
తెల తెల వారే వేకువొక
జీవనరాగ సుందర దృశ్యం
తూరుపు వేదికపై
కొత్త కిరణాల వెలుగులు
లేలేత ఊదారంగు నింగి
కొలను నీటి ప్రతిబింబాల
నీలి కొండల వరసలు
మేలుకొలుపు పిలుపుల
కుక్కుటం
కొక్కొరక్కో కంఠమెత్తుతూ
నేను లేపకుంటే లోకమేమైపోవునో అనే
సంశయం
సంధి కాలపు సంగతెరుగని
సమాజానికి
తానో బాధ్యత తీసుకున్న
పక్షి
ఎన్నో రంగులు తనవి చేసుకొని!
గుండె కిటికీ తెరవాలిక!
చిత్ర కవిత – డాక్టర్ కొండపల్లి నీహారిణి
తరుణి సంపాదకురాలు
శీర్షిక ప్రారంభం నుంచీ తరుణి చిత్రకవితలను చితరదృశ్య సమన్వయంగా పరిశీలిస్తూనే ఉన్నాను. వచనకవితాశిల్పం తెలిసిన కవయిత్రి డాక్టర్ కొండపల్లి నీహారిణి మేడమ్ గారు.
ఈ కవిత నిర్మాణంశిల్పం నాకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. నాదొక్కటే వాక్యం చెప్తాను… ప్రత్యక్షర సంపూర్ణసమన్వయ కవిత ఇది. మరొక్క వాక్యం + ముగింపు వాక్యం అద్భుతః.