ఎడారి కొలను

(పార్ట్-54)

 (ఇప్పటి వరకు: కాంతమ్మ గారు మూడేళ్ళ పా టు పంజాబ్ లోని జలంధర్ కి వెళ్ళటానికి ముందే మైత్రేయి కి చేయూత బాధ్యతలని అప్పగిస్తుంది. కాంతమ్మ గారి పర్యవేక్షణలో చాల విషయాలను తెలుసుకున్న తరువాత సంస్థ బాధ్యతలను చేపడుతుంది . మధ్యలో ప్రసాద్ కుడా విడాకులకు కోర్ట్ లో అప్పీల్ చేశాడని తెలుసుకుంటుంది. దానికి కారణం కూడా ప్రసాద్ ద్వారానే తెలుసుకుంటుంది.  అలా  కొద్దీ నెలలు గడిచాక చేయూత సంస్థలో ఉన్న జ్యోతికి ఒక పాప పుడుతుంది.) 

రెండేళ్లు   ఫామిలీ కోర్ట్ లో మైత్రేయి కేసు నడిచింది.  అందుకు ఆమెతో పని చేస్తున్న వారంతా మనస్పూర్తి గ సహకరించారు. సుబ్బారావు చాల ప్రయత్నాలు చేసాడు. లాయర్ వసుంధరని  కూడా బెదిరించాడు. అతని ప్రయత్నాలన్నీ విఫలమయినాయి.  ఆమె మేడలో ని మంగళ సూత్రం, కాళ్ళ కున్న మెట్టెలు తీసేసింది. అందుకే ఆమె పెళ్లి అయిందని చెప్పే  గుర్తులను తన శరీరంనుండే కాదు మనసునుండి కూడా తొలిగించేసింది . విడాకులు మంజూరయినాయన్న వార్త ఆమెపైన  పన్నీరు చిలకరించినట్లయింది.   కాలం  అలా పరుగులు తీసింది.  ఋతువులు గడిచిపోయాయి. గ్రీష్మ తాపానికి బీటలు వారిన పుడమి స్వాతి చినికులతో సేదతీరుతుంది. అది ప్రకృతి  ధర్మం. కానీ మానవ సామజిక ధర్మ అందుకు విరుద్ధంగా నడుస్తుంది.  

మైత్రేయి మాత్రం పూర్తిగా మనఃస్ఫూర్తిగా చేయూత సంస్థని అభివృద్ధి చేయాలన్న దీక్షలో మునిగి పోయింది. చేయూత లో జీవితాన్ని గడుపుతున్న స్త్రీ ల జీవిత గాధలను మనసుకి హత్తుకునేలా రాసి 

 ట్విట్టర్ లో ను . ఇంస్టాగ్రామ్ లోను ఫోటోలు పెడుతూ  విదేశాలలో ఉంటున్న ప్రవాస ఆంధ్రులనుండి ఆర్ధిక సాయం అర్ధించింది. అలా పెద్దక్క ఫండ్ కింద మంచి విరాళమే పోగయింది. ఆ డబ్బుతో వసంత కి జీతం పెంచింది. అలాగే ఆశ్రమంలో నిత్యం పరిశుభ్రత కోసం పనివాళ్లను పెట్టి ఆశ్రమ లో ఉంటున్న మహిళలకు విరామం కల్పించింది.  ఒక ఆమెను కూడా వంటకు  సాయం గా ఏర్పాటు చేసింది. గదులలో వసతులను మార్చేసి  ఇంకొంచం సుఖశాంతులు ఉండే విధంగా ఫ్యాన్లను , ఏసీ లను కూడా ఏర్పాటు చేసింది. అంతే కాకుండా రామకృష్ణ మిషన్ వారి సాయంతో  ప్రార్ధన హాలు ఏర్పాటు చేసింది. రోజు ఉదయం సాయంత్రం పెద్దవాళ్ళతోపాటు చిన్న వాళ్ళుకూడా కొద్దిసేపు ప్రార్ధన లో పాల్గొనాలని ఖచ్చితం గా చెప్పింది. 

