస్ కు వెళ్తున్నాను. మీరు ఏవైపు వెళ్ళాలి? ఇఫ్ యూ డోంట్ మైండ్ , రండి నేను దిగబెడ్తాను” అన్నాడు.
గత కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నది ఆ అబ్బాయి ను . కొత్త గా ఎదురింట్లో దిగారు.

“పర్లేదు నేను వెళ్తాను థాంక్యూ “అన్నది.
” నా కారు కూ కష్టం కాదు నాకూ కాదు. అంత మొహమాటం ఎందుకండీ ? ప్లీజ్… ” అన్నాడు
“సరే ” అనుకుంటూ వెళ్లి కార్లో కూచున్నది.
వెళ్తున్నంతసేపూ సాగర్ మాట్లాడుతూ నే ఉన్నాడు మాట్లాడిస్తూనే ఉన్నాడు. చదువు ఉద్యోగం చేసే కంపెనీ లాంటివన్నీ ఇద్దరు మాట్లాడుకున్నారు . తన ఆఫీసు కు కాస్త దగ్గరగా ఉన్న బస్ స్టాప్ దగ్గర దిగింది తులసి.
సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అమ్మ ఆత్రంగా ఎదురు చూస్తూ ఉండడం అలవాటు. ఆ రోజు ఎదురింటి ఆంటీ తో బయటకు వెళ్లిందని తెలిసి ‘ ఇన్నాళ్లకు అమ్మకో తోడు దొరికింది‘ అనుకున్నది.
ఆరోజు రాత్రి సరిగా నిద్రపట్టలేదు . ఆలోచన లు ముసురుకున్నాయి. తెల్లవారు జామున నే మెలకువ వచ్చింది. యధాలాపంగా ఎదురింటి వైపు చూసి తనలో తాను నవ్వుకున్నది.

అమ్మా! తులసి. తల్లి పిలుపుకు ఆఫీసుకు వెళుతున్న తులసి ఆగి వెనుకకు చూసింది.. ఏమిటన్నట్లు… నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించావు? ఏ విషయం? అదే నీకు మళ్ళీ పెళ్లి చేయాలనుకున్నాను గా
అమ్మ ఈరోజుల్లో మొదటి సంబంధం కుదరటమే కష్టంగా ఉంది. అలాంటిది విడాకులు తీసుకున్న నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఒకవేళ చేసుకున్నా ఇంతకు ముందులాగా దుర్మార్గుడు కాదని నమ్మకం ఏమిటి? విడాకులు తీసుకున్న ఆడది అంటే అందరికీ చులకనే” అనగానే “అది కాదు తులసి మొన్న రుక్మిణమ్మ గారు అదే మన ఎదురింట్లో కొత్తగా దిగారు కదా వాళ్లు. వాళ్ల అబ్బాయి సాగర్ ఈ ఊర్లోనే బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడట అబ్బాయి రోజు నిన్ను చూస్తున్నాడు నీవు నచ్చావుట . అంతకుముందు చూసిన సంబంధాలన్నీ వెనుకకు వెళ్ళిపోయాయి అనీ వాళ్ళ అబ్బాయి కి నచ్చలేదని చెప్పింది”
” ఏం ఎందుకుట?” కుతూహలంగా అడిగింది.
” పెళ్ళయ్యాక మీ అమ్మవాళ్ళు మనతోనే ఉంటారా? అని అడుగుతుంటే కోపం వచ్చి ఎవరినీ నచ్చలేదు అని చెప్పింది”
తులసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే,
“ఆమె నేను అన్ని విషయాలు మాట్లాడుకున్నాము.నీ గురించి కూడా అన్ని విషయాలు చెప్పాను . మొన్న గుళ్లో కనిపించి ఒకసారి నీ అభిప్రాయం కనుక్కోమని మరీ మరీ. అడిగింది ఒకసారి ఆలోచించమ్మా! ” అన్నది.
తులసి ఏం మాట్లాడకుండా కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ ఆఫీసుకు వెళ్ళిపోయింది.

