ఒద్దిక

కవిత

నా నుంచి దేన్నో తీసుకెళ్లి పోయారు
బహుశా నమ్మకం కావచ్చు..
ఇంకెప్పుడు ఎవరిపట్లా కుదరనంతగా
పెకిలించి వేయబడింది
నమ్మకమనే చిన్న వేరు కావచ్చు

దేవనపల్లి వీణావాణి

సంఖ్యలు కనబడడం లేదు…
దృష్టి దోషం కాదది
దిమ్మతిరిగిన తలలో తిరుగుతున్న భూమి
ఏటవాలు కళ్ళకింద నది ఊట

తెల్ల వారుతున్నపప్పుడో
పొద్దుమలుగుతున్నప్పుడో
రేకలు రేకలుగా విచ్చుకునే ఊహల చిత్తుప్రతి
చెత్త బుట్టలో ముడుచుకుపోవడం
మాటల కత్తెరలతోనే కదా
మీ ప్రపంచం చాలా చిన్నదని
తెలుసుకున్నాక
వాదించడం మనేసాను

పలక మీద తనను తాను అరగదీసుకున్న బలపంలా
నాకిచ్చిన గడువు తీరుతున్నది
తుడిపేసి రాసినప్పుడల్లా నేర్చుకున్నది
ఒద్దికగా నిలబడడమే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నుడిక్రీడ

మన మహిళా మణులు-