ఒక ఏడాది గడిచిం తరువాత గుంటూరు కాలేజీ  కి ట్రాన్స్ఫర్ పెట్టుకొని తెనాలినుండి గుంటూరు లో ఒక అపార్ట్మెంట్ తీసుకొని  తన మకాం మార్చేసింది. కాంతమ్మ గారి ఇంటికి రమణి జానీ లను కేర్ టేకర్స్ గ  ఉంచి రాంబాయమ్మ గారిని తనతో పాటు తెచ్చుకుంది. అలాగే స్క్యూల్లో చేర్చాలని జ్యోతి పాప ఆశ ను తనతో తెచ్చు కొని రాంబాయమ్మగారి సంరక్షణలో ఉంచింది. జ్యోతి కి నచ్చచెప్పి ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్ పాసు చేయించి, మెట్రిక్ కూడా చదివిస్తున్నది. ఇలా రోజులెంతవేగంగా గడిచిపోయాయంటే మైత్రేయి కి ప్రసాద్ గురించిన ఆలోచన కూడా తగ్గిపోయింది. హఠాత్తుగా ఒక రోజు ప్రసాద్ మైత్రేయిని కలవడానికొచ్చాడు. 

“ ప్రసాద్ ! నువ్వేనా ఇలా అయిపోయావేంటి? ఆ గడ్డం ఏంటి ? మోహంలో ఎప్పుడు ఉండే చిరునవ్వేమయిపోయింది?  తెనాలికి గుంటూరు ఏమంత దూరమని నువ్వు రావడమే లేదు. నీకు తెలుసా, నువ్వు వచ్చి ఎన్ని రోజులయిందో?” అంటూ రాంబాయమ్మగారు గుక్క తిప్పుకోకుండా అడిగింది ప్రసాద్ ని .  అన్ని టికీ చిరునవ్వే సమాధానం గా మౌనం గా కూర్చున్నాడు సోఫా లో. 

ఆమె ప్రశ్నలప్రవాహం ఆగిన తరువాత , “ఆంటీ !మైత్రేయి లేదా?” అడిగాడు బలహీనంగా.

 “అయ్యో నామతిమండ! నిన్ను చూసిన సంతోషంలో గలగలా మాట్లాడేస్తున్నానే గాని , నీ క్షేమ సమాచారం మాత్రం అడగలేదు. ఎలాఉన్నావు ప్రసాదు? మైత్రేయి వచ్చే టైం అయింది. పాప ఐస్క్రీమ్ కావాలని గొడవచేస్తుంటే బజారుకి తీసుకెళ్లింది,” చెప్పింది. 

“అయితే నేను కూడా అలా తిరిగొస్తాను ఆంటీ! మైత్రేయి వస్తే చెప్పండి నేను వచ్చానని/” అంటూ లేచాడు.

“ నేను వచ్చేసాను ప్రసాద్! నువ్వు వెళ్ళక్కరలేదు ,” అంటూ చెప్పులు స్టాండ్ లో పెట్టి లోపలకి వచ్చింది మైత్రేయి. 

“ హాయ్ మైత్రేయి!” అన్నాడు ఎంతో ఆప్యాయంగా. 

“ హాయ్! “ అంటూ ప్రసాద్ ని పరికించి చూసింది. ‘ప్రసాద్ చాలా పాడై పోయాడు అనిపిస్తున్నది. తాను కూడా పనులమధ్యలో పడి  ప్రసాద్ గురించి పట్టించుకోవటం లేదు. అందుకే ఈ  సారి చాలా రోజులు , కాదు కాదు  రెండు మూడు నెలల తరువాత తనని కలవటానికి వచ్చాడు. అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుతున్న కూడా అంతగ తన గురించి ఏమి చెప్పలేదు. ఇప్పుడు చూస్తే ఎదో చాలా పెద్ద విషయమే జరిగినట్లున్నది’ అనుకుంటూ “ పెద్దమ్మ, నాకు ప్రసాద్ గారికి నీ చెత్తోటి   మంచి కాఫీ ఇవ్వు,” అంది. రాంబాయమ్మ గారు ఆశ ని ఒడి నుండి దింపి వంటగది లోకి వెళ్ళింది. ఆశ వచ్చి బెరుకుగా ప్రసాద్ ని చూస్తూ మైత్రేయి ఒడిలో కి ఎక్కి కూర్చుంది. పాప చాల ముద్దుగా , ఆరోగ్యంగా ఉన్నది. 

  “ప్రసాద్!ఎలా ఉన్నారు! తెనాలిలో అందరు బాగున్నారా? ముఖ్యంగా రమాదేవి గారు, అక్కమ్మ  ,” అంటూ కుశల  ప్రశ్నలు వేసింది. 

“అందరు బాగానే ఉన్నారు మైత్రేయి. అక్కమ్మ నిన్ను తలుచుకోని రోజే లేదు. తానే నన్ను ఇక్కడకి పంపింది. నేను పాడై పోయనంటా. నువ్వుమాత్రమే నాకు నచ్చ చెప్పగలవని. రోజు పోరుపెట్టింది. అందుకే నిన్ను కలవటానికి ఇవాళ వచ్చాను. నీకేమి ఇబ్బంది లేదు కదా?నువ్వెలా ఉన్నావు చెప్పు?” అన్నాడు. 

“ఏమన్నావ్? నాకు ఇబ్బందా? ఏది మళ్ళీ అను? అప్పుడుచెబుతాను నీ  సంగతి,” అంటూ చిరుకోపం ప్రదర్శించింది. కోపంతో రెపరెప లాడిన అందమయిన  ఆమె కళ్ళని చూస్తూ నవ్వేసాడు. తాను కూడా అతని నవ్వుతో స్వరం కలిపింది.      

ఇంతలోకే రాంబాయమ్మ కాఫీ చేసి పట్టుకొచ్చింది. కాఫీ తాగిన తరువాత మైత్రేయి అంది,”పెద్దమ్మ, నువ్వు పాప తినేసేయండి. నేను ప్రసాద్ గారి తోటి అలా బయటి కి వెళ్లి వస్తాను,” అంటూ “ ప్రసాద్ పద,” అంటూ లేవదీసింది. 

ఇద్దరు కలిసి శంకరవిలాస్  రెస్టారెంట్ కి వెళ్లారు.  రూఫ్ గార్డెన్  లో ఒక మంచి కార్నర్ చూసుకొని కూర్చున్నారు. చనువుగా ప్రసాద్ చేయి పట్టుకొని ,” ఇలా అయిపోయావేంటి ప్రసాద్? అంతలా ఏంజరిగింది,” అన్నది . 

ఆ కాస్త ఆప్యాయతకి ప్రసాద్ హృదయం ద్రవించింది. కళ్లల్లో కన్నీటి పోర కనిపించనీయ కుండా  తలదించుకుని,”నా మనసేమి బాగుండటం లేదు మైత్రేయి! చాలా ఒంటరి గా ఫీల్ అవుతున్నాను. ఒక్కసారిగా అందరు నన్ను వదిలేశారని పిస్తున్నది. ఎంతో కాలం క్రితం నా అమ్మ నాన్నలను కోల్పోయాను. నా కంటూ ఒక తోడు దొరికింది, నన్ను ఆప్యాయం గా చూసుకునే ఒక మంచి కుటుంబం దొరికిందని సంతోషించే లోపే అంత ముగిసి పోయింది. రెండు నెలల క్రితమే నాకు అపూర్వ కి విడాకులు మంజూరయ్యాయి” అన్నాడు.  

 “ ప్రసాద్ , మనం అనుకున్నట్లు అన్ని జరిగితే అది జీవితం ఎలా అవుతుంది. మనలాటి వాళ్లకి మన జీవన వైకుంఠ పాళిలో పాములే తగులుతాయి. చిక్కు ప్రశ్నలే మిగులుతాయి. ఎంతో బాధలో కూరుకు పోయిన నన్ను లేపి నిలబెట్టింది నువ్వే. అలాటి నువ్వే ఇలా అయిపోతే ఎలాగా చెప్పు,” అంది స్నేహపూర్వకం గా. 

 

“ అవును మైత్రేయి! ఒక సత్యం నాకు అర్ధమయింది. మనసుకు నచ్చిన వాళ్ళని వదులుకోవటం ఎంత కష్టమో, అలాగే ఎదుటి వాళ్ళకి మాటలతో ధైర్యం చెప్పడం అంతే సులువు. నా దాకా వచ్చాక గా ని నాకు అర్ధం కాలేదు, నువ్వెంత వ్యధచెందావో. ఎంత నిబ్బరం గా నెట్టుకొచ్చావో. నువ్వే నాకు స్ఫూర్తి. కానీ నువ్వు కూడా అక్కడ లేవు కదా! అందుకే నాకు నేను సర్దిచెప్పుకోలేక నీ దగ్గరికొచ్చాను,” అన్నాడు .

 “ఇన్నిరోజులకా,” అన్నది చిరునవ్వుతో. 

“చెప్పు, మనం సూప్ తాగుదామా ? ఆ తరువాత డిన్నర్ చేద్దాము,” అన్నది. “అలాగే,” అన్నాడు ఎంతోకాలం గా దూరమయిన ఆనందం దొరికినట్లయింది. 

డిన్నర్ చేస్తూ మైత్రేయి గలగలా కబుర్లు చెబుతూనే ఉన్నది. ప్రసాద్ మనసంతా మైత్రేయి చెప్పే కబుర్లతో నిండిపోయింది. ఒంటరితనానికి, బాధకి చోటులేనంతం గా అతని మనసుని తన సరదా  కబుర్లతో, కాలేజీ విషయాలతో, ఆశ చేసే అల్లరితో, ఆ పాప తో రాంబాయమ్మ గారు పడుతున్న పా ట్లు, సంస్థ లో జరుగుతున్న కార్యక్రమాలు,”  ఇలా ఎన్నో కబుర్లు చెప్పింది. 

  ప్రసాద్ అన్నాడు,” మైత్రేయి  నేనిక వెళతాను, లాస్ట్ బస్ వెళ్లిపోతుందేమో అన్నాడు. 

 “ అదేం లేదు ప్రసాద్ నువ్వు ఈ  రాత్రికి మా ఇంట్లోనే ఉండు. శనివారమేకదా.  రేపు వెళ్లొచ్చు,” అన్నది. ఆమె మాటను కాదన లేక అలాగే అని తలూపాడు.  దారిలో ఒక మాల్ కెళ్ళి కొన్ని వస్తువులు కొనుకొచ్చింది, ఒక డ్రెస్ బాగ్ తో టి. 

ఇల్లు చేరగానే ,”ప్రసాద్ ! నీళ్లు చాలా వేడిగా ఉన్నాయి గా ని ఇదిగో ఈ సామాను తీసుకొని వాష్రూమ్ లేకెళ్లి  ఆ గడ్డం తీసేసి , మంచిగా ఈ నైట్ సూట్ వేసుకొని రండి,” అని చనువుగా పురమాయించింది. 

మైత్రేయి చెప్పినట్లు ఫ్రెష్ అప్ అయి వచ్చిన ప్రసాద్ చక్కనయ్యా చిక్కినా పరవాలేదు అన్నట్టు గా ముచ్చట గా కనిపించాడు  రాంబాయమ్మ గారి కళ్ళకి. “ఇప్పుడు శుబ్బరంగా మా ప్రసాద్ లా గే ఉన్నా వయ్య ,” అంటూ తియ్యటి మజ్జిగ  ఇచ్చింది తాగ టానికి.

   “అమ్మయ్య ! మిమ్మల్నలా చూసి చాలా భయపడిపోయానండి  బాబు!” అంది నాటకీయం గా.  “పెద్దమ్మ ! నువ్వు రా పడుకుందాము,”  అంటూ ఆశ బెడ్ రూమ్ లో నుండి పిలవడం మొదలెట్టింది. రాంబాయమ్మ గారు , మీరు కూడా ఇవాళ నా రూమ్  లోకొచ్చి పడుకోండి. మీ గది  ప్రసాద్ కి ఇవ్వండి, మీ  గది లోపడుకుంటాడు,” అంది. 

  “అలాగే తల్లి!” అని ఆమె పక్క సర్ది వచ్చింది. ప్రసాద్ తన షర్ట్ జేబులోంచి చాక్లెట్స్ తీసి ,” ఆశ బేబీ!” అంటూ పిలిచాడు. గున  గున  నడుచుకుంటూ నైట్ డ్రెస్ లో ఎంతో ముద్దుగా  ఆశ,” ఏంటి! అంకుల్! పిలిచారు నన్ను?” అంటూ ఆరిందాలాగా చేతులు కళ్ళు తిప్పుతూ అడిగింది.