ఆ రోజంతా అన్య మనస్కంగానే గడిపింది. సాయంత్రం కొంచెం ముందుగా బయలుదేరి పార్కులో ఒకపక్కగా కూర్చున్నది. కొంచెం దూరంలో చెట్టు కింద కూర్చొని ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటున్న కొత్తగా పెళ్లయిన వాళ్లని చూసింది. ఒక్కసారిగా ఆలోచనలో పడింది. తను చేసిన నేరం ఏమిటి? తను డిగ్రీ పరీక్షలు రాసి ఇంటికి రాగానే తండ్రి తనతో అమ్మ తులసి నీకు ఒక మంచి సంబంధం తీసుకువచ్చాను అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చాలా మంచివాడు. కట్న కానుకల విషయం నీవు ఆలోచించవద్దు నాకున్నది అంతా నీకే కదా నాన్న చెప్పుకుంటూ పోతున్నాడు నేను వద్దన్నా వినలేదు చివరకు ఆస్తిని అమ్మి గొప్ప సంబంధం అని పెళ్లి నిర్ణయించారు. నిశ్చితార్థం రోజున అబ్బాయి సకల గుణాభిరాముడు అంటే సరదా మనిషి అనుకున్నాను. రెండో రోజు నా పేరును బ్యాంక్ ఎకౌంటు మారుస్తుంది ఎంత ప్రేమ అని మా వాళ్ళందరూ సంబరపడిపోయారు. క్లబ్బులకు సభ్యులకు అన్నిచోట్లకు తీసుకు వెళ్తుంటే అమెరికా అబ్బాయి కదా అలాగే ఉంటారు అని అనుకున్నాను. పెళ్లి అయ్యి అత్తారింట్లో ఉన్నప్పుడే కొద్ది రోజుల లోనే అతని బండా రం బయటపడింది . ఒక్కరోజు కూడా ఉండలేక పుట్టింటికి తిరిగి వచ్చేసాను. మూడు నిద్ర లు కాకుండానే నా జీవితం ఇలా అయినందుకు తట్టుకోలేక నాన్న కు పక్షవాతం వచ్చింది. అందరికీ జాతకాలు చెప్పి ముహూర్తాలు పెట్టే మా నాన్న నా జాతకం విషయంలో ఇలా చేశారని అందరూ అంటూ ఉంటే తలెత్తుకోలేక కొంతకాలానికి కాలం చేశారు ఇప్పుడు నేను మా అమ్మ ఇద్దరినీ ఆస్తి లేదు నాన్న లేరు. ఇలా ఆలోచిస్తుండగానే “తులసి గారు ” అన్న పిలుపు విని ఎవరా అని చూశాను ఎదురింటి అబ్బాయి సాగర్. తులసి గారు నేను మిమ్మల్ని చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. మీ వ్యక్తిత్వం నాకు నచ్చింది . మా అమ్మగారు మీ అమ్మగారు అన్ని విషయాలు మాట్లాడుకున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను మీ మీద జాలితో కాదండి అభిమానంతో మీ అభిప్రాయం ఆలోచించి తెలియజేయండి తొందర లేదు. మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను బై అని అతను వెళ్ళిపోయాడు. చీకటి పడుతుండటంతో నేనుకూడా వెళ్ళిపోయాను. ఆ రాత్రంతా అతని గురించి ఆలోచిం. చాను. మర్నాడు ఆఫీస్ కు బయలుదేరుతుంటే అమ్మ గుమ్మం దగ్గర నిలబడి నేను ఏం చెప్తాను అని ఆత్రుతగా ఎదురు చూస్తుంది నేను మెల్లగా తల ఊపేసరికి ఆమె ఆనందానికి అవధులు లేవు మో డు వారిని నా జీవితం చిగురించి నందుకు.

Written by Kameshwari Ogirala

పేరు :కామేశ్వరి ఓగిరాల
ఊరు :భువనగిరి
ఇండియా
చదువు :ఎం ఎ తెలుగు
ఉద్యోగం :తెలుగు ఉపాధ్యాయురాలు (ప్రైవేట్ స్కూల్ )
చరవాణి 8008296355

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని

సీతా రాములు