
ఒక్కోసారి అనిపిస్తుంటుంది పొద్దుగడవకముందే అస్తమించాలని…
లెక్కలేని అవమాన డొంకలు హేళనల గుంతలతో నిండి
ఊహించని చులకనల మలుపులతో సాగే బతుకుతోవలో…
అలిసి సొలసి కాలపు అంచులదాకా సాగకుండానే ఆగిపోవాలని అనిపిస్తుంటుంది…
కానీ ఆ పక్కనే తనను ముక్కలు ముక్కలుగా కొట్టేసినా
తనకంటూ ఏరూపూ లేకుండా చేసినా …
మళ్ళీ చిగురించి నిస్వార్థంగా నీడను పంచాలనే తపనతో ఎదిగే తల్లిలాంటి తరువును చూసి
ధైర్యాన్ని కూడకట్టుకొని….
విజ్ఞాన వీచికలతో అక్షర పుప్పొడి రేణువులను అవనినంతా పంచనా కారణజన్మనెత్తినందుకు అనుకుంటూ…
ఉదయకిరణాలను ఆశలశ్వాసలో నింపుకొని సాగిపోతున్నా సాధికారతకు సాక్షిగా నిలవాలనే తపనతో.