 “ అవునమ్మా!” అంటూ పాప ని ఎత్తుకొని చాక్లెట్స్ ఇచ్చాడు,”ఇవన్నీ నాకేనా!?” అంది చక్రాలాంటి కళ్ళు తిప్పుతూ. “అవును” అన్నాడు.”అయితే పెద్దమ్మ, ఇవన్నీ నావే!నీకియ్య!” అంటూ తుర్రు  మని  వెళ్ళిపోయింది. ఇద్దరు నవ్వుకున్నారు.”ప్రసాద్ ! హాయిగా పడుకోండి,” రేపు మాట్లాడుకుందాము , రేపెలాగు ఆదివారమే కదా మీరు కూడా నాతో  పాటె సంస్ధ కి రండి, గుడ్ నైట్ ,”అని చెప్పి రూమ్ లోకి వెళ్ళిపోయింది. 

  ప్రసాద్ కి మనసు శరీరం తేలికయి తేలిపోతున్నట్లుగా, రెండు నెలలుగా తాను అనుభవిస్తున్న భారమంతా తగ్గి పోయినట్లుగా అయి పడుకోగానే నిద్దరలోకి ఒరిగిపోయాడు.

                                                    ***************************** 

  ఉదయాన్నే టిఫిన్ చేసి మైత్రేయి, ప్రసాద్ ఆశ ని కూడా తీసుకొని చేయూత ఆశ్రమా నికి వెళ్ళారు. వసంత కొన్ని రికార్డ్స్ మీద మైత్రేయి సంతకాలు తీసుకొని అటెండర్ చేత నిమ్మరసం తెప్పించి ఇచ్చింది. 

   ఆశ “ చిన్నమ్మ ఎక్కడ ఆంటి?” అడిగింది. 

“ రాజు, పాపని జ్యోతి దగ్గరికి తీసుకెళ్ళు. కొద్దిసేపట్లో నేనుకూడా వస్తానని చెప్పు” అంది మైత్రేయి. 

  పాప ఉత్సాహంగా “పద రాజంకుల్ చిన్నమ్మ దగ్గరికి వెళదాము” అంటూ చెయ్యిపెట్టి లాగింది. 

 “త్వరగా తీసుకెళ్ళు. లేకపోతే నిన్ను నిలబడనీయదు” అంది వసంత.

   “అలాగే మేడం” అని రాజు పాప చే పుచ్చుకొని రెండో అంతస్తులో ఉన్న ప్రార్ధనమందిరం దగ్గరికి తీసుకెళ్ళాడు. 

 ఆశ “థాంక్స్ అంకుల్” అంటూ లోపలకు పరిగెట్టి జ్యోతి మెడ  చుట్టూ చెతు లు వేసి ”చిన్నమ్మ,నేను వచ్చాను. నువ్వీ క్కడ కూర్చున్నావెంటి ,పద అడుకుందాము “ అని గోముగా పిలిచింది. జ్యోతి సంబరంగా ఆశ ను ఒడిలో కూర్చోపెట్టుకొని ముద్దాడి,”పద ఆడుకుందాము”  అని ధ్యాన మందిరం లో పెట్టి ఉంచిన కలకండ ముక్కలు పాప నోట్లో పెట్టి , పాపని ఎత్తుకొని బయటికి నడిచింది. 

  “ పిన్ని ఆశ వచ్చింది” అంది రమణమ్మ దగ్గరికెళ్ళి. “ఏం చిన్న మేడం గారు ! బాగున్నారా! మీ పెద్దమ్మ కూడా వచ్చిందా?” అంది దాని బుగ్గమీద ముద్దుపెడుతూ. “పెద్దమ్మ కూడా వచ్చింది అమ్మమ్మ,” చెప్పింది ఆశ. “ జ్యోతీ పద మైత్రేయి నీ కలిసి ఎం తినా లనుకుంటున్నదో  అడిగి తనకి, పాపకి నచ్చిన వంట చేద్దాము” అంటూ ఆఫీస్ వైపుకి వెళ్ళారు. రమణమ్మ “ అరె ప్రసాద్ బాబు! మీరుకూడా వచ్చారా! బాగున్నారా బాబు! చాలా కాలమైంది మిమ్మల్ని చూసి!” అంటూ పలకరించింది.

