ఎప్పుడూ .. విమర్శే నా!

ఏంటో ఈ లోకం…
ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటుంది..

ఏం తక్కువైనా ఈ ప్రభుత్వం
మాకేమిచ్చింది అంటారు..
ఓటు వేసేటప్పుడే ఆలోచించాలి కదా !

ఉద్యోగాల్లేవు, ఎప్పుడూ
నిరుద్యోగ సమస్యే అంటారు..
స్వయం ఉపాధి తో పనులు
చేసుకోవచ్చు కదా !

అన్యాయాలు..అక్రమాలు అంటారు..
ఎదురు తిరిగి
నిలదీయవచ్చు కదా !

కల్తీ నిర్మాణాలతో
ఎందరి ప్రాణాలో తీస్తుంటారని విరుచుకు పడ్తుంటారు..
చట్టం ద్వారా ఖండించి
అవినీతిని నిర్మూలించవచ్చు కదా !

మహిళల పై అత్యాచారాలతో,
తమ జీవితాలను అంతం చేసుకోవలిసిందేనా అని వాపోతుంటారు..
ఇప్పటికయినా ఆత్మ రక్షణ విద్యలనలవర్చుకొని ఆదిశక్తి గా మారి దుర్మార్గులను అంతం చేయొచ్చు కదా!

తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు అంటూ..
ఎప్పుడూ..విమర్శేనా అంటూ
నిలదీసిన విమర్శ కూడా
ఈ లోకాన్ని విమర్శిస్తోంది కదూ…. !

Written by Madarapu vanisri

రచన: మాదారపు వాణిశ్రీ
హన్మకొండ
సెల్: 9247286668

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఉగాది

జయహో జయహో సునిత