గంజాయి మత్తులో జీవితాలు చిత్తు

అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే మధ్యతరగతి కుటుంబం జీవిస్తూ ఉండేది. అతనికి ఒక కొడుకు ఒక కూతురు అతడు వ్యవసాయదారుడు. వ్యవసాయ పనులు చేస్తూ మొదట్లో కుటుంబంతో హాయిగా జీవినం గడిపేవాడు. కానీ ఒకరోజు స్నేహితులతో బయటకు వెళ్ళాడు వారు అతనికి గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు చేశారు దాంతో రామయ్య గంజాయి కి అలవాటు పడ్డాడు. తండ్రిని చూసి చదువుకోవాల్సిన కొడుకు కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు. నాన్నను అన్నను చూసి చెల్లి చాలా బాధపడింది. తను వాళ్ళ నాన్నను అన్నను మార్చాలని అనుకొని బాగా చదివి ఏ కలెక్టర్ పోలీసో కావాలని అనుకుంది. వాళ్ళ అమ్మ కూలీకి వెళ్లి ఎండలో కష్టపడి కూతురిని చదివించింది. తను ఏమీ తినకుండా చాలా కష్టపడి వీళ్ళకు మాత్రం తిండి పెట్టేది. నాన్న కొడుకు ఇద్దరూ కలిసి మత్తుకు పూర్తిగా బానిస అయ్యారు. వాళ్ల చెల్లి మాత్రం తాను కలెక్టర్ అయ్యి వాళ్ల నాన్న లాంటి మత్తుకు బానిస అయిన ఎందరినో మార్చాలని నిర్ణయించుకుంది.

 అనుకున్నట్టుగానే బాగా కష్టపడి చదివి కలెక్టర్ అయింది. ఇలాంటి వాళ్ళ పరిస్థితిని వివరిస్తూ ప్రభుత్వానికి లేఖ రాసింది. అలాగే ఆలేఖను చుట్టుపక్క గ్రామాల్లోకి కూడా పంపించింది .అన్ని ఊర్లలో మత్తు పదార్థాల అమ్మకాలను నిషేధించడానికి ప్రభుత్వ అనుమతి తీసుకుంది. తాను అనుకున్నట్టుగానే వాళ్ళ నాన్న అన్న మత్తు పదార్థాలు సేవించడం మాని మేలుకొని ఎప్పటిలాగే వ్యవసాయం చేస్తూ హాయిగా బ్రతుకుతున్నారు.వాళ్ల చెల్లి అనుకున్నట్టుగానే అమ్మకాన్ని నిషేధించింది. నిషేధించడంతోపాటు వాళ్ళ నాన్న అన్న లాగా ఇతర గ్రామాలలో ఇలాంటి మత్తు పదార్థాలకు బానిస అయిన వారిలో మార్పు తెచ్చింది. వారు వారి పనులు చేసుకుంటూ సంతోషంగా ఆరోగ్యంగా జీవించేటట్లు చేసింది.

నీతి
మత్తు పదార్థాలు జీవితాలను చిత్తు చేస్తాయి.

Written by M Jhostna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అర్చన

మన మహిళామణులు – శ్రీమతి పల్లవి