 “ బాగున్నాను రమణమ్మ గారు! మీరెలా ఉన్నారు?” అంటూ పరమర్శించాడు. 

“ మైత్రేయి! ఇవాళ ఏం వండమంటావో చెప్పు!” అంది.

  “నన్నెందుకు అడుగుతారు, మీ పక్కనే ఉన్నారుగా మీ చిన్న మేడం. ఆమెని అడగండి. సూకిరాలెక్కువ!” అంటూ నవ్వేసింది. 

  ”నాకేమో కారప్పూస కావాలి అమ్మమ్మ!” అందరూ పెద్దగా నవ్వేసారు.

“అలాగే తల్లి,అదెంత భాగ్యం! ఇవాళ ప్రసాద్ అంకుల్ కూడా వచ్చాడు కదా! పద నేను రుచిగా పులిహోర చేస్తాను. నువ్వు మీ చిన్నమ్మతో కాసేపు ఆడుకో, నీకోసం కూడా కారప్పూస చేస్తాను,” అంటూ పద జ్యోతి అంది. వెళుతున్న జ్యోతీ ప్రసాద్ నే చూస్తూ రమణమ్మ వెనకాతలే వెళ్ళడం మైత్రేయి దృష్టిని దాటిపోలేదు.

ప్రసాద్ లేచి “మైత్రేయి, నువ్వు ఆఫీస్ పని చూసుకొని రా నేను ఆశ్రమం అంత చూస్తాను,” అని బయటికి నడిచాడు. పాత  భవనమే అయినా చాల అందంగా అమర్చబడిఉన్నాయి కారిడార్లు. కొన్ని ఇండోర్ మొక్కలు పెట్టబడి ఉన్నాయి. కారిడార్లు చివర్న ఉన్న బాల్కనీలో కొన్ని కుర్చీలు, వాటి పక్కనే వార్తాపత్రికలు పెట్టి ఉన్నాయి. అక్కడి నుంచి చుస్తే ఆశ్రమం చుట్టూ పెంచిన పెద్ద చెట్లు చల్లగా కనిపించాయి. అక్కడ ఆడుకోవటానికన్నట్టు టెన్నిస్ కోర్ట్ కనిపించింది. కొందరు పెద్ద వాళ్ళు అక్కడ కుర్చోని కబుర్లు చెప్పుకుంటున్నారు. 

    పై అంతస్తులోకి వెళ్ళాడు. అక్కడ వరుసగా ఉన్న నాలుగు గదులని ఒక హాల్ లాగ మర్చి ప్రార్ధనా  మందిరం ఏర్పాటు చేయబడి ఉంది. ఎదురుగ ఉన్న పెద్ద గోడకి ‘ఓం’ పెయింటింగ్ వేసి ఉన్నది. 

ఇంకో వైపు కర్ర పట్టుకొని నిలుచుని ఉన్న బాపూజీ అయన పక్కనే ఉన్న కస్తూరిబా పెయింటింగ్స్ ఉన్నాయి. చక్కటి చాపలు పరిచి ఉన్నాయి. ప్రసాద్ చెప్పులు ఇప్పి లోపలికెళ్ళి కూర్చున్నాడు. మనసంతా ప్రశాంతంగా అనిపించింది. ఎప్పుడు ఏవో ఆలోచనలతో నిండి ఉండే మనసు నుండి అక్కడ కూర్చోగానే అవి పారిపోయాయేమో అనిపించింది. కోద్ది  సేపు అలాగే కళ్ళుమూసుకొని కూర్చున్నాడు. ఆ  తరువాత బయటికొచ్చాడు. ఇంత దీక్ష తో ఈ ఆశ్రమాన్ని తనదిగా మార్చుకున్న మైత్రేయి కి తన మనసులో మాట ఎప్పటికి చెప్పకూడదు అని నిర్ణయించుకుంటాడు ప్రసాద్. 

