ఈ రథం ముగ్గుకు సంబంధించి పురాణగాథలు చాలా ఉన్నాయి. రథం ముగ్గు ద్వారా మనిషి శరీరాన్ని రథంగా, దానిని నడిపేవారిని దైవమని భావిస్తారు. ఈ దేహమనే రథాన్ని సరైన దారిలో నడిపించమని దైవాన్ని ప్రార్థించడం ఈ ఆచారం వెనుక తాత్పర్యం. బలిచక్రవర్తి కథ ప్రకారం, అతనిని పాతాళంలోకి సాగనంపేందుకు రథం ముగ్గు వేస్తారని నమ్మకం. రథం ముగ్గు ఇంటి ముందు నుంచి ప్రారంభమై, వీధిలోని ఇళ్లను కలుపుతూ వేయడం వల్ల సమాజం మొత్తం కలిసికట్టుగా ఉండాలని సందేశం ఇస్తుంది. ఈ ఆచారం గ్రామీణ ప్రాంతాల్లో మనుగడ కొనసాగిస్తున్న సంక్రాంతి ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణ. కనుమకు సంబంధించిన ఈ సంప్రదాయాలు రైతుల జీవన విధానానికి అంకితం కాగా, పండుగ ఆనందాన్ని సమాజం మొత్తానికి పంచే ప్రయత్నం చేస్తాయి. ఈ అనుబంధాలు పల్లె జీవన శైలిని, గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించడమే కాకుండా, మనిషి ప్రకృతితో ఉన్న బంధాన్ని కూడా గుర్తు చేస్తాయి.
సమాజంలోని ప్రతి ఒక్కరూ ఒకరితో కలిసి ఉండాలని సందేశం ఇస్తుంది. రథం ముగ్గు వేయడం వల్ల శ్రేయస్సు, సుఖశాంతి, ఆయురారోగ్యాలు లభిస్తాయని నమ్మకం.
కొన్ని ప్రాంతాల్లో రథం ముగ్గు పూర్వికుల ఆత్మలను ప్రసన్నం చేసుకోవడానికి కూడా వేస్తారని నమ్మకం.
ఆధ్యాత్మికం ప్రకారం రథం ముగ్గును శ్రీకృష్ణుడి రథానికి ప్రతికగా భావిస్తారు.
ఇది శ్రీకృష్ణుని ఆహ్వానించి ఆయన ఆశీర్వాదాలను పొందాలని కోరిక సూచిస్తుంది అని నమ్మకం.
రథం ముగ్గు పైన సాంప్రదాయ విశ్వాసాల ఆధారంగా కొన్ని కథలు కూడా ఉన్నాయి.
రాజు తన కుమారుని కోల్పోతాడు తన కుమారుడిని బతికించాలని తన వారసత్వాన్ని తన వంశాన్ని ఆగిపోకుండా చూడాలని ఆ రాజు బ్రహ్మ దేవుని ప్రార్థిస్తాడు తన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై బియ్యపు పిండితో నేలపై తన కుమారుడిని గీయాలని చెబుతాడు. రాజు బ్రహ్మదేవుడు ఆజ్ఞ ప్రకారం చేయగా అతని కుమారుడు బతుకుతాడు.
దీంతో ఈ రథం ముగ్గు జీవితము, అదృష్టము శ్రేయస్సుకు,ప్రతికగా భావించి ఆనవాయితీగా వేస్తూ ఉంటారని పెద్దలు చెబుతుంటారు.
మరొక కథ ప్రకారం ముగ్గులు నక్షత్ర మండలాలకు ప్రతిరూపాలు అంతేకాదు పకృతిలోని జీవుల పట్ల భూత దయతో ఉండమని చెప్పడమే ముగ్గుల అంతరార్థం.
రథం ముగ్గు వేయడం వల్ల శ్రేయస్సు, సుఖశాంతి ఉంటాయని నమ్మకం.