     క్రింద గ్రౌండ్ వైపుకి వెళ్ళాడు. దారిలోనే  రాజు కాఫీ గ్లాస్ అందించాడు. అది పట్టుకొని టెన్నిసు కోర్ట్ వైపుగా నడిచాడు. అక్కడ కొందరు ఆంటీ లు,  జ్యోతి  ఆశ కళ్ళకి గంతలు కట్టి ఆడుతున్నారు. దగ్గరికెళ్ళిన ప్రసాద్ ని చుట్టేసి “ దొంగ దొరికాడు,” అంటూ ఎగురుతూ చప్పట్లు కొడుడు తన కళ్ళ గంతలు తీసేసి, “అంకుల్ ఇప్పుడు మీరు గంతలు కట్టుకోవాలి,” అంటూ హడావిడి చేసింది ఆశ. 

  అలాగే అంటూ కళ్ళకి గంతలు తానే కట్టుకున్నాడు. “ అంకుల్ ఇప్పుడు చెప్పండి, నాకెన్ని వేళ్ళు,” అడిగింది.” నాకేమి కనిపించటంలేదు రా!” అన్నాడు. ఆట మొదలయింది. 

ఆశ జ్యోతి చేయి పట్టుకొని పరిగెడుతూ ఆడుతున్నది. చివర్లో ఆశ నవ్వు వింటూ ఆశ అనుకోని జ్యోతిని పట్టు కున్నాడు ప్రసాద్. “చిన్నమ్మ దొంగ ఇప్పుడు అంటూ అరిచింది ఆశ. కంగారుగా కళ్ళగుంతలు తీసి చూసాడు. తానింకా జ్యోతి చేయి పట్టుకొనే ఉన్నాడు. వెంటనే వదిలేసాడు. అందరు చిన్నపిల్లలాగా “జ్యోతి ఇప్పుడు నువ్వు,” అంటున్నారు. 

ఎప్పుడు వచ్చిందో మైత్రేయి కూడా అక్కడకు వచ్చింది. జ్యోతి మొహం లో మారిన రంగుని గమనించింది. ప్రసాద్ కంగారుగా చేయివదిలేయటం కూడా చూసింది. “every thing is fair in love and war,” అని తాను కూడా ఆటలో చేరింది. ఆట మరింత ఉత్సాహంగా సాగింది, రమణమ్మ గారు వచ్చి భోజనం చేద్దాం రండి అని పిలిచేవరకు. భోజనాలు చేసిం తరువాత మైత్రేయి ఆశ , ప్రసాద్ బయలు దేరారు వెనక్కి. 

 ప్రసాద్ అన్నాడు,” మైత్రేయి నాలాటి వాళ్ళ కోసం కూడా నీ ఆశ్రమ లో కాస్తంత చోటు ఏర్పాటు చేయొచ్చుకదా?” 

“ నువ్వే ఒకరికి ఆసర కావాల్సిన వయసులో నీకు ఆశ్రమం అవసరమేంటి ప్రసాద్. ఎక్కువ ఆలోచించి మనసు పాడుచేసుకోకు. పరిస్థితులు ఎప్పుడు ఒకేరకంగా ఉండవు. నీ జీవితంలోకి కూడా నిన్ను ఆరాధించే వాళ్ళు రావచ్చు కదా!”

“ నాకు అలాటి ఆశ లేమీ మిగలలేదు మైత్రేయి! నాకు ఎవరి మీదయినా మనసు పెంచుకోవాలంటే భయం. వాళ్ళు నాకు దూరమయిపోతారేమో నని. అపూర్వ శాశ్వతం గా వెళ్ళిపోయింది. నువ్వు కూడా నన్ను వదిలేసి నీ పనులలో మునిగి పోతున్నావు. కనీసం నాకోసం ఒకరున్నారన్న ఆశ అయితే నాకు లేనే లేదు,” అన్నాడు నిరాశగా.  

‘నీకోసం ఒక మార్గం తప్పక చూస్తాను ప్రసాద్. నిన్నిలా వదిలేయలేను. నీలాంటి మంచిమనిషి జీవితం నిరాశతో మిగిలిపోకూడదు. నీ కున్న మంచి స్నేహితురాలిగా నేనే ఒక నిర్ణయం తీసుకుంటాను,’ అని మనసులో అనుకోంది.  

      (ఇంకా ఉంది)   

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు – శ్రీమతి పల్లవి

ఒడిపిళ్